Showing posts with label snacks. Show all posts

బియ్యప్పిండితో గారెలు.


కావలసిన పదార్దాలు .

బియ్యప్పిండి -రెండు కప్పులు 

పెరుగు - ఒక కప్పు 

ఉల్లి పాయ - ఒకటి 

పచ్చిమిర్చి  - రెండు

ఉప్పు - తగినంత 

అల్లం - చిన్న ముక్క 

జీలకర్ర - టీ స్పూన్ 

నూనె - అర కిలో 


తయారుచేయు విధానం ;


1) బియ్యప్పిండిలో పెరుగు వేసి గారెల పిండిలా కలపాలి.

2) ఉల్లి, మిర్చి, అల్లం ముక్కలుగా కోసి పిండిలో వేసి ఉప్పు, జీలకర్ర కూడా వేసి మొత్తం పిండి కలిపి పక్కనపెట్టాలి,

3) ఇప్పుడు స్టవ్ ఫై నూనె వేడి చేసి ఇలా కలిపిన పిండిని గారెల్లా  వత్తి   కాగే నూనెలో వేసి రెండు ప్రక్కలా దోరగా 

వేయించి ప్లేట్లోకి తీసుకోవాలి. 

 4)
ఈ గారెలు చాలా రుచిగా ఉంటాయి. మీకు నచ్చిన చెట్నితో తినటమే.

అంతే   ఎంతో రుచిగా ఉండే బియ్యప్పిండి గారెలు రెడి.



కావలసిన పదార్దాలు:
పనీర్ : పది గ్రాములు (తురుము )
క్యేరేట్:రెండు 
పచ్చి బఠాని : అర కప్పు 
పచ్చిమిర్చి : మూడు
మషాలా : కొద్దిగా 
నూనె : వేయించటానికి సరిపడా 
బీన్స్ : పది 
బంగాళా దుంప : ఒకటి 
కొత్తిమీర : కట్ట 
మైదా : కప్పు 
ఉప్పు : తగినంత 
జీడిపప్పులు : కొద్దిగా 

తయారుచేయు విధానం :

1) క్యేరేట్, పచ్చి బఠాని, బీన్స్, బంగాళా దుంప లను ఉడికించి దీనికి పనీర్ తురుము , పచ్చిమిర్చి  తురుము, ఉప్పు  కలిపి ముద్దలా చెయ్యాలి.
దీనిని చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కన పెట్టాలి.

2) కడాయిలో కొద్దిగా నూనె వేసి ఈ ఉండలను కాసేపు వేయించాలి.

3) ఇప్పుడు  మైదా లో మసాలా, ఉప్పు, కొత్తిమీర, జీరా పొడి వేసి కొద్దిగా నీళ్ళు పోసి ముద్దలా చెయ్యాలి.

4) ఈ ముద్దను చిన్న చిన్న ముద్దలుగా తీసుకోని కాస్త వెడల్పు చేసి దానిలో పనీర్ ఉండను పెట్టి మళ్ళిఉండాలా చేసి దీనిని చేతితో కొంచెం వెడల్పుగా చెయ్యాలి.(బిళ్లలుగా )వీటినే కబాబ్స్ అంటారు.

5) ఈ బిళ్లలుగా చేసిన వాటికి ఒక వైపు జీడిపప్పు గుచ్చి పక్కనపెట్టాలి.

6) ఇలా అన్ని చేసిన తరువాత నూనె వేడి చేసి వీటిని దొరగావేయించాలి. 
వేడిగా ఉన్నప్పుడే తింటే ఆ రుచే వేరు.


కావలసిన పదార్దాలు :

నానబెట్టిన సెనగలు : కప్పు
నానబెట్టిన సగ్గుబియ్యం : కప్పు
నానబెట్టిన మినపప్పు: పావు కప్పు 
ఉల్లిముక్కలు : కప్పు 
పచ్చి మిర్చిముక్కలు : రెండు టేబుల్ స్పూన్లు 
కారం : అర టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
కొత్తిమీర,కరివేపాకు : అర కప్పు 
అల్లంపేస్టూ :టీ స్పూన్ 
నూనె : వేయించటానికి సరిపడ

తయారుచేయు విధానం :

1 ) సగ్గుబియ్యం, శెనగలు, మినపప్పు,మిక్సిలో వేసి మెత్తగా గట్టిగా మిక్సి పట్టాలి.
2) మెత్తగా చేసిన సెనగలు సగ్గుబియ్యం మినపప్పు ముద్ద లో ఉప్పు, కారం, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర, కరివేపాకు, అల్లం పేస్టూ వేసి కలపాలి.
3) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చేసి నూనె కాగాక అన్నికలిపిన ఈ పిండిని గారెల్లా చేసి వేడి నూనెలో వేసి దోరగా వేయించాలి.
4) రెండు ప్రక్కలా వేగాక ఒక ప్లేటులోకి తీసుకోని సర్వ్ చెయ్యాలి.  


కావలసిన పదార్దాలు :

నానబెట్టిన సెనగలు : కప్పు
నానబెట్టిన సగ్గుబియ్యం  : కప్పు
ఉల్లిముక్కలు : అర కప్పు 
మిర్చిముక్కలు : టేబుల్ స్పూన్ 
కారం : కొద్దిగా 
ఉప్పు : తగినంత 
కొత్తిమీర : అర కప్పు 
కరివేపాకు : కొద్దిగా  
అల్లంపేస్టూ : టీ స్పూన్ 
నూనె : వేయించటానికి సరిపడ 
వాము : టీ స్పూన్  

తయారుచేయు విధానం :

1) నానబెట్టిన సగ్గుబియ్యం, శెనగలు మిక్సిలో వేసి మెత్తగా గట్టిగా మిక్సి పట్టాలి.
2) మెత్తగా చేసిన సెనగలు సగ్గుబియ్యం ముద్ద లో ఉప్పు, కారం, ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, కొత్తిమీర కరివేపాకు, వాము, అల్లం పేస్టూ వేసి కలపాలి.
3) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చేసి నూనె కాగాక అన్నికలిపిన ఈ పిండిని గారెల్లా చేసి వేడి నూనెలో వేసి దోరగా వేయించాలి.

4) రెండు ప్రక్కలా వేగాక ఒక ప్లేటులోకి తీసుకోని సర్వ్ చెయ్యాలి.

మషాలాగారెలు


కావలసిన పదార్దాలు

పొట్టు మినపప్పు : అర కేజీ
పచ్చిశెనగపప్పు : వందగ్రాములు
చాయ పెసర పప్పు : వంద గ్రాములు (నానబెట్టినది )
ఉల్లిముక్కలు : కప్పు
పచ్చిమిర్చి ముక్కలు : టేబుల్ స్పూన్
క్యేరేట్ తురుము, కొత్తిమీర తురుము, కరివేపాకు తురుము : అన్ని కలిపి కప్పు
 ఉప్పు : తగినంత
అల్లం ముద్ద : టీ స్పూన్
జీలకర్ర : టీ స్పూన్
నూనె వేయించటానికి సరిపడా

తయారుచేయు విధానం

1) మినపప్పు ను కడిగి మెత్తగా గట్టిగా రుబ్బుకోవాలి.అలాగే శెనగ పప్పును గట్టిగా రుబ్బాలి.
2) ఒక గిన్నెలో రుబ్బిన ఈ రెండు పప్పుల్ని వేసి దీనిలో ఉల్లి ముక్కలు, మిర్చి ముక్కలు క్యరేట్ తురుము, కొత్తిమీర, కరివేపాకు ల తురుము, ఉప్పు, జీలకర్ర, నానబెట్టినపెసరపప్పు, అల్లం ముద్ద వేసి కలపాలి.
3) స్టవ్ ఫై నూనె వేడి చేసి ఈ పిండిని చిన్నచిన్న ముద్దలుగా తీసుకోని పాల కవర్ ఫై గారెల్లా వత్తి కాగే నూనెలో దోరగా వేయించాలి.

వీటిలో కొబ్బరి చేట్ని, లేదా నాటుకోడి కూర తో తింటే చాలా రుచిగా ఉంటాయి.    

కావలసిన పదార్దాలు :

బంగాళా దుంపలు : నాలుగు 
నూనె : తగినంత 
సెనగపప్పు : అరకప్పు 
జీలకర్ర : పావుకప్పు 
మినపప్పు : అరకప్పు 
కరివేపాకు : కొద్దిగా 
ఎండుమిర్చి : ఐదు 
వెల్లుల్లి : పది రెబ్బలు 
కొత్తిమీర: కట్ట 

తయారుచేయు విధానం :

1) బంగాళా దుంపలు చెక్కు తీసి సన్నగా కట్ చేసుకొని ఉప్పు కలిపిన నీటిలో పది నిముషాలు ఉంచి నీటిని వంచేయ్యాలి.ముక్కలకు తడి లేకుండా తుడవాలి.
2) వెల్లుల్లి, ఎండుమిర్చి ని కొద్దిగా నూనె వేసి వేయించాలి.
3) నూనె లేకుండా జీలకర్ర, మినపప్పు, సెనగపప్పులు వేయించాలి.
4) ఇప్పుడు ఈ పప్పులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, జీలకర్ర మిక్సిలో వేసి పొడి చెయ్యాలి.
5) ఇప్పుడు నూనె వేడి చేసి కాగిన తరువాత తడి లేకుండా తుడిచి కట్ చేసిన బంగాళా  దుంపలు  ముక్కలు వేసి కరకరలాడేలా వేయించాలి.
6) ఇప్పుడు నూనె మొత్తం వేరే గిన్నెలోకి వంచి కొద్దిగా నూనె ఉంచి దానిలో కరివేపాకు, కొత్తిమీర వేసి వేయించాలి.
7) అవి వేగాక వేయించిన బంగాళా దుంప ముక్కలు, మిక్సి చేసిన పప్పులపొడి, ఉప్పు వేసి కలిపి గాలి చొరబడని డబ్బాలో నిల్వ ఉంచుకోవాలి.
ఇవి పిల్లలు ఇష్టంగా తింటారు.



కావలసిన పదార్దాలు :

నూడిల్స్ :పావుకిలో 
నిమ్మరసం : టేబుల్ స్పూన్ 
శెనగపప్పు : అర టీ స్పూన్ 
మినపప్పు : అర టీ స్పూన్ 
ఆవాలు : అర టీ స్పూన్ 
పసుపు : కొంచెం 
కరివేపాకు : కొద్దిగా 
జీడిపప్పులు : కొద్దిగా 
ఉప్పు :తగినంత 
కొబ్బరితురుము : రెండు టీ స్పూన్లు 
పచ్చిమిర్చి : నాలుగు 
నూనె : కొద్దిగా 

తయారుచేయు విధానం

1) నీళ్ళు మరిగించి  నూడిల్స్ వేసి ఇదు నిముషాలు ఉడికించి నీళ్ళువంచి చిల్లుల  గిన్నెలో వేసి ఆరనివ్వాలి.
2) స్టవ్ ఫై కాళాయి పెట్టి కొద్దిగా నూనె వేసి ఆవాలు, మినప్పప్పు, శెనగపప్పు, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు వేసి వేయించాలి.
3) అవి వేగాక జీడిపప్పులు వేసి వేయించి ఉప్పు, నిమ్మరసం, కొబ్బరి తురుము వేసి కలిపి ఇప్పుడు ముందుగా ఉడికించిన నూడిల్స్ ను వేసి కలపాలి.
అంతే నిమ్మ నూడిల్స్ రెడి 

1


కావలసిన పదార్దాలు 

గోధుమ పిండి : మూడుకప్పులు 
ఉప్పు :కొద్దిగా 
నూనె : వేయించటానికి సరిపడ
పాలు : కప్పు
అరటిపళ్ళు : మూడు 

తయారుచేయు విధానం 

1) గోధుమ పిండిలో పాలు, ఉప్పు, అరటిపళ్ళు కలిపి బాగా మెత్తగా  ముద్దలా చెయ్యాలి.
2) ముద్దను చిన్నచిన్న ఉండలుగా తీసుకోని పూరీల్లా వత్తుకోవాలి.
3) ఇప్పుడు స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
కాగే నూనెలో ఈ పూరీలను వేయించుకోవాలి.
4) ఈ అరటి స్వీట్ పూరీలు పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

1


కావలసిన పదార్దాలు 

బియ్యప్పిండి : అరకేజి 
కొబ్బరి కాయ : చిన్నది 
పెరుగు : కప్పు 
అల్లం : చిన్నముక్క 
ఉప్పు : తగినంత 
కారం : టీ స్పూన్ 
నూనె : అరకేజి 
వంటసోడా : చిటికెడు 

తయారుచేయు విధానం 


1) అల్లం, పచ్చిమిర్చి, సాల్ట్ , కొబ్బరి కలిపి మెత్తగా ముద్దలా చెయ్యాలి.
2) ఒక  గిన్నెలో బియ్యప్పిండి ,కొబ్బరి ముద్దా,ఉప్పు ,కారం పెరుగు  
వంటసోడా వేసి గట్టిగా ముద్దలా చేసి పక్కన పెట్టాలి. 
3) ఇప్పుడు స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
4) ఇప్పుడు పిండిని చిన్నచిన్న  ఉండలుగా తీసుకోని గారెలుగా చేసికాగే నూనెలో వేసి దోరగా  వేయించాలి   

1

కావలసిన పదార్దాలు 


గోధుమపిండి _కప్పు 
పెరుగు _కప్పు 
పాలకూరకట్టలు : రెండు 
అల్లం  చిన్నముక్క 
పచ్చిమిర్చి : ఆరు 
ఉప్పు :తగినంత 
నూనె : పావుకిలో 
జీలకర్ర : టీ స్పూన్ 

తయారుచేయు విధానం 

1) ముందుగా అల్లం,పచ్చిమిర్చి ,జీలకర్ర, ఉప్పు కలిపి మిక్సిలో వేసి మెత్తగా గ్రయిడ్ చెయ్యాలి.
2) పాలకూరను కడిగి చిన్నగా కట చేయ్యాలి.
3) గోధుమపిండి జల్లించి ,దానిలో అల్లం మిశ్రమం, పెరుగు, కట్ చేసిన పాలకూర వేసి ముద్దగా కలపాలి. 
4) స్టవ్ ఫై నూనె వేడి చేసి కాగాక ఈ పిండిని వడలుగా వేసి దోరగా వేయించి పేపర్ నేఫ్కిన్లోకి పరచిన ప్లేట్లోకి తీసుకోవాలి.  

1


కావలసిన పదార్దాలు :

పచ్చ బఠాణీలు - అర కప్పు( ఉడికించినవి )

క్యారెట్ ముక్కలు - అర కప్పు( ఉడికించాలి).
ఉడికించిన గుడ్ల - కప్పు (ముక్కలుగా కట్ చెయ్యాలి.)
ఉల్లిపాయ ముక్కలు - అర కప్పు
పచ్చిమిర్చి తరుగు - అర టీ స్పూన్
అల్లం వెల్లుల్లి పేస్ట్ - అర టీ స్పూన్
కారం - కొద్దిగా
గ రం మసాలా - పావు టీ స్పూన్
మైదా - తగినంత

తయారు చేయు విధానం :


1) స్టౌ పై పాన్ పెట్టి, టీ స్పూన్ నూనె వేసి వేడి చేయాలి.
2) దీంట్లో ఉల్లిపాయలు, పచ్చిమిర్చి తరుగు, అల్లం వెల్లుల్లిపేస్ట్, కారం, గరం మసాలా  ఉప్పు వేసి 5 నిమిషాలు వేయించాలి.
3) దీంట్లో ఎగ్ ముక్కలను .ఉడికించిన కేరెట్ ముక్కలు  ఉడికించిన బటాని వేసి రెండు నిమిషాలు వేయించాలి.
ఈ మిశ్రమం చల్లారనివ్వాలి.
4) మైదాను ముద్దలా కలపాలి. చిన్న గిన్నె లాంటి అచ్చు పరికరంలో కొద్దిగా పిండి పెట్టి,చుట్టూవత్తి, కాగుతున్న నూనెలో వేసి డీప్ ఫ్రై చేయాలి.
5) ఇవి చిన్న చిన్న కప్పుల మాదిరిగా వస్తాయి. వీటిలో ఎగ్ ముక్కలు అందంగా సర్దుకొని, తయారుచేసుకున్న పచ్చిబఠాణీల మిశ్రమం వేసి స్టఫ్ చే సి, సర్వ్ చేయాలి.


కావలసినపదార్దాలు:



మైదా -పావు కేజి
గుడ్లు - రెండు
ఉప్పు- తగినంత
పాలు - వంద గ్రాములు
ఉల్లిపాయలు - మూడు
కాప్సికం - మూడు
సోయా సాస్ - టేబుల్ స్పూన్
చిల్లి సాస్ - టేబుల్ స్పూన్
అజినమోతో - చిటికెడు
నూనె - వేయించడానికి సరిపడా

తయారు చేయు విధానం :



1 ) ఒక పాన్ లో కొంచెం నూనె పోసి, కాగాక  ఉల్లిపాయ,కాప్సికం ముక్కలు వేసి వేయింఛి అందులో కొంచెం  
సోయా సాస్,చిల్లి సాస్,అజినామోతో ,తగినంత ఉప్పు వేసి పొడి కూర తయారు చేయాలి.

2) ఇప్పుడు మైదా పిండి లో కోడి గుడ్లు ,పాలు కలిపి జారుడు పిండిలా తయారు చేయాలి .

3) ఒక పాన్ ను తీసుకుని వేడి చేయాలి. తరువాత దాన్ని బయటకు తీసి ,గరిటెడు పిండి పోసి,చుట్టూ తిప్పి 

పలుచటి చిన్న (పాన్ కేకు ) దోశ మాదిరిగా వేయ్యాలి..

4) తరువాత మళ్ళీ పాన్ ను పొయ్యి మీద ఉంఛి మరొకటి వెయ్యాలి.

5) ఇలా వేసిన పల్చటి ఈ దోశను టేబుల్ మీద చపాతిలా పరఛి దిని పైన,తయారుచేసిన పొడి కూరను పెట్టి ,ఒక్కో (దోశను )
కేకు ను ,కొంచెం మడత పెట్టి కప్పి,ముందు నుంచి చాపలా(రోల్) చుట్టి అంచులు విడిపోకుండా గుడ్డు సోనతో చివర్లు అంటించాలి.

6) ఇప్పుడు నూనె వేడి చేసి కాగిన తరువాత ,ఒకోక్క్ రోల్ ను వేడినూనె లో డీప్ ఫ్రై చేయ్యాలి .


7) ఇప్పుడు ఒకొక్క రోల్న్ రెండు, మూడు ముక్కలుగా కట్ చేసి అందించండి.

కావాలసిన పదార్దాలు :

బంగాళా దుంపలు - పావు కేజి
నిమ్మకాయ - ఒకటి
మిరియాలపొడి - అర టీ స్పూన్
చీజ్ - వంద   గ్రాములు
మీగడ - కప్పు
కోడిగుడ్డు - ఒకటి
బ్రెడ్ పొడి - అర కప్పు
నూనె - వేయించడానికి సరిపడా

తయారు చేయు  విధానం:


1 ) బంగాళా దుంపల్ని మెత్తగా ఉడికించి మెదిపి ముద్దగా చేసుకుని పక్కనఉంచాలి.
2) ఈ ముద్దలో ఉప్పు,మిరియాల పొడి,నిమ్మ రసం కలిపి వుంచాలి.
3) చీజ్ ను తురిమి అందులో మీగడ కలిపి ఉండలు గా చేయాలి.
4) ఒక్కో ఉండకు బంగాళా దుంప మిశ్రమాన్ని అద్దుతూ గుండ్రని బంతుల్లా చేయాలి.
5) గుడ్డు సొనను  బాగా గిలకొట్టాలి.
6) ఇప్పుడు ఈ ఉండలను గుడ్డు సోనలో ముంచి బ్రెడ్ పొడి లో దొర్లించి నూనెలోదోరగా వేయించాలి.
అంతే వేడి వేడి చీజ్ బాల్స్ రెడీ.

1

పిజా
కావలసిన పదార్దాలు
పిజా బేసిన్ _ బజార్లో దొరుకుతుంది
టమాటాలు -  రెండు
కాప్సికం  - ఇదు
ఉల్లిపాయ ముక్కలు మనకు సరిపడ
చీజ్  - సరిపడ
ఆయిల్ -  ఆలివ్ ఆయిల్ అయితే మరి బావుంటుంది
సాస్ కి
వెల్లుల్లి ముడు
ఆలివ్ నూనె కప్పు
టమాట పేస్టు అర కప్పు
టమాట ముక్కలు - కప్పు
తులసి ఆకులు పొడి టీ స్పూన్
ఉప్పు కొద్దిగా
కారం కొద్దిగా
బ్రవున్ షుగర్ రెండు స్పూన్లు
పనీర్ తురుము అర కప్పు
ఇష్టమైన కూరగాయ ముక్కలు అర కప్పు

తయారుచేయు విధానం

1)  స్టవ్ ఫై నూనె వేడిచేసి వెల్లుల్లి ముక్కలు వేసి వేయించాలి.
2)  తరువాత టమాట గుజ్జు ,టమాట ముక్కలు, కారం, ఉప్పు,తులసి ఆకులు, బ్రవున్ షుగర్ వేసి చిన్నమంటమీద సాస్ లా తయ్యారు అయ్యి వరకు ఉంచి దించి చల్లారనివ్వాలి.
3) కొద్దిగా నూనె వేడిచేసి ఉల్లి ముక్కలు, కాప్సికం ముక్కలు వేయించాలి.
4)  ఇప్పుడు పిజా బేస్  ఫై ముందుగా సాస్ వేసి పరిచి కూరగాయ ముక్కలు,ఉల్లి కాప్సికం ముక్కలు, చీజ్, పనీర్ పరిచి
 5) ఒవెన్ లో బేక్  చేస్తే చాలు పిజా తయార్.

1
శెనగ పిండి  స్నాక్స్
కావలసిన పదార్ధాలు

శెనగపిండి : కప్పు
కారం  :టీ స్పూన్
ఉప్పు : తగినంత
జీలకర్ర  : టీ స్పూన్
చాట్ మసాలా  : టీ స్పూన్
ఇంగువ  ; చిటికెడు
కొత్తిమీరపొడి  ; టీ స్పూన్
కరివేపాకు  :కొద్దిగా
నూనె : వేయించటానికి సరిపడా

తయారుచేయు విధానం

1) ఒకగిన్నేలో శెనగ పిండి వేసి దానిలో కారం,ఉప్పు, కొద్దిగా చాట్ మసాలా ,జీలకర్ర, ఇంగువ ,కిట్టిమిర పొడి,కొద్దిగా నూనె వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి గట్టిగా ముద్దలా కలపాలి.
2) దీనిని పొడవుగా నాలుగు అంగుళాల కడ్డిలా చేయ్యాలి.
3) స్టవ్ ఫై నీళ్ళు పెట్టి మరిగించాలి.మరుగుతున్న నీళ్ళల్లో  పొడవుగాచేసిన కడ్డీలు వేసి ఉడికించాలి.
4) వీటిని తీసి చల్లార నివ్వాలి.చల్లారిన తరువాత మనకు నచ్చిన ఆకారంలో కట్ చేసుకోవాలి.
5) ఇప్పుడు స్టవ్ ఫై నూనే పెట్టి వేడి చెయ్యాలి.కాగాక కట్ చేసిన ముక్కలు వేసి లేత ఎరుపు రంగులో వేయించాలి.
6) వీటిని  ఒక ప్లేటులోకి తీసుకోని వీటి ఫై చాట్ మసాలా చల్లి కలిపి వేయించిన కరివేపాకుతో అలంకరించి సర్వ్ చెయ్యాలి.
ఎంతో రుచిగా ఉండే కరకర లాడే స్నాక్ అయిటంరెడీ. 

1
కావలసిన పదార్దాలు :

గోదుమపిండి : కప్పు 
బియ్యపుప్పిండి : అర కప్పు
వేయించిన పల్లీలు : కప్పు 
ఉప్పు : తగినంత 
కారం : అర టీ స్పూన్ 
వంటసోడా : కొద్దిగా 
నూనె : వేయించటానికి తగినంత 

తయారుచేయు విధానం :

1) ఒకగిన్నేలో గోడుమపిండి, బియ్యప్పిండి, కారం, ఉప్పు, వంటసోడా, పల్లీలు,  వేసి అన్నికలిసేలా కలిపాలి.
2) ఇప్పుడు తగినన్ని నీళ్ళుపోసి ముద్దలా కలపాలి.
3) స్టవ్ వెలిగించి నూనె వేడిచేయ్యాలి. నూనె కాగాక కలిపిన పిండిని పకోడిలుగా  వేసి ఎర్రగా వేయించి తీసుకోవాలి.
అంతే గోధుమ పిండి పల్లీలు పకోడీ రెడీ.

1
కావలసిన పదార్ధాలు :

ఉల్లిపాయలు : రెండు 

పమిర్చి : మూడు 
కారం : అర స్పూన్
ధనియాల పొడి : స్పూన్ 

ఉప్పు : తగినంత
నూనె : వేయించటానికి సరిపడా 
శెనగ పిండి : మూడు స్పూన్లు 
మొక్క జొన్న పిండి : కప్పు
కొత్తిమీర : కొద్దిగా
అల్లం : చిన్న ముక్క 

వంట సోడా :  పావుస్పూన్

తయారుచేయు విధానం :

1) ఒక గిన్నె తీసుకోని దానిలో శెనగ పిండి,మొక్కజొన్నపిండి వేసి దానిలో  ఉల్లి ముక్కలు, పచ్చి మిర్చి ముక్కలు ఫైన చెప్పిన అన్ని పదార్దాలు 
వేసి  నీరుపోసి బాగా కలుపుకోవాలి.
2) ఇప్పుడు నూనె  వేడి చేసి ఈ  మిశ్రమాన్ని కొద్ది కొద్ది గా పకోడి లుగా కాగె నూనెలో వేసుకోవాలి.

3) ఎరుపు రంగు వచ్చే వరకు వేయించు కొని తీసెయ్యాలి.
అంతే మొక్కజొన్న పకోడీలు రెడీ.

కావలసిన పదార్దాలు :

బేబి కార్న్ : ఆరు (లేత మొక్కజొన్న పొత్తులు)

మైదా : కప్పు 
 క్రీం : కప్పు 
కారం : అర టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
అల్లం వెల్లుల్లి పేస్టు :టీ స్పూన్ 
సేమ్య : కప్పు 
నూనె : అరకిలో 

తయారుచేయు విధానం : 


1) బేబి కార్న్ని కోద్దిగా నీళ్ళు పోసి చిటికెడు ఉప్పు వేసి వుడికించి పక్కన పెట్టాలి.

2) చల్లారిన తరువాత  ఒకొక్క దానిని నాలుగు ముక్కలుగా నిలువుగా పొడవుగా కట్ చేసి పక్కన వుంచాలి.  
3) ఇప్పుడు మైదాలో  కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి పేస్టు, క్రీం వేసి కలపాలి.
నీళ్ళు పోసి చిక్కగా బజ్జిలా పిండిలా కలపాలి.
4) ఒక ప్లేటులో సేమ్య వెసి పక్కన వుంచాలి.
5)ఇప్పుడు స్టవ్ వెలిగించి నూనె వేడి చెయ్యాలి. 
6) నూనె కాగాక బేబి కార్న్ ముక్కలు కలిపిన మైదాలో ముంచి  అలాగే సేమ్యలో దొర్లించి కాగే  నూనెలో వేసి దోరగా వేయించుకోవాలి.
అంతే  బేబి కార్న్ బజ్జి రెడీ.

కావలసిన పదార్దాలు 

పొట్టు లేని మినప్పప్పు  : పావుకేజీ  

కారం : అర టీ స్పూన్ 
ఉప్పు: తగినంత 
కరివేపాకు : కప్పు  
నూనె : పావుకేజీ 

తయారుచేయు విధానం :


1) మినప్పప్పును ఐదు గంటల ముందు నానబెట్టాలి. నానిన మినప్పప్పును  నీళ్ళలో నుండి తీసి పొడిగా అయ్యే వరకు ఒక క్లాత్ మీద  ఆరబెట్టాలి. . 

2) ఇప్పుడు స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. 
3) నూనె వేడి అయ్యాక నానబెట్టిన  మినప్పప్పు  వేస్తే అవి బాగా  వేగి  ఫైకి తేలతాయి  వీటిని తీసి టిష్యూపేపరు పరిచిన ఒకప్లేటులోకి తీసుకోవాలి.మినప్పప్పులో  నూనె ఉంటె పేపర్ పీల్చుకుంటుంది.
ఇదే నూనెలో కరివేపాకు వేసి వేయించాలి.
4)ఇప్పుడు వేగిన మినప్పప్పులో   వేపిన కరివేపాకు, ఉప్పు, కారం కలపాలి.


కావలసిన పదార్దాలు:

పనస పిక్కలు : పదిహేను 
శెనగపిండి : పావుకేజీ 
కారం : కొద్దిగా
ఉప్పు : తగినంత 
వాము : కొద్దిగా 
వంటసోడా : చిటికెడు 
నూనె : పావుకేజీ 

తయారుచేయు విధానం :

1) పనస పిక్కలు వుడికించి ఫై  పొర వలిచి పక్కనపెట్టాలి.
2) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
3) నూనె కాగే లోపు ఒక గిన్నెలో శెనగ పిండి, ఉప్పు, కారం, వాము, వంటసోడా వేసి కలిపి నీళ్ళు పోసి కాస్త చిక్కగా బజ్జిల పిండిలా కలపాలి.
4) ఉడికించిన పనస పిక్కల్ని ఒకొక్కటిగా ఈ పిండిలో ముంచి కాగే నూనెలో బజ్జిలా వెయ్యాలి.
 5) దోరగా వేగాక ఒక ప్లేటులోకి తీసుకోని కొబ్బరి చెట్నితో తింటే చాల బాగుంటాయి.    

Powered by Blogger.