Showing posts with label traditional. Show all posts

సింపుల్ పొంగడాలు

కావలసిన పదార్దాలు
బియ్యం : పావుకిలో
కొబ్బరి కోరు : కప్పు
బెల్లం : రెండొందల గ్రాములు
నూనె : వేయించటానికి సరిపడ

తయారుచేయు విధానం:

1) బియ్యం మూడు గంటలు నానబెట్టి మిక్సిలో వేసి మెత్తగా చేయ్యాలి.
2) దీనిలోనే బెల్లం వేసి మరోసారి గ్రయిండ్ చేయ్యాలి.
3) దీనిని ఒక గిన్నెలోకి తీసి కొద్దిగా నీళ్ళు పోసి గరిటె జారుగా చేసి దీనిలో కొబ్బరి కోరు కలపాలి.
4) ఇప్పుడు నూనె వేడి చేసి ఈ పిండిని గరిటెతో కొద్ది కొద్దిగా తీసి కాగేనూనేలో పొంగడాలుగావేసి ఎర్రగా వేగాక ఒక ప్లేటులోకి తీసి వడ్డించాలి.(తినటమే)



ఖర్జూరం కుడుములు 

కావలసిన పదార్ధాలు:

బియ్యపు రవ్వ : కప్పు 
పెసరపప్పు: పావు కప్పు 
ఖర్జూరాలు : పదిహేను  
కొబ్బరి తురుము : పావు కప్పు 
నెయ్యి : కొద్దిగా  
యాలకుల పొడి : చిటికెడు 
మంచినీళ్ళు : మూడు కప్పులు 
పాలు : కప్పులు 

తయారు చేసే విధానం:

1) స్టవ్ ఫై నీళ్ళు, పాలు కలిపి స్టవ్ మీద పెట్టుకోవాలి.
2) నీళ్ళు బాగా మరుగుతున్నప్పుడు పెసరపప్పును వేయాలి.
3) పెసరపప్పు కొద్దిగా ఉడికిన తరువాత బియ్యపు రవ్వని పోసి ముద్ద కాకుండా కలుపుతూ ఉండాలి.
4) ఈ మిశ్రమం ఉడికిన తర్వాత దించి పక్కన పెట్టుకోవాలి. 
5) తరువాత ఖర్జూరాన్ని చిన్న ముక్కలుగా కోసి మిక్సీలో వేసి మెత్తగా చేసుకోవాలి.
 6) ఖర్జూరంలో కొబ్బరి తురుము, యాలకుల పొడి, నెయ్యి వేసి కలుపుకోవాలి.
7)తర్వాత దీన్ని చిన్నచిన్న  ముద్దలుగా చుట్టుకోవాలి.
8) ఇప్పుడు ఉడికిన బియ్యపు రవ్వకొద్దిగా చేతిలోకి తీసుకోని 
వెడల్పుగా చేసి దీనిలో కర్జురపు ఉండను పెట్టి గుండ్రంగా చుట్టాలి.
9) ఇప్పుడు వీటిని  ఇడ్లీ కుక్కర్ లో పెట్టి పది  నిమిషాలు ఆవిరి మీద ఉడకనివ్వాలి.
 అంతే రుచిగా ఉండే ఖర్జూరం కుడుములు రేడి.

కావలసిన పదార్దాలు : 

బియ్యప్పిండి : కప్పు 
ఉప్పు : తగినంత 
కారం : అర టీ స్పూన్ 
వాము : టీ స్పూన్ 
నువ్వులు : టీ స్పూన్ 
నూనె : వేయించటానికి సరిపడా 

తయారుచేయు విధానం :

1) బియ్యం రెండు గంటలు నీటిలో నానబెట్టి నీళ్ళు వంచి మెత్తని పిండిలా మిక్సి పట్టాలి. 
2) బియ్యప్పిండిలో కారం, ఉప్పు, వాము, నువ్వులు వేసి కలిపి నీళ్ళు పోసి జిగురుగా కలపాలి.
3) దీనిని చేతితో ఒక క్లాత్ మీద సకినాలుగా గుండ్రంగా వెయ్యాలి.వీటిని కాసేపు ఆరనివ్వాలి.
4) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. 
5) నూనె కాగిన తరువాత ఆరిన సకినాలు వేసి రెండు ప్రక్కలా దోరగా వేయించి తీసుకోవాలి.

అంతే కరకరలాడే సకినాలు రెడీ.


కావలసిన పదార్దాలు :

సోరకాయ : చిన్నది చిన్న ముక్కలుగా చేసి ఉడికించాలి.
పాలు : అర లీటరు
బియ్యం : రెండు స్పూన్లు నానబెట్టాలి 
కొబ్బరి తురుము : రెండు టేబుల్ స్పూన్లు
పంచదార : రెండు వందల గ్రాములు
యాలకులపొడి : అర టీ స్పూన్
జీడిపప్పులు, కిస్మిస్లు : పావు కప్పు

తయారు చేయు విధానం :

1) స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు మరిగించాలి.
2) మిక్సి జార్లో నాన బెట్టిన బియ్యం, కొబ్బరి కలిపి మెత్తగా గ్రైడ్ చెయ్యాలి. 
3) మరుగుతున్న పాలల్లో పంచదార, మెత్తగా చేసిన బియ్యం మిశ్రమం,ఉడికించిన సోరకాయ ముక్కలు వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
4) పదినిముషాలు ఉడికిన తరువాత నేతిలో వేయించిన జీడిపప్పులు, కిస్ మిస్ లు, యాలకుల పొడి వేసి కలపాలి.
అంతే  ఎంతో రుచిగా ఉండే వేడి వేడి సోరకాయ పాయసం రెడీ.


కావలసిన పదార్దాలు :

పోట్లకాయ : చిన్నది (చిన్న ముక్కలుగా చేసి ఉడికించాలి.)
పాలు : అర లీటరు
బియ్యం : రెండు స్పూన్లు నానబెట్టాలి 
కొబ్బరి తురుము : రెండు టేబుల్ స్పూన్లు
పంచదార : రెండు వందల గ్రాములు
యాలకులపొడి : అర టీ స్పూన్
జీడిపప్పులు, కిస్మిస్లు : పావు కప్పు

తయారుచేయు విధానం :

1) స్టవ్ మీద గిన్నె పెట్టి పాలు మరిగించాలి.
2) మిక్సి జార్లో నాన బెట్టిన బియ్యం, కొబ్బరి కలిపి మెత్తగా గ్రైడ్ చెయ్యాలి. 
3) మరుగుతున్న పాలల్లో పంచదార, మెత్తగా చేసిన బియ్యం మిశ్రమం,ఉడికించిన పోట్లకాయ ముక్కలు వేసి చిన్న మంట మీద ఉడికించాలి.
4) పదినిముషాలు ఉడికిన తరువాత నేతిలో వేయించిన జీడిపప్పులు, కిస్ మిస్ లు, యాలకుల పొడి వేసి కలపాలి.
అంతే  ఎంతో రుచిగా ఉండే వేడి వేడి పోట్లకాయ పాయసం రెడీ.


కావలసినపదార్దాలు:

మినపప్పు : కప్పు
బియ్యప్పిండి : మూడు కప్పులు
కారం : టీ స్పూన్
నువ్వులు : టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
వాము : టేబుల్ స్పూన్
 వెన్న : టీ స్పూన్
నూనె : వేయించటానికి సరిపడ

తయారుచేయు విధానం :

1) మినపప్పు నానబెట్టి కడిగి మెత్తగా రుబ్బాలి.
2) దీనిలో ఫైన చెప్పిన వాటిలో నూనె తప్పించి మిగతా
పధార్దాలన్ని వేసి ముద్దలా కలపాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
4) నూనె కాగాక ఈ ముద్దను కొద్దిగా తీసుకోని జంతికల గొట్టంలో పెట్టి కాగె నూనెలో జంతికలా వెయ్యాలి.
5) జంతికలు రెండు ప్రక్కల  దోరగా వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
అంతే మినప జంతికలు రెడీ. 

కావలసిన పదార్దాలు: 

అరటి కాయ : ఒకటి 
పంచదార : ఒక కప్పు 
పచ్చి కొబ్బరి తురుము : ఒక కప్పు 
గోధుమ పిండి : అర కప్పు 
బొంబాయి రవ్వ : పావు కప్పు 
నువ్వులు : రెండు టేబుల్ స్పూన్లు 
నూనె : అర కిలో 
నెయ్యి :మూడు టీ స్పూన్లు 

తయారు చేయు విధానం :

1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి దానిలో పంచదార, కొబ్బరి వేసి కొద్దిగా నీళ్ళు పోసి తీగ పాకం వచ్చేవరకు కలుపుతూ పాకం వచ్చాక నెయ్యి వేసి కలపాలి.
2) ప్రక్క స్టవ్ ఫై ఒకగిన్నేలో అరటి ముక్కలు, కొద్దిగానీళ్ళు పోసి ఉడికించాలి.
3) మెత్తగా ఉడికిన అరటి ముక్కలు కొబ్బరి, పంచదార పాకంలో వేసి కలపాలి.
4) బాగా  కలిసాక గోధుమపిండి, రవ్వ,నువ్వులు వేసి కలపాలి.   
5) ఒక కప్పులోకి కొద్దిగా గోధుమపిండి, కొద్దిగా నీళ్ళు వేసి చిక్కగా కలిపి పక్కనపెట్టాలి. 
6) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక ఈ ముద్దను చిన్నచిన్న ఉండలుగా చేసి కలిపిన గోధుమ పిండి అర చేతిలో రాసుకొని ఈ ఉండను చేతితో  కొంచెం మందంగా వెడల్పుగా చేసి కాగె నూనెలో వేసి చిన్న మంట మీద దోరగా వేయించు కోవాలి. అంతే అరటి అరెసులు రెడీ.

కావలసిన పదార్దాలు :

నువ్వులు : పావుకిలో

బెల్లం : పావుకిలో
నెయ్యి : టేబుల్ స్పూన్

తయారుచేయు విధానం :


1) నువ్వులు శుబ్రం చేసి దోరగా వేయించండి.(వేయించకుండా కూడా చేసుకోవచ్చు)

2) బెల్లం చిన్నముక్కలుగా చెయ్యాలి.నువ్వులు రోట్లో వేసి దంచి మెత్తగా అయ్యిన తరువాత బెల్లం వేసి దంచితే గట్టిగా ముద్దలా అవ్వుతుంది.
3) దీనిలో నెయ్యి కలిపి ఉండలు చుట్టుకోవాలి.

* అంతే ఇవి పిల్లలకు చాలా బలవర్ధకం అయ్యినవి.


కావలసిన పదార్దాలు: 
 
కందిపప్పు : ఒక కప్పు 
ఎండు మిర్చి : ఆరు 
జీలకర్ర : టీ స్పూన్ 
వెల్లుల్లి రెబ్బలు : ఐదు 
ఉప్పు : సరిపడ
నూనె : ఒక స్పూన్ 


తయారుచేయు విధానం: 

1) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చెయ్యాలి. దీనిలో స్పూన్ నూనెవేసి. కాగాక 
ఎండి మిర్చి, జీలకర్ర వేసి వేయించాలి.వీటిని మిక్సి జార్లో వేసి గ్రైండ్ చెయ్యాలి. 

2)  ఇప్పుడు అదే పాన్లో కంది పప్పువేసి దోరగా వేయించాలి. వేయించిన కందిపప్పు గ్రైండ్  చేసిన ఎండిమిర్చిలో వేసి మళ్ళి గ్రైండ్  చెయ్యాలి.

3) ఇప్పుడు ఉప్పు, వెల్లుల్లి వేసి మరొకసారి గ్రైండ్  చేస్తే చాలు ఎంతో రుచిగా ఉండే కందిపొడి రెడీ.

ఇది ఇడ్లి, ఉప్మా,దోశెల్లోకి ఎంతో బాగుంటుంది. 

కావలసిన పదార్దాలు :
 
మామిడి తురుము : అర కప్పు 
క్యారెట్ తురుము : కప్పు 
బీట్ రూట్ తురుము : పావు కప్పు 
పచ్చి కోవా : కప్పు 
మైదా : మూడు కప్పులు 
నెయ్యి : కప్పు 
పంచదార : రెండు కప్పులు 
యాలుకులపొడి : టీ స్పూన్ 
ఉప్పు : చిటికెడు 
నూనె : కప్పు 

తయారుచేయు విధానం :

1) మైదాలో కొద్దిగాఉప్పు, కొద్దిగా నూనె వేసి పాలు పోసి ముద్దలా కలిపి ఒక గంట పక్కన పెట్టాలి.
2) స్టవ్ ఫై కళాయి పెట్టి నెయ్యి వేడి చెయ్యాలి. బీట్ రూట్ , క్యారెట్ తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
3) దానిలో మామిడి తురుము కూడా వేసి కొద్ది సేపు వేయించాలి.
4) ఇప్పుడు పంచదార, కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించాలి.
5) బాగా ఉడికి దగ్గర పడ్డాక కోవా, యాలుకుల పొడి వేసి కలిపి దించి చల్లారనివ్వాలి.
6) ఇప్పుడు మైదాను చిన్నచిన్న ఉండలుగా చెయ్యాలి.
7) ఒక ఉండను చేతిలోకి తీసుకోని పాలిధిన్ కవరు ఫై నూనె  రాసి
 కొంచెం వెడల్పుగా చెయ్యాలి.
8) దీనిలో మామిడి మిశ్రమం పెట్టి చుట్టూ మూసెయ్యాలి. దీనిని చిన్న పూరీ లా చేతితో  (వత్తి )చెయ్యాలి. 
9) స్టవ్ ఫై పెనం పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి చేసిన బొబ్బట్టు వేసి రెండు ప్రక్కలా దోరగా కాలనివ్వాలి.

ఇలా అన్ని బొబ్బట్లు చేసుకొని సర్వ్ చెయ్యడమే. 

కావలసిన పదార్దాలు :

పాలు : రెండు కప్పులు
రవ్వ : ఒక కప్పు
బెల్లం : ఒక కప్పు
శెనగపప్పు : ఒక కప్పు
నూనె : వేయించటానికి సరిపడ
యాలకుల పొడి : టీ స్పూన్

తయారుచేయు విధానం :

1) స్టవ్ వెలిగించి శెనగపప్పు ఉడికించాలి. 
2) మెత్తగా ఉడికిన తరువాత నీళ్ళు ఉంటె వంచి, బెల్లం వేసి కలుపుతుంటే గట్టిగా పూర్ణం రెడీఅవ్వుతుంది. 
3) దీనిలో యాలకులపొడి వేసి దించి చల్లారనివ్వాలి. 
4) చల్లారిన తరువాత చిన్నచిన్న ఉండలుగా చుట్టాలి.
5) ఇప్పుడు పాలు మరిగించాలి. మరుగుతున్న పాలల్లో రవ్వ వేసి కలుపుతూ చిన్నమంటమీద ఉడికిస్తే ముద్దలా అవ్వుతుంది.
6) దీనిని చిన్నచిన్న ఉండలుగా చేసి అరచేతితో వెడల్పుగా చేసి దీనిలో పూర్ణం పెట్టి మళ్ళి ఉండలా చుట్టాలి.
7) ఇలా మెత్తం చేసి పక్కన ఉంచాలి.
8) స్టవ్ ఫై నూనె పెట్టి వేడిచెయ్యాలి. నూనె కాగాక చేసిపెట్టిన పూర్ణం ఉండలు వేసి దోరగా వేయించాలి. అంతే పాల ముంజలు రెడీ.

కావలసిన పదార్దాలు :


మైదా : అరకేజీ 
పంచదార : అరకేజీ 
నూనె : అరకేజీ  
ఉప్పు:  కొద్దిగా 
వంటసోడా : అర టీ స్పూన్
యాలుకులు పొడి : టీ స్పూన్ 
డాల్డా : వంద గ్రాములు 


తయారుచేయు విధానం :


1) మైదా జల్లించి ఒక పళ్ళెంలో వేసుకోవాలి. డాల్డా కరిగించాలి.
2) మైదాలో ఉప్పు, వంటసోడా, కరిగించిన డాల్డా వేసి బాగా కలిపాలి. 
3) తరువాత నీళ్ళు పోసి ముద్దలా కలిపి ఒకగంట పక్కనపెట్టాలి.
4) గంట తరువాత మైదా ముద్దను చిన్నచిన్న ఉండలుగాచేసి చపాతీలా పల్చగా వత్తుకోవాలి.
5) ఇలా చేసిన చేపాతీలను డైమండ్ ఆకారంలో కట్ చేసుకోవాలి. ఇలా అన్ని చేసుకోవాలి. 
6) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడిచేసి కట్ చేసిన ముక్కలు నూనెలో వేసి దోరగా వేయించాలి.
7) పక్క స్టవ్ మీద పంచదార ఒకగిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళు వేసి తీగపాకం పట్టాలి. పాకం వచ్చాక యాలుకులు పొడి వేసి స్టవ్ ఆపాలి.
8) వేయించిన డైమండ్స్ ని ఈ పాకంలో వేసి బాగా కలిపి ఒకపళ్ళెంలో వేసి చల్లారనివ్వాలి.
9) ఇలా చేస్తే ముక్కలు విడివిడిగా వస్తాయి. ఇవి నెల రోజులు నిల్వ ఉంటాయి.

కావలసిన పదార్దాలు : 


పాలు : అర లీటరు
బొంబాయి రవ్వ : కప్పు
పంచదార : కప్పు
యాలుకుల పొడి : అర టీ స్పూన్
నెయ్యి : రెండుటేబుల్ స్పూన్లు
బియ్యపు పిండి : టేబుల్ స్పూన్
మినపప్పు : కప్పు
బియ్యం : రెండు కప్పులు
నూనె : అర కేజీ


తయారుచేయు విధానం :


1) మినపప్పు, బియ్యం మూడు గంటల ముందు నానబెట్టాలి. దోశల పిండికంటే కాస్త గట్టిగా రుబ్బి ఉప్పు, కొద్దిగా పంచదార కలిపి పక్కనపెట్టాలి.
2) స్టవ్ మీద పాలు వేడి చేయాలి. కాగుతున్న పాలల్లో పంచదార వేసి కలుపుతూ ఉండాలి.
3) పాలల్లో పంచదార కరిగిన తరువాత రవ్వ వేస్తూ ఉండలు కట్టకుండా కలుపుతూ ఉండాలి.
4) రవ్వ గట్టిపడుతుండగా యాలుకుల పొడి వేసి కలిపి స్టవ్ నుండి దించి చల్లార నివ్వాలి. చల్లారిన తరువాత ఉండలుగా చేసి పక్కన పెట్టాలి.
5) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన తరువాత   మెత్తగా రుబ్బిన పిండిలో రవ్వ ఉండలు ముంచి కాగె నూనెలో వేసి దోరగా వేగిన తరువాత ప్లేటులోకి తీసి సర్వ్ చెయ్యాలి.

1
వంటపేరు : స్వీట్ గోరుమిటీలు 


కావలసిన పదార్ధాలు :

మైదా : అరకేజీ
బొంబాయి రవ్వ : పావుకేజీ
పంచదార : కేజీ
నెయ్యి : కప్పు 
నూనె : అరకేజీ
యాలుకలపొడి : టేబుల్ స్పూన్ 


తయారుచేయు విధానం :


1) మైదాని జల్లించి నెయ్యి, రవ్వ వేసి కలపాలి.
2) నెయ్యి, పిండి బాగా కలిసాక నీళ్ళుకలిపి ముద్దలా కలపాలి. దీనిని అర గంట పక్కనపెట్టాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి.
4) ఇప్పుడు పిండిని చిన్నఉండలుగా తీసుకోని చేతితో కాస్త పొడవుగా చేసి
 బొటనవేలుతో నొక్కి గోరిమిటిలా చేసి కాగే నూనెలో వేసి వేగనివ్వాలి.
5) అలామొత్తం పిండి అంతా గోరిమిటిలు చేసి పక్కన పెట్టాలి.
6) ఇప్పుడు పంచదారలో కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ మీదపెట్టి పాకం పట్టాలి. తీగ పాకం వచ్చాక దానిలో యాలుకల పొడి, నెయ్యి, వేపిన గోరిమిటిలు వేసి బాగాకలిపి ప్లేటులోకి తీసి చల్లారాక డబ్బాలో పెట్టుకోవాలి.

1
వంటపేరు : చల్ల గుత్తులు (గులాబీ పువ్వులు)
                                                                   

కావలసిన పదార్ధాలు :


మైదా : అరకేజీ
బియ్యంపిండి : పావుకేజీ
కోబ్బరి పాలు : పిండి కలపటానికి సరిపడా (రెండు కాయలు)
పంచదార : పావుకేజీ
(తీపి కావాలంటే ఇంక వేసుకోవచ్చు)
గుడ్లు : రెండు 
ఉప్పు : చిటికెడు 
గుడ్లు బాగా నురుగు వచ్చేలా బీట్ చెయ్యాలి. 


rose-cookiesతయారుచేయు విధానం :


1) మైదానిజల్లించి బియ్యం పిండి కలిపి ఉప్పు, గుడ్డు కలపాలి.   
2) కొబ్బరి పాలల్లో పంచదార కలిపి కరిగిన తరువాత పిండిలో కొద్దికొద్దిగా పోస్తూ ఉండలు లేకుండా కలపాలి. 
3) చిక్కగా బజ్జి పిండిలా కలపాలి.
4) ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేడి చెయ్యాలి. గులాబీ పువ్వుల గుత్తేను కాగే నూనెలో ముంచి కాలిన తరువాత పిండిలో సగం వరకు ముంచి తీసి, నూనెలో ముంచాలి.
5) నూనె వేడికి పువ్వు నూనెలో పడుతుంది. మళ్ళిగుత్తి ని పిండిలో ముంచి నూనెలో పెడితే కాసేపటికి పువ్వు నూనెలో పడుతుంది అలా పిండి మొత్తం వేసుకోవాలి.


* అంతే గులాబి పువ్వులు రెడి (హాట్ కావాలంటే పంచదార బదులు కారం 
   వేసుకోవాలి)



వంటపేరు : సున్నుండలు


కావలసిన పదార్ధాలు :


మినుములు : కేజీ
పంచదార : కేజీ లేదా బెల్లం
బియ్యం : వంద గ్రాములు
నెయ్యి : అర కేజీ


తయారుచేయు విధానము :


1) స్టవ్ వెలిగించి పాత్ర పెట్టి మినుములు దోరగా వేయించాలి. 
2) అలాగే బియ్యం కూడా దోరగా వేపి పక్కన పెట్టాలి.
3) ఇప్పుడు వేపిన మినుములను తిరగలిలో వేసి విసరాలి. విసిరిన పప్పుని 
    రోటిలో వేసి దంచితే పొట్టు పోతుంది.
4) పొట్టు పోయేలా చెరిగి, మినపప్పులో - వేపిన బియ్యంకూడా కలిపి 
    విసరాలి. (మరి మెత్తగా కాకుండా విసరాలి)
5) పంచదారను మిక్సిలో వేసి పొడి చెయ్యాలి (బెల్లం అయితే కోరాలి) నెయ్యిని 
    వేడిచేసి కరిగించాలి.
6) ఇప్పుడు విసిరిన పిండిలో పంచదార పొడి, కరిగించిన నెయ్యి వేసి బాగా 
    కలిపి మనకు కావలసినట్టు ఉండలు చుట్టుకోవాలి.


* అంతే మినపసున్నుండలు రెడి.


7) తిరగలి లేనివాళ్ళు మిక్సిలో వేసుకోవచ్చు. (పొట్టు తియ్యడం కష్టం
    కాబట్టి మినప గుళ్ళు వేపి కూడా చేసుకోవచ్చు) కాకపోతే వాటంత రుచి   
    రాదు.



వంటపేరు : చోడిపిట్టు(ట్టి )

కావలసిన పదార్ధాలు :


చోడిపిండి : ఒక కప్పు
రవ్వ : అర కప్పు
నువ్వుల నూనె : టేబుల్ స్పూన్
బెల్లం : పావుకేజీ


తయారుచేయు విధానం :


1) చోడిపిండి, రవ్వ కలిపి కొద్దిగా నీళ్ళుపోసి తడిపొడిగా కలపాలి.
2) ఒక పాత్రలో రెండు గ్లాసుల నీళ్ళుపోసి దానికి ఒక క్లాత్ కట్టాలి. దానిమీద 
    కలిపిన పిండి వేసి మూతపెట్టాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగింఛి పాత్రను స్టవ్ మీద పెట్టాలి.
4) ఐదునిముషాలకు నీళ్ళు మరిగి ఆవిరి వస్తుంది. ఆవిరికి క్లాత్ మీద వున్న 
    పిండి ఉడుకుతుంది. అలా పావుగంట ఉడికాక స్టవ్ ఆపాలి. పాత్ర చల్లారాక 
    మూతతీసి క్లాత్ మీద ఉడికివున్న పిట్టును ఒక ప్లేటులోకి తీసుకోని 
    దానిలో బెల్లం మెత్తగా కోరి కలపాలి.
5) బాగా కలిసాక నువ్వులనూనె వేసి కలిపితే చోడి పిట్టు రెడి అయినట్టే.



వంటపేరు : తాటిపండు పేస్టుతో ఇడ్లి 

కావలసిన పదార్ధాలు :

బియ్యపు రవ్వ : పావుకేజీ 
తాటిపండు పేస్టూ : అరకేజీ 
బెల్లం : వంద గ్రాములు

తయారుచేయు విధానం :


1) ఒకగిన్నెలో తాటిపేస్టు, రవ్వ, బెల్లం కోరు వేసి కలపాలి. ఒక గంట పక్కన 
    పెట్టాలి.
2) ఇప్పుడు స్టవ్ వెలిగించి ఇడ్లి పాత్రలో కొద్దిగా నీళ్ళుపోసి స్టవ్ మిద పెట్టాలి. 
3) ఇడ్లి రేకులకు కాస్త నూనె రాసి రవ్వ కలిపిన మిశ్రమాన్ని కొద్దికొద్దిగా ఇడ్లిలా 
    వేసి ఇడ్లి పాత్రలో పావుగంట ఉడకనివ్వాలి.
4) పిల్లలు ఎంతో ఇష్టంగా తినే తాటిపండు ఇడ్లి రెడి.



వంటపేరు : రాగిపిండి ఇడ్లి

కావలసిన పదార్ధాలు : 


మినపప్పు : వంద గ్రాములు
బియ్యపురవ్వ : వంద గ్రాములు 
రాగిపిండి : వంద గ్రాములు 
ఉప్పు : తగినంత 


తయారుచేయు విధానం :


1) మినపప్పును ఐదు గంటలు నానబెట్టి, కడిగి మెత్తగా రుబ్బాలి. దీనిలో 
    రాగిపిండి, కడిగి నీళ్ళు, పిండిన బియ్యపురవ్వను రుబ్బినపిండిలో కలిపి 
    ఐదు గంటలు పులియనివ్వాలి. 
2) ఇడ్లి వేసేముందు ఉప్పు, కొంచెం వంటసోడా కలిపి, స్టవ్ వెలిగించి ఇడ్లి 
    పాత్ర లో కొద్దిగా నీళ్ళు పోసి ఇడ్లి రేకులో ఇడ్లిలా వేసి పావుగంట 
    ఉడకనివ్వాలి.


* అంతే రాగి ఇడ్లి రెడి.



వంటపేరు : రిబ్బన్ పకోడీ


కావలసిన పదార్దములు :


సెనగపిండి : పావుకేజీ 
వామ్ము : టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
కారం : అర టీ స్పూన్ 
వంట సోడా : చిటికెడు 
నూనె : వేయించటానికి సరిపడా 


తయారు చేయు విధానం :


1) సెనగ పిండిని ఒక గిన్నెలో వేసి, సోడా, ఉప్పు, కారం, వామ్ము, కొద్దిగా      
    నీళ్ళు పోసి ముద్దలా కలపాలి.
2) ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేడి చెయ్యాలి.
3) జంతికల గొట్టంలో రిబ్భన్ పకోడీ వచ్చే ప్లేటు బిగించి, సెనగపిండి ముద్దను 
    వేసి కాగేనూనేలో జంతికలా ఒత్తాలి. బాగా వేగిన తరువాత తియ్యాలి.



Powered by Blogger.