Showing posts with label tiffins. Show all posts

కావలసిన పదార్ధాలు :

బంగాళా దుంపలు - మూడు
ఉల్లిపాయలు  - రెండు  

మైదా - కప్పు
మిరియాలపొడి - పావు టీ స్పూన్‌
ఉప్పు - తగినంత
నూనె - అరకప్పు
బేకింగ్‌ సోడా - ఒక చిటికెడ్‌

తయారు చేయు విధానం 
:


1) బంగాళాదుంపలు చెక్కి తురుముకోవాలి.అలాగే ఉల్లిపాయల్ని తురుముకోవాలి.వీటిని ఒక గిన్నెలో కలిపి పక్కన పెట్టాలి.
2) వేరే గిన్నెలో మైదా, ఉప్పు, మిరియాల పొడి, బేకింగ్‌ సోడాలను కలుపుకోవాలి. 
అందులో కలిపి పెట్టుకున్నబంగాళా దుంపల తురుము, ఉల్లి తురుమును కలిపి తగినన్ని నీళ్ళు పోసి గరిట జారుగా కలుపుకోవాలి. 
3) తర్వాత పొయ్యి మీద నాన్ స్టిక్ పాన్ పెట్టి అది వేడెక్కిన తరువాత దానిపై కాస్త నూనె పోసి పాన్ అంతా అంటుకునేలా గరిటతో తిప్పాలి.
4) తర్వాత ఒక గుంట గరిటెతో పిండిని తీసుకుని దోశలా పాన్ మీద పోయాలి. కాస్త మందంగా వేస్తేనే బాగుంటుంది.
రెండు నిమిషాలు కాలనిచ్చి దానిని రెండో వైపుకి తిప్పాలి. ఆ వైపు కూడా కాలనివ్వాలి.


కంది దోశ 
కావలసిన పదార్దాలు: 

మినపప్పు : కప్పు 
కందిపప్పు : అర కప్పు 
అటుకులు : అర కప్పు 
బియ్యం : రెండు కప్పులు 
మెంతులు : టేబుల్ స్పూన్ 
రవ్వ : టేబుల్ స్పూన్ 
నూనె : కప్పు 
ఉప్పు : తగినంత 

తయారుచేయు విధానం :

1) ఐదు గంటలముందు పప్పులు, బియ్యం, మెంతులు  విడివిడిగా నానబెట్టాలి. 
2)అటుకులు నీళ్ళల్లో వేసి తియ్యాలి. 
3) తరువాత పప్పులు, బియ్యం, అటుకులు,మెంతులు అన్ని కలిపి మెత్తగా  గ్రైండ్ చెయ్యాలి.
4) ఈ పిండిని ఒక రాత్రంతా పక్కన పెట్టాలి. అలా ఉంచితే దోశ బాగా వస్తుంది.
5) ఉదయం పిండిలో ఉప్పు కలిపి నాన్ స్టిక్ పాన్ ఫై దోశవేసి ఎర్రగా కాల్చాలి. 
6) కావాలంటేఉల్లి, మిర్చి, జీలకర్ర, కొత్తిమీర, అల్లముక్కలు వేసుకొవచ్చు.  
7) వీటిని పల్లిల చెట్నితో కాని, కొబ్బరి చెట్నితో కాని తింటే చాల రుచిగా ఉంటాయి.

సొరకాయ (ఆనబకాయ )పరోటా  
కావలసిన పదార్దాలు:

గోధుమ పిండి :రెండు కప్పులు 
సొరకాయ తురుము : కప్పు 
ఉప్పు : తగినంత 
పచ్చిమిర్చి పేస్టు : టీ స్పూన్ 
కొత్తిమీర తురుము : పావు కప్పు 
నూనె : పావు కప్పు 

తయారుచేయు విధానం :

1) సొరకాయ తురుములో గోడుమపిండి, ఉప్పు, కొత్తిమీర, పచ్చిమిర్చి పేస్టు వేసి చపాతీ పిండిలా కలపాలి.
2) నీళ్ళు అవసరం లేదు. సోరకాయలో ఉన్న తడి సరిపోతుంది.
3) ఇప్పుడు దీనిని చపాతీ గా చేసుకొవాలి.
4) ఇలా చేసిన చపాతీలు స్టవ్ ఫై రేకు పెట్టి  కొద్దిగా నూనె వేస్తూ చపాతీ కాల్చుకోవాలి.  
అంతే సొరకాయ చపాతీ రెడీ.

గార్లిక్ చపాతీ  :

కావలసిన పదార్దాలు :

గోధుమ పిండి : అరకిలో
పాలు : కప్పు 
కోడిగుడ్లు : రెండు
పెరుగు:  పావుకప్పు
వెల్లుల్లి తురుము : రెండు టేబుల్ స్పూన్లు
ఉప్పు:  సరిపడ
నూనె : అర కప్పు 
ఈస్ట్ :  టేబుల్ స్పూన్ .

తయారు చేసే విదానం :
1) గోరు వెచ్చని నీళ్ళులో ఈస్ట్ కలిపితే కరుగుతుంది.
 2) ఈ నీళ్ళతోగోధుమ పిండి ,పాలు, పెరుగు, ఉప్పు, కోడిగుడ్డు వేసి కలిపి పది నిమిషాలు మెత్తగా కలపాలి.
 3) ఈ పిండిని నూనె రాసిన గిన్నెలో పెట్టాలి.
4) దీని ఫై తడి బట్ట కప్పిఒక గంట పక్కన పెట్టాలి.
5) ఇలా చేస్తే పిండి  రెండింతలు అవుతుంది
6) ఇప్పుడు ఈ పిండి చిన్నచిన్న ఉండలు చేసి వెల్లుల్లి తురుములో అద్ది చపాతి చేసి నూనె వేసి కాల్చాలి.
7) కాల్చిన తర్వాత వెన్న రాసుకుంటే ఎంతో మెత్తగా మృదువుగా ఉంటాయి .


మామిడితో సేమ్యా పులిహోరా  

కావలసిన పదార్దాలు :

సేమ్యా : వంద గ్రాములు 
నూనె : మూడు టేబుల్ స్పూన్ లు 
పల్లీలు : టేబుల్ స్పూన్ 
కరివేపాకు  : రెండు రెమ్మలు 
పసుపు : చిటికెడు 
ఉప్పు :  తగినంత 
మామిడి తురుము   :టేబుల్  స్పూన్ 
ఆవాలు : పావుటీ స్పూన్  
పచ్చిమిర్చి : మూడు 
అల్లం  : చిన్న ముక్క 
నెయ్యి : టేబుల్ స్పూన్  

తయారుచేయు విధానం :

1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నెయ్యి వేడిచేయ్యాలి.కాగాక సేమ్యా వేసి వేయించాలి.
2) స్టవ్ మీద నీళ్ళు మరిగించి వేయించిన సేమ్యా వేసి ఒక నిముషం వుంచి పసుపు కొద్దిగా నూనె వేసి ఉడికించి నీళ్ళు వంచి  పక్కన పెట్టాలి.ఇలా చేస్తే సేమ్యా పొడిపొడిగా ఉంటుంది.
3) స్టవ్  మీద  కళాయి పెట్టి నూనె వేడి చేసి ఆవాలు, పల్లీలు,కరివేపాకు వేసి వేయించాలి. వేగాక అల్లంముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ఉప్పు, మామిడి తురుము వేసి వేయించాలి.
ఇప్పుడు  ఉడికించిన సేమ్యా వేసి కలపాలి.
అంతే మామిడి సేమ్యా రెడీ.


కావలసిన పదార్దాలు

ఇడ్లీలు: ఐదు
ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి : మూడు
పోపుదినుసులు : టీ స్పూన్
జీడిపప్పులు : పది
ఎండు మిర్చి  : రెండు
కరివేపాకు : రెండు రెమ్మలు
ఉప్పు : తగినంత
క్యారెట్ తురుము : రెండు టేబుల్ స్పూన్లు
పసుపు : చిటికెడు
కొత్తిమీర : చిన్నకట్ట
నిమ్మరసం : టేబుల్ స్పూన్
నూనె : రెండు టేబుల్  
తయారుచేయు విధానం :
౧) ఇడ్లీలు పొడి పోడిగా చేసి పక్కన పెట్టాలి.
౨) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు  వేసి వేగాక
ఎండుమిర్చి,  కరివేపాకు, జీడిపప్పులు,  పల్లిలు వేసి వేయించాలి.
౩) ఇప్పుడు ఉల్లుపాయ ముక్కలు,  పచ్చిమిర్చి ముక్కలు,  వేసి వేగాక ఉప్పు,  పసుపు,  క్యారెట్ తురుము,  వేసి కలిపి ఇడ్లి పొడి వేసి బాగా కలిపాలి. ఇప్పుడు  స్టవ్ ఆపాలి.
౪) ఇప్పుడు కొత్తిమీర, నిమ్మరసం వేసి కలిపి జీడిపప్పులతో సర్వ్ చెయ్యాలి.


కావలసిన పదార్దాలు 

గోధుమ పిండి : ఐదు కప్పులు  
పాలకూర తురుము : కప్పు 
కొత్తిమీర తురుము : అర కప్పు 
ఉప్పు : తగినంత 
పచ్చిమిర్చి పేస్టు : టీ స్పూన్ 
వెన్న : టేబుల్ స్పూన్ 
నూనె : కప్పు 

తయారుచేయు విధానం 

1) కొత్తిమీర, పాలకూర చిన్నగా తురమాలి.  దీనిలో గోధుమ పిండి,ఉప్పు, వెన్న,పచ్చిమిర్చి పేస్టు వేసి కొద్దిగా నీళ్ళు వేసి చపాతి పిండిలా కలిపి ఒక గంట పక్కన పెట్టాలి.
2)తరువాత చపాతీలుగా చేసి స్టవ్ మీద పాన్ పెట్టి నూనె వేసి చపాతి కాల్చాలి. .ఇవి వేడివేడిగా తింటే చాల బాగుంటాయి.  

కావలసిన పదార్ధాలు :


సేమ్యా : వంద గ్రాములు 
నూనె : మూడు టేబుల్ స్పూన్ లు 
పల్లీలు : టేబుల్ స్పూన్ 
కరివేపాకు  : రెండు రెమ్మలు 
పసుపు : చిటికెడు 
ఉప్పు :  తగినంత 
నిమ్మరసం  : టీ స్పూన్ 
ఆవాలు : పావుటీ స్పూన్  
పచ్చిమిర్చి : మూడు 
అల్లం  : చిన్న ముక్క 
కొత్తిమీర : కొద్దిగా  
నెయ్యి : టేబుల్ స్పూన్  


తయారుచేయు విధానం :


1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నెయ్యి వేడిచెయ్యాలి. కాగాక సేమ్యా వేసి వేయించాలి.
2) స్టవ్ మీద నీళ్ళు మరిగించి వేయించిన సేమ్యా వేసి ఒకనిముషం వుంచి పసుపు కొద్దిగా నూనెవేసి ఉడికించి, నీళ్ళు వంచి పక్కనపెట్టాలి. ఇలా చేస్తే సేమ్యా పొడిపొడిగా ఉంటుంది.
3) స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచేసి ఆవాలు, పల్లీలు, కరివేపాకు వేసి వేయించాలి. వేగాక అల్లంముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, ఉప్పు వేసి వేయించి ఉడికించిన సేమ్యా వేసి కలపాలి.
4) దించేముందు నిమ్మరసం, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపాలి.

కావలసిన పదార్ధాలు :


గోధుమ పిండి : ఐదు కప్పులు 
వెన్న : రెండు టేబుల్ స్పూన్ 
ఉప్పు : తగినంత  
నూనె : పావు కప్పు 
పచ్చి మిర్చి పేస్టు :  టీ స్పూన్ 
పాలకూర తరుగు : పావు కప్పు 
తోటకూర తరుగు : పావు కప్పు 
బచ్చలికూర తరుగు : పావు కప్పు 
పొనగంటికూర తరుగు : పావు కప్పు 
కొత్తిమీర తరుగు : పావు కప్పు 

తయారుచేయు విధానం :


1) ఒక గిన్నెలో ఆకుకూరల తరుగు, గోధుమ పిండి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు, వెన్న వేసి నీళ్ళు పోసి ముద్దగా కలిపి ఒకగంట పక్కన పెట్టాలి.
2) గంట తరువాత చపాతీలు చేసుకోవాలి. గ్రీన్ కలర్ గా ఉంటాయి.
3) స్టవ్ మీద పాన్ పెట్టి స్పూన్ నూనె వేసి వేడిఅయ్యాక చేసిన చపాతీలు వేసి రెండుప్రక్కలా కాలనిచ్చి ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
4) వీటిమీద వెన్నరాసి మడతపెట్టి బాక్సులో పెట్టుకోవాలి. ఎన్ని గంటలు గడిచినా మెత్తగా మృదువుగా ఉంటాయి.

కావలసిన పదార్దాలు :


గోధుమ పిండి : మూడు కప్పులు 
కొత్తిమీర తురుము : కప్పు 
వెన్న : టేబుల్ స్పూన్ 
ఉప్పు : కొద్దిగా 
నూనె : పావు కప్పు 
పచ్చిమిర్చి పేస్టు : అర టీ స్పూన్ 


తయారు చేయు విధానం :


1) ఒక గిన్నెలో కొత్తిమీర తరుగు, గోధుమ పిండి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు వేసి నీళ్ళు పోసి ముద్దగా కలిపి ఒక గంట పక్కన పెట్టాలి.
2) గంట తరువాత చపాతీలు చేసుకోవాలి.
3) స్టవ్ మీద పాన్ పెట్టి స్పూన్ నూనె వేసి వేడిఅయ్యాక చేసిన చపాతీలు రెండు ప్రక్కలా కాలనిచ్చి ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
4) వీటి మీద వెన్నరాసి మడత పెట్టి బాక్సులో పెట్టుకోవాలి. ఎన్ని గంటలు గడిచినా మెత్తగా మృదువుగా ఉంటాయి.

కావలసిన పదార్దాలు: 


మినప్పప్పు : కప్పు 
ఉప్పు : తగినంత 


తయారుచేయు విధానం :


1) మూడు గంటలముందు మినపప్పు నానబెట్టి కడిగి గారెల పిండిలా గట్టిగా రుబ్బుకోవాలి.
2) ఒక గిన్నెలో నీళ్ళుపోసి దానికి పల్చటి గుడ్డ కట్టాలి. దీనినే వాసం కట్టడం అంటారు.
3) రుబ్బిన మినప్పిండిలో ఉప్పు కలిపి దీనిని ఆ వాసం కట్టిన గుడ్డమీద వేసి ఫైన ఒక మూతపెట్టాలి.
4) స్టవ్ వెలిగించి దానిమీద ఈ గిన్నె పట్టి పదిహేనునిముషాలు ఉడికించాలి.
5) గిన్నెలోని నీళ్ళు మరుగుతుంటే ఆ ఆవిరికి మినపకుడుము ఉడుకుతుంచి. దీనినే ఆవిరి కుడుము అంటారు.
6) దీనిలో బెల్లం, నెయ్యి వేసుకొని తినొచ్చు. లేదా చెట్నితో తినొచ్చు.
ఇది బలవర్ధకమయిన ఆహారం.

కావలసిన పదార్దాలు :


బ్రెడ్ ముక్కలు : ఆరు  
దోశ పిండి : కప్పు 
ఆలూ : ఒకటి 
ఉల్లిముక్కలు : అరకప్పు 
కేప్సికం ముక్కలు : అర కప్పు 
ఉప్పు : తెగినంత 
కారం : అర టీ స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 
ఆవాలు : పావు టీ స్పూన్ 
జీలకర్ర : పావు టీ స్పూన్ 
కొత్తిమీర తురుము : పావుకప్పు 
క్యారెట్ తురుము : రెండు టేబుల్ స్పూన్లు 
కొబ్బరి తురుము : టేబుల్ స్పూన్ 
వెన్న : రెండు టేబుల్ స్పూన్లు  
నూనె : రెండు టేబుల్ స్పూన్లు 


తయారుచేయు విధానం :


1) స్టవ్ మీద కళాయి పెట్టి వెన్నవేసి కరిగించాలి. వెన్న కరిగిన తరువాత అవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి.
2) ఇప్పుడు ఉల్లిముక్కలు వేసి వేగాక కేప్సికం ముక్కలు వేసి కాసేపు వేయించాలి.
3) ఇప్పుడు కొబ్బరితురుము, వుడికించి చిదిమిన ఆలూ, క్యారెట్ తురుము వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసి కాసేపు కలిపి దించి చల్లారనివ్వాలి.
4) స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడయ్యాక  దోశల పిండిలో బ్రెడ్ ముక్కను ముంచి వేడెక్కిన పాన్ మీద వేసి చుట్టూ నూనె వేసి బ్రెడ్ దోశ 
ఫైన కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా క్యారెట్ తురుము వేసి రెండో ప్రక్క తిప్పి స్పూన్ నూనె వేసి రెండు ప్రక్కలా దోశ లా కాల్చి ఒక ప్లేటులోకి  తీసుకోవాలి.
5) ఇలా బ్రెడ్ ముక్కలు అన్నిదోశల పిండిలో ముంచి ఇలాగే  కాలనివ్వాలి.
ఒక ప్రక్కనే కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము వెయ్యాలి.
6) ఇప్పుడు బ్రెడ్ దోశలు ప్లేట్ లో పెట్టి ఉడికించిన ఆలూ మిశ్రమం ఒక బ్రెడ్ దోశ మీద వేసి అంతా సర్ది ఫైన మరో బ్రెడ్ దోశ పెట్టాలి.
7) ఇలా అన్ని చేసుకున్నాక బ్రెడ్ దోశలు క్రాస్ గా కట్ చేసి సర్వ్ చెయ్యాలి.
అంతే బ్రెడ్ దోశ మసాలా శాండ్ విచ్ రెడీ.

కావలసిన పదార్దాలు :


పాలకూర కట్ట  : ఒకటి 
కొత్తిమీర కట్ట : ఒకటి 
అల్లం పచ్చిమిర్చి పేస్టు : టీ స్పూన్ 
మినప్పప్పు : కప్పు 
బియ్యం : రెండు కప్పులు  
అటుకులు : కప్పు 
ఉప్పు : తగినంత 
నూనె : కప్పు 


తయారుచేయు విధానం :


1) ముందురోజు బియ్యం, మినప్పప్పు విడివిడిగా నానబెట్టాలి. మినప్పప్పు నానిన తరువాత కడిగి పొట్టు తీసేయ్యాలి.
2) అటుకులు ఐదునిముషాలు నానబెడితే చాలు. ఇప్పుడు మినప్పప్పు, బియ్యం, అటుకులు అన్ని మెత్తగా రుబ్బి ఒకరాత్రి ఉంచాలి.
3) మర్నాడు పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, కొత్తిమీర తురుము, పాలకూర తురుము మిక్సిలో వేసి మెత్తగా చేసి ఈ పిండిలో కలుపుకోవాలి.
4) స్టవ్ ఫై పాన్ పెట్టి ఈ పిండిని దోశలా వేసి చుట్టూ నూనె వేసి రెండు ప్రక్కలా కాలాక ప్లేటులోకి తీసుకోవాలి.

కావలసిన పదార్దాలు 


బొంబాయి రవ్వ : పావుకేజీ
టమాటాలు : మూడు
ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి : మూడు
పల్లీలు : టేబుల్ స్పూన్
ఆవాలు : అర టీ స్పూన్
శెనగపప్పు : టీ స్పూన్
జీడిపప్పు : పది
పసుపు : పావు టీ స్పూన్
ఉప్పు : తగినంత
నెయ్యి : రెండుటేబుల్ స్పూన్లు
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర : చిన్న కట్ట
అల్లం ముక్కలు : టీ స్పూన్


తయారుచేయు విధానం


1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి రవ్వను వేయించాలి. వేగిన తరువాత ఒక ప్లేటులోకి తీసి పక్కన పెట్టాలి.
2) స్టవ్ ఫై కళాయి పెట్టి నెయ్యి వేడిచెయ్యాలి. వేడి అయ్యాక పోపుదినుసులు, కరివేపాకు, పల్లీలు, జీడిపప్పులు వేసి వేగాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, పసుపు వేసి వేయించాలి.
3) ఇప్పుడు టమాటముక్కలు కొద్దిగా కొత్తిమీర వేసి కలపాలి.
4) రెండు నిముషాలు వేయించి సరిపడా నీళ్ళు, ఉప్పు వేసి మూతపెట్టాలి.
5) ఇప్పుడు నీళ్ళు మరుగుతుండగా రవ్వవేసి కలపాలి. రెండు నిముషాలు కలిపితే టమాట బాత్ రెడీ అవ్వుతుంది. ఇప్పుడు స్టవ్ ఆపాలి.
6) తయారుగా ఉన్న టమాట బాత్ లో కొత్తిమీర వేసి  అలకరించి సర్వ్ చెయ్యాలి.

కావలసిన పదార్దాలు :


మినప్పప్పు : కప్పు
బియ్యం  : రెండు కప్పులు
క్యారేట్ తురుము : అరకప్పు
ఉల్లిముక్కలు : కప్పు
అల్లం : చిన్న ముక్క
పచ్చిమిర్చి: నాలుగు
ఉప్పు: సరిపడా
నూనె : అరకప్పు
జీలకర్ర : టీ స్పూన్
కొత్తిమీర : అరకప్పు
ఉల్లి కాడల తరుగు : కప్పు


తయారుచేయు విధానం :


1) మినపప్పు, బియ్యం విడివిడిగా నానబెట్టి మెత్తగా రుబ్బి ఉప్పు కలిపి రాత్రంతా పక్కన ఉంచాలి.
2) స్టవ్ ఫై కళాయిపెట్టి కొద్దిగా నూనె వేసి కాగాక జీలకర్ర, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్ తురుము, ఉల్లికాడల తరుగు వేసి వేయించి పిండిలో కలపాలి.
3) స్టవ్ ఫై పాన్ పెట్టి ఈ పిండిని ఊతప్పంలా వేసి నూనె వేసి రెండు ప్రక్కలా దోరగా కాల్చాలి.

కావలసిన పదార్దాలు: 


మైదా : కప్పు 
పాలు : కప్పు 
పంచదార : అర కప్పు 
బియ్యపుపిండి : రెండు టేబుల్ స్పూన్లు 
కొబ్బరి తురుము : అరకప్పు 
యాలుకులపొడి : అర టీ స్పూన్ 
నూనె : వేయించటానికి సరిపడా 


తయారుచేయు విధానం : 


1) మైదా, పాలు, పంచదార, బియ్యప్పిండి, కొబ్బరి తురుము, యాలుకుల పొడి  అన్ని గిన్నెలో వేసి కలపాలి. దీనిని పది నిముషాలు పక్కనపెట్టాలి. 
2) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చేయ్యాలి. కాగాక కలిపిన పిండిని బొండాల్లా వేసి బంగారు రంగులోకి వచ్చేవరకు వేయించి సర్వ్ చెయ్యాలి. అంతే తీపి బొండాలు రెడీ.

కావలసిన పదార్దాలు :


గోధుమ పిండి : రెండు కప్పులు
మైదా : టేబుల్ స్పూన్
ఉల్లి ముక్కలు : కప్పు
పచ్చిమిర్చి,అల్లం  పేస్టు : టీ స్పూన్
జీలకర్ర  : టీ స్పూన్
ఉప్పు : సరిపడ
నూనె : అర కప్పు
రవ్వ : పావుకప్పు


తయారుచేయు విధానం :


1) గోధుమ పిండి,మైదా,రవ్వ,ఉప్పు కలిపి నీళ్ళు పోసి జారుగా కలిపి గంట పక్కన పెట్టాలి.
2) స్టవ్ మీద పాన్ పెట్టాలి.ఈ పిండిలో పచ్చిమిర్చి,అల్లం పేస్టు కలిపి పాన్ వేడెక్కిన తరువాత లోతు గరిటతో అట్టులా రౌండుగా వేసి చుట్టూ నూనె వేయాలి.ఉల్లి ముక్కలు,జీలకర్ర ఫైన చల్లాలి.
3) ఒక ప్రక్క కాలాక, రెండో ప్రక్క కూడా కాలనివ్వాలి.
4) అంతే గోధుమ అట్లు రెడీ. ఇవి వేడి వేడిగా  కొబ్బరి చెట్నీతో తింటే చాలా బాగుంటాయి.

కావలసిన పదార్దములు :


గోధుమ పిండి : రెండు కప్పులు
పంచదార  లేదా బెల్లం : కప్పు 
ఉప్పు : చిటికెడు 








తయారుచేయు విధానం :


1) గోధుమపిండి జల్లించి ఒకగిన్నెలో వెయ్యాలి. దీనిలోనే బెల్లం తురుము, ఉప్పు కలిపి ఒక గంట పక్కన పెట్టాలి.
2) స్టవ్ మీద పాన్ పెట్టి వేడి చెయ్యాలి. పాన్ వేడి అయ్యాక కలిపిన పిండిని గుంటగరిటతో తీసి పాన్ మీద అట్టులా చేసి చుట్టూ నూనె వెయ్యాలి.
3) ఒకప్రక్క కాలాక రెండో ప్రక్క కూడా కాలనివ్వాలి. రెండు ప్రక్కలా కాలక ఒక ప్లేటు లోకి తీసుకోవాలి.

వంటపేరు : బీట్రూట్ ఉప్మా 


కావలసిన పదార్ధాలు :


ఉప్మారవ్వ : పావుకిలో 
నూనె : అరకప్పు 
బీట్రూట్ తురుము : అర కప్పు 
ఎండిమిర్చి: రెండు
ఆవాలు : టీ స్పూన్ 
సెనగపప్పు : టీ స్పూన్ 
జీడిపప్పులు : పది 
పల్లీలు : కొద్దిగా 
నూనె : అరకప్పు 
నెయ్యి : టేబుల్ స్పూన్ 
ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, అల్లం ముక్కలు అన్ని కలిపి : 1 కప్పు 
కరివేపాకు : కొద్దిగా 
ఉప్పు : తగినంత  
నిమ్మరసం : టీ స్పూన్ 
కొత్తిమిర : కొద్దిగా 
జీలకర్ర : అర టీ స్పూన్ 
మినపప్పు : టీ స్పూన్ 


తయారుచేయు విధానం : 

1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
2) నూనె కాగాక, సెనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి వేగాక ఎండిమిర్చి, కరివేపాకు వేసి  వేగాక, ఉల్లి, మిర్చి, అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి.
3) ఇప్పుడు బీట్రూట్ తురుము కుడా వేసి కలిపి, రెండు గ్లాసుల నీళ్ళు, ఉప్పు వేసి మూతపెట్టాలి. నీళ్ళు మరుగుతుండగా మూతతీసి రవ్వ పోస్తూ బాగాకలిపి గట్టి పడ్డాక స్టవ్ ఆపాలి.
4) ఇప్పుడు నెయ్యి, నిమ్మరసం వేసి కలిపి కొత్తిమిర వేసి మూత పెట్టాలి.


* అంతే బీట్రూట్ (ఎరుపు కలర్) ఉప్మా రెడి.

వంటపేరు : టమాటా బాత్

కావలసిన పదార్ధాలు : 

ఉప్మారవ్వ : పావుకిలో 
నూనె : అరకప్పు 
టమాట గుజ్జు : కప్పు
ఎండిమిర్చి : రెండు
ఆవాలు : టీ స్పూన్ 
సెనగపప్పు : టీ స్పూన్ 
జీడిపప్పులు : పది 
పల్లీలు : కొద్దిగా 
నూనె : అరకప్పు 
నెయ్యి : టేబుల్ స్పూన్ 
ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, అల్లం ముక్కలు అన్ని కలిపి : 1 కప్పు 
కరివేపాకు : కొద్దిగా 
ఉప్పు : తగినంత 
నిమ్మరసం : 1 టీ స్పూన్ 
కొత్తిమిర : కొద్దిగా 

తయారుచేయు విధానం :

1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడిచేయ్యాలి.
2) నూనె కాగిన తరువాత సెనగపప్పు, పల్లీలు, జీడిపప్పువేసి వేగాక, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేగిన తరువాత ఉల్లి, మిర్చి, అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి.
3) వేగాక టామాటగుజ్జు వేసి కలిపి, రెండు గ్లాసుల నీళ్ళుపోసి ఉప్పు కలిపి మూతపెట్టాలి. నీళ్ళు మరుగుతుండగా మూతతీసి రవ్వపోస్తూ బాగాకలిపి గట్టి పడ్డాక స్టవ్ ఆపాలి.
4) ఇప్పుడు నెయ్యి, నిమ్మరసం వేసి కలిపి కొత్తిమిర వేసి మూత పెట్టాలి.


* అంతే  టమాటా కలర్ ఉప్మా రెడి.

Powered by Blogger.