నువ్వులు : పావుకిలో
బెల్లం : పావుకిలో
నెయ్యి : టేబుల్ స్పూన్
తయారుచేయు విధానం :
1) నువ్వులు శుబ్రం చేసి దోరగా వేయించండి.(వేయించకుండా కూడా చేసుకోవచ్చు)
2) బెల్లం చిన్నముక్కలుగా చెయ్యాలి.నువ్వులు రోట్లో వేసి దంచి మెత్తగా అయ్యిన తరువాత బెల్లం వేసి దంచితే గట్టిగా ముద్దలా అవ్వుతుంది.
3) దీనిలో నెయ్యి కలిపి ఉండలు చుట్టుకోవాలి.
* అంతే ఇవి పిల్లలకు చాలా బలవర్ధకం అయ్యినవి.