మామిడి బొబ్బట్లు (Mamidi Bobbatlu in Telugu)

కావలసిన పదార్దాలు :
 
మామిడి తురుము : అర కప్పు 
క్యారెట్ తురుము : కప్పు 
బీట్ రూట్ తురుము : పావు కప్పు 
పచ్చి కోవా : కప్పు 
మైదా : మూడు కప్పులు 
నెయ్యి : కప్పు 
పంచదార : రెండు కప్పులు 
యాలుకులపొడి : టీ స్పూన్ 
ఉప్పు : చిటికెడు 
నూనె : కప్పు 

తయారుచేయు విధానం :

1) మైదాలో కొద్దిగాఉప్పు, కొద్దిగా నూనె వేసి పాలు పోసి ముద్దలా కలిపి ఒక గంట పక్కన పెట్టాలి.
2) స్టవ్ ఫై కళాయి పెట్టి నెయ్యి వేడి చెయ్యాలి. బీట్ రూట్ , క్యారెట్ తురుము వేసి పచ్చి వాసన పోయే వరకు వేయించాలి.
3) దానిలో మామిడి తురుము కూడా వేసి కొద్ది సేపు వేయించాలి.
4) ఇప్పుడు పంచదార, కొద్దిగా నీళ్ళు పోసి ఉడికించాలి.
5) బాగా ఉడికి దగ్గర పడ్డాక కోవా, యాలుకుల పొడి వేసి కలిపి దించి చల్లారనివ్వాలి.
6) ఇప్పుడు మైదాను చిన్నచిన్న ఉండలుగా చెయ్యాలి.
7) ఒక ఉండను చేతిలోకి తీసుకోని పాలిధిన్ కవరు ఫై నూనె  రాసి
 కొంచెం వెడల్పుగా చెయ్యాలి.
8) దీనిలో మామిడి మిశ్రమం పెట్టి చుట్టూ మూసెయ్యాలి. దీనిని చిన్న పూరీ లా చేతితో  (వత్తి )చెయ్యాలి. 
9) స్టవ్ ఫై పెనం పెట్టి రెండు స్పూన్లు నెయ్యి వేసి చేసిన బొబ్బట్టు వేసి రెండు ప్రక్కలా దోరగా కాలనివ్వాలి.

ఇలా అన్ని బొబ్బట్లు చేసుకొని సర్వ్ చెయ్యడమే.