Showing posts with label masala. Show all posts

మసాలాపొడి
కావలసిన పదార్దాలు:

లవంగాలు : పావుకప్పు
దాల్చిన చెక్క : పావుకప్పు
యాలుకులు : పావు కప్పు
దనియాలు : అర కప్పు
జీలకర్ర : పావు కప్పు 

తయారుచేయు విధానం: 

1) స్టవ్ మీద పాత్ర పెట్టి దనియాలు, జీలకర్ర విడివిడి గా వేయించాలి.
2) మిక్సిజార్లో వేయించిన దనియాలు, జీలకర్ర, లవంగాలు, చెక్క, యాలకులు వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.
3)  గాలి వెళ్ళని డబ్బాలో వేసి మూత పెట్టాలి.

కావలసిన పదార్దాలు: 
 
కందిపప్పు : ఒక కప్పు 
ఎండు మిర్చి : ఆరు 
జీలకర్ర : టీ స్పూన్ 
వెల్లుల్లి రెబ్బలు : ఐదు 
ఉప్పు : సరిపడ
నూనె : ఒక స్పూన్ 


తయారుచేయు విధానం: 

1) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చెయ్యాలి. దీనిలో స్పూన్ నూనెవేసి. కాగాక 
ఎండి మిర్చి, జీలకర్ర వేసి వేయించాలి.వీటిని మిక్సి జార్లో వేసి గ్రైండ్ చెయ్యాలి. 

2)  ఇప్పుడు అదే పాన్లో కంది పప్పువేసి దోరగా వేయించాలి. వేయించిన కందిపప్పు గ్రైండ్  చేసిన ఎండిమిర్చిలో వేసి మళ్ళి గ్రైండ్  చెయ్యాలి.

3) ఇప్పుడు ఉప్పు, వెల్లుల్లి వేసి మరొకసారి గ్రైండ్  చేస్తే చాలు ఎంతో రుచిగా ఉండే కందిపొడి రెడీ.

ఇది ఇడ్లి, ఉప్మా,దోశెల్లోకి ఎంతో బాగుంటుంది. 

కావలసిన పదార్దాలు :


అల్లం : వంద గ్రాములు 
వెల్లుల్లి : వంద గ్రాములు 
ఉప్పు : అర టీ స్పూన్ 
పసుపు : పావు టీ స్పూన్ 


తయారుచేయు విధానం :


1) అల్లం శుబ్రంగా కడిగి ఫై పొట్టు వలిచి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి పొట్టు వలవాలి.
2) ఇప్పుడు అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు అన్ని కలిపి మిక్సి జార్లో మెత్తగా మిక్సి పట్టాలి.
3) దీనిని ఒక సీసాలో నిల్వ చేసుకొని  కావలసినప్పుడు వాడుకోవచ్చు.
* ఇలా చేస్తే ఎన్ని రోజులు ఉన్నా పాడవదు.

కావలసిన పదార్ధాలు :

ధనియాలు : కప్పు 
కందిపప్పు: పావు కప్పు 
జీలకర్ర : టేబుల్ స్పూన్ 
ఆవాలు : పావు టీ స్పూన్ 
మెంతులు : పావు టీ స్పూన్ 
మిరియాలు : టీ స్పూన్ 
సొంటి : పావు అంగుళంముక్క 
ఎండుమిర్చి : మూడు 


తయారుచేయు విధానం :


1) ఫైన చెప్పిన దినుసులు అన్ని విడివిడిగా వేయించుకోవాలి.
2) చల్లారిన తరువాత మిక్సి జార్లో వేసి మెత్తగా మిక్సి పట్టాలి.
3) దీనిని ఒక పొడి సీసాలో నిల్వ చేసుకోవాలి.
4) ఈ పొడి చారు, రసం లాంటివి కాచినప్పుడు ఒక స్పూన్ చొప్పున వేస్తె వంటకు రుచి వస్తుంది. 

Powered by Blogger.