Showing posts with label non-vegetarian. Show all posts

కావలసిన పదార్దాలు :

సేమ్యా : మూడొందల గ్రాములు
చికెన్ : కిలో
నెయ్యి : కప్పు
ఉప్పు : తగినంత
అల్లం : చిన్న ముక్క
పచ్చిమిర్చి : మూడు
ఉల్లి పాయలు : మూడు
గరం మషాలా : రెండు టీ స్పూన్లు
లవంగాలు : ఆరు
జీడిపప్పు : పది
వెల్లుల్లి రెబ్బలు : ఆరు
యాలుకలు : నాలుగు
టమాటాలు : మూడు
కొత్తిమీర : ఒక కట్ట
పసుపు : కొంచెం
కిస్మిస్ : కొద్దిగా
కారం : రెండు స్పూన్లు
సోయాబిన్ సాస్ : రెండు స్పూన్లు
కరివేపాకులు : కొద్దిగా

తయారుచేయు విధానం :

1) ముందుగా చికెన్ శుబ్రం చేసి కావలసిన సైజులో ముక్కలు చెయ్యాలి.

2) నెయ్యి వేడిచేసి సేమ్యాను దోరగా వేయించండి.

3) తరువాత జీడిపప్పులు, కిస్మిస్లు నేతిలో వేయించి పక్కన పెట్టండి.

4) మరికాస్త నెయ్యి వేసి దానిలో లవంగాలు, యాలుకలు, కరివేపాకు, పచ్చిమిర్చి వేసి వేయించండి.అవి వేగాక ఉల్లి ముక్కలు వేసి కాసేపు వేయించాక అల్లం వెల్లుల్లి ముద్ద వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.


5) ఇప్పుడు చికెన్ ముక్కలు, టమాట ముక్కలు వేసి ఒక సారి కలిపి దీనిలో కారం, గరం మషాల,ఉప్పు వేసి చికెన్ మెత్తగా ఉడికే వరకు ఉంచలి.

6) ఇప్పుడు వేయించిన సేమ్యా  వేసి కలిపి రెండు కప్పుల నీళ్ళు వేసి ఉడికించాలి.
7) నీళ్ళు మొత్తం ఇగిరి పోయాక జీడిపప్పు, కిస్మిస్లు, సోయాబిన్ సాస్ వేసి కలిపి పోడి పొడిగా అయ్యేదాకా ఉంచి కొత్తిమీర చల్లి వడ్డించండి.


కావలసిన పదార్దాలు 

చికెన్ - అరకేజి 
ఉల్లిపాయలు - రెండు 
టమాటో - ఒకటి 
అల్లం - చిన్నముక్క 
కొబ్బరి తురుము - అర కప్పు 
గోంగూర ఆకులు  - కప్పు 
పుదీనా - కట్ట 
పచ్చిమిర్చి - మూడు 
మసాల - టీ స్పూన్ 
గసాలు - రెండు టీ స్పూన్లు 
కొత్తిమీర - కట్ట 
జీడిపప్పు - పది 
వెల్లుల్లి - ఒకటి 
యాలుకలు - మూడు 

తయారుచేయు విధానం 

1) చికెన్ కడిగి పక్కన పెట్టాలి.పుదీనా, కొత్తిమీర, చింతచిగురు కట్ చేసి కడిగి పక్కన పెట్టాలి.
2) గసాలు, జీడిపప్పు, యలుకులు, అల్లం, వల్లుల్లి, కొబ్బరి ముద్దలా నూరాలి.
3) స్టవ్ ఫై గిన్నె పెట్టి నూనె వేడి చేసి ఉల్లి, మిర్చి. టమాటాలు వేసి వేగనివ్వాలి.పుదీనా కూడా వేసి వేగనిచ్చి కడిగిన చికెన్ వేసి నీరు ఇంకి పోయే వరకు నూనెలో వేగనివ్వాలి.
4) ఇప్పుడు నూరిన మసాలముద్ద, ఉప్పు, కారం,
పసుపు ,గోంగూర వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి వుడికించాలి.
5) ఇప్పుడు మసాలాపొడి, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి స్టవ్ ఆపాలి.
అంటే చికెన్ ,చింతచిగురు కూర రెడీ.    


కావలసిన పదార్దాలు 

చికెన్ - అరకేజి 
ఉల్లిపాయలు - రెండు 
టమాటో - ఒకటి 
అల్లం - చిన్నముక్క 
కొబ్బరి తురుము - అర కప్పు 
చింత చిగురు ఆకులు ముక్కలుగా కట్ చేసినవి  - రెండు కప్పు 
పుదీనా - కట్ట 
పచ్చిమిర్చి - మూడు 
మసాల - టీ స్పూన్ 
గసాలు - రెండు టీ స్పూన
కొత్తిమీర - కట్ట 
జీడిపప్పు - పది 
వెల్లుల్లి - ఒకటి 
యాలుకలు - మూడు 

తయారుచేయు విధానం 

1) చికెన్ కడిగి పక్కన పెట్టాలి.పుదీనా, కొత్తిమీర, చింతచిగురు కట్ చేసి కడిగి పక్కన పెట్టాలి.
2) గసాలు, జీడిపప్పు, యలుకులు, అల్లం, వల్లుల్లి, కొబ్బరి ముద్దలా నూరాలి.
3) స్టవ్ ఫై గిన్నె పెట్టి నూనె వేడి చేసి ఉల్లి, మిర్చి. టమాటాలు వేసి వేగనివ్వాలి.పుదీనా కూడా వేసి వేగనిచ్చి కడిగిన చికెన్ వేసి నీరు ఇంకి పోయే వరకు నూనెలో వేగనివ్వాలి.
4) ఇప్పుడు నూరిన మసాలముద్ద, ఉప్పు, కారం,
పసుపు ,చింత చిగురు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి వుడికించాలి.
5) ఇప్పుడు మసాలాపొడి, కొత్తిమీర వేసి కలిపి మూత పెట్టి స్టవ్ ఆపాలి.
అంటే చికెన్ ,చింతచిగురు కూర రెడీ.    

కావలసిన పదార్దాలు :

కాప్సికం : రెండు 

కోడి గ్రుడ్లు : రెండు
ఉల్లిపాయలు : ఒకటి
కారం : అర టీ స్పూన్
పసుపు : పావు టీ స్పూన్
మిరియాల పొడి : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
నూనె : మూడు టేబుల్ స్పూన్లు
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్


తయారుచేయు విధానం : 

1) కళాయి లో నూనె పోసి వేడి చేసుకోవాలి.
2) నూనె కాగాక  ఉల్లిపాయ ముక్కలు  వేసి దోరగా వేయించాలి.

3) వేగాక కొంచం పసుపు వేసి కలిపాలి. తరువాత  కోడి గ్రుడ్లను వేసి ఉప్పు, కొంచం మిరియాల పొడి వేసి కలిపిఐదు  నిముషాల పాటు మూత పెట్టి ఉడకనివ్వాలి.
4) ఇప్పుడు  కాప్సికం ముక్కలను వేసి చిన్న మంట మీద ఐదు  నిముషాల  ఉడక నివ్వాలి.
5) ఇప్పుడు కారం, ఉప్పు వేసి సన్నటి మంట  మీద మరో ఐదు నిముషాలు  పాటు ఉంచి వేడి వేడి గా వడ్డించాలి.




కావలసిన పదార్దాలు :


చికెన్ లెగ్ పీసెస్ : ఆరు 
పెరుగు : రెండు  టేబుల్ స్పూన్లు 
అల్లం వెల్లుల్లి పేస్ట్ : రెండు టేబుల్ స్పూన్స్
పుదినా :  ఒక కట్ట 
పచ్చిమిర్చి : ఆరు 
కారం :  టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత 
గరం మసాల :  టీ స్పూన్
నూనె : అర కప్పు 
మిరియాల పొడి :  టీ స్పూన్ .


తయారు చేసే విదానం :


1) ముందుగా చికెన్ లెగ్ పీసెస్ బాగా శుభ్రం గా కడిగి చాకుతో చిన్న చిన్న గాట్లు పెట్టుకోవాలి.
2) పెరుగు తీసుకొని అందులో అల్లం వెల్లులి పేస్ట్, పచ్చి మిర్చి పేస్ట్ ,పుదినా పేస్ట్ ,గరం మసాల పౌడర్ ,ఉప్పు,కారం వేసి మిక్స్ చేసుకొని లెగ్ పీసెస్ కు పట్టించి రెండు గంటలు నానబెట్టాలి.
3) నానబెట్టిన లెగ్ పీసెస్ నుకుక్కర్ లో ఆవిరి పైన ఉడికించాలి.
4) పొయ్యి మీద బాణాలి పెట్టుకొని నూనె పోసి వేడెక్కిన తర్వాత లెగ్ పీసెస్ అందులో వేసి వేయించాలి.
5) యించిన లెగ్ పీసెస్ పైన మిరియాల పొడి జల్లుకోవాలి .

1
కావలసిన పదార్దాలు :

నాటుకోడి మాంసం - ఒక కేజి
నూనె - మూడు టీ స్పూన్లు 
ఉల్లిపాయలు - మూడు 
పచ్చిమిరపకాయలు - ఆరు
అల్లం వెల్లుల్లి ముద్ద - రెండు టేబుల్ స్పూన్లు 
ఉప్పు - తగినంత
పసుపు - ఒక స్పూను
పెరుగు - ఒక కప్పు
కొబ్బరి పొడి - రెండు టీ స్పూన్లు
కారంపొడి - టేబుల్ స్పూను
ధనియాలపొడి - ఒక స్పూను
కొత్తిమీర - కట్ట
తయారుచేయు విధానం 

ముందుగా కోడి మాంసాన్ని కడిగి శుభ్రం చేసుకొని పక్కన పెట్టుకోవాలి.
తరువాత ఒక పాన్ లో నూనె వేసివేదిచేయ్యాలి.కాగిన నూనెలో తరిగిన ఉల్లిపాయలు, మధ్యగా కోసిన పచ్చిమిర్చీ, అల్లం వెల్లుల్లి పేస్టు, రెండు రెబ్బలు కరివేపాకు, పసుపు, ఉప్పు వేసి వేయించాలి.
ఇవి దోరగా వేగాక ఈ మిశ్రమంలో కప్పు పెరుగు వేసి ఉడికించాలి.
తరువాత కోడిమాంసం వేసి మాంసంలో నీరు ఇగిరిపోయేదాకా ఉడికించాలి.
ఇప్పుడు కారం, ధనియాల పొడి, కొబ్బరి పొడి వేసి కొద్దిగా ఉడికించాలి. 
తరువాత సరిపడా నీరు పోసి బాగా ఉడికించాలి.
ఇప్పుడు కూర రెడీ అయినట్టే  దించేముందు కొత్తిమీర ,గరం మసాల వేసి 
సర్వ్ చెయ్యటమే.




కావలసినవి :

ఫ్రాన్స్ 1 / 2 కేజీ
అల్లం వెల్లుల్లి పేస్ట్ : ఒక టేబుల్ స్పూన్
చిల్లి సాస్స్ : టేబుల్ స్పూన్
సోయా సాస్స్ : ఒక టేబుల్ స్పూన్
వెనిగర్ : ఒక టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
కారం : ఒక టేబుల్ స్పూన్
మైదా పిండి : అర కప్పు
కార్న్ ఫ్లోర్ : అర కప్పు
గుడ్డు : ఒకటి
అల్లం వెల్లుల్లి ముక్కలు : ఒకటేబుల్ స్పూన్
ఎండు మిర్చి : నాలుగు
ఉల్లిపాయ : ఒకటి పెద్దది
నిమ్మ కాయ : ఒకటి

తయారు చేసే విధానం:

1) ముందుగా ఫ్రాన్స్ మీడియం సైజువి తీసుకుని శుబ్రము గా కడగాలి.
2) వాటిని మద్యకు నిలువుగా చివర్లు కట్ చేయకుండా పొడవుగా వచ్చేటట్లు కట్ చేసుకోవాలి .
3) వీటిని ఒక గిన్నె తీసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ , చిల్లి సాస్ , సోయా సాస్ , వెనిగర్ , ఉప్పు, కారం, మైదా పిండి, కార్న్ ఫ్లోర్, ఒక గుడ్డు లోని తెల్ల సోన ను కూడా వేసి కలపాలి
4) అందులో ఫ్రాన్స్ వేసి కలిపి ఒక్కొక్కటి పిండిలో నుండి కాగుతున్ననూనె లో వేసి పకోడిలా మాదిరి వేయించాలి .
5) ఇంకొక పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి అల్లం వెల్లుల్లి ముక్కలు, ఎండు మిర్చి ,లావుగా కోసిపెట్టుకున్న ఉల్లి ముక్కలు వేసి కొద్దిగా వేగాక ఫ్రాన్స్ వేసి కలిపి నిమ్మకాయ ముక్కలతో సర్వ్ చేయాలి.




చికెన్ వడలు
కావలసినపదార్దాలు :


బోన్‌లెస్ చికెన్ - 250 గ్రా.
తెల్ల మిరియాలపొడి - తగినంత
ఉప్పు - రుచికి తగినంత
మైదా - 2 టీ స్పూన్లు
గుడ్డు - 1
నూనె : వేయించటానికి సరిపడ

 చికెన్ వడలు తయారు చేయు విధానం :


1) ముందుగా చికెన్‌కు మిరియాలపొడి కలిపి అరగంట నాననివ్వాలి.
2) దీనికి కొద్దిగా ఉప్పు కలిపి గ్రైండ్ చేసుకోవాలి. 
3) మరో పాత్రలో గుడ్డులోని తెల్లసొన, మైదా, ఉప్పు కలిపి ఉంచాలి. 
4) కడాయిలో నూనె కాగిన తర్వాత గ్రైండ్ చేసుకున్న 
చికెన్‌ను చిన్న చిన్న వడలుగా చేసి గుడ్డు మిశ్రమంలో ముంచి, కాగిన నూనెలో వేసి వేయించాలి.

కావలసిన పదార్దాలు :

మెత్తని చికెన్ : పావు కిలో
పాలకూర తరుగు : ఒక కప్పు
క్యారెట్ ముక్కలు : పావుకప్పు
బీన్స్ ముక్కలు : పావుకప్పు
కార్న్ ఫ్లోర్ :: టీ స్పూన్
వెల్లుల్లి ముక్కలు : టీ స్పూన్
పచ్చిమిర్చి ,ముక్కలు : టీ స్పూన్
 మిరియాల పొడి : చిటికెడు
ఉప్పు : తగినంత
నూనె : టీ స్పూన్
పంచదార : టీ స్పూన్
అజినమోటో : చిటికెడు
ఉల్లి కాడలముక్కలు : టీ స్పూన్

తయారుచేయు విధానం :

1) స్టవ్ మీద గిన్నె పెట్టి చికెన్ వేసి అది మునిగే వరకు నీళ్ళు పోసి ఉడికించి పక్కనపెట్టాలి.
2) తరువాత స్టవ్ ఫై పాన్ పెట్టి నూనె వేడి చేసి క్యారెట్ ముక్కలు, బీన్స్, వెల్లుల్లి, పచ్చిమిర్చివేసి వేయించాలి .
3) వేగాక చికెన్ ఉడికించిన నీళ్ళు, పంచదార, ఉప్పు, పాలకూర తరుగు, ఉల్లి కాడల తరుగు,
మిరియాలపొడి వేసి పది నిముషాలు ఉడికించాలి.
4) ఇప్పుడు కార్న్ ఫ్లోర్ నీటిలో కలిపి ఉడుకుతున్న సూప్ లో వేసి కలిపి స్టవ్ ఆపాలి.
5) సర్వ్ చేసే ముందు అజినమోటో వేసి సర్వ్ చెయ్యాలి.

1

కావలసిన పదార్దాలు:

రొయ్యలు : పన్నెండు(పెద్దవి)
కొబ్బరి తురుము : కప్పు
బ్రెడ్ ముక్కలు : ఐదు
గుడ్లు : నాలుగు
మిరియలపొడి : టీ స్పూన్
ఉప్పు : తగినంత
నూనె : వేయించ టానికి సరిపడ
ఉల్లి ముక్కలు : పావు కప్పు 

తయారు చేయు విధానం:

1) రొయ్యలు తోకలు అలాగే ఉంచి ఫై పొలుసు వలిచి, బాగా కడిగి ఉంచుకోవాలి.
2) బ్రెడ్ స్లయిసేస్ చిదిమి వీటికి కొబ్బరితురుము కలపాలి.
3) గుడ్లు పగుల గొట్టి దీనిలో మిరియాలపొడి కలపాలి.
4) ఇప్పుడు స్టవ్ వెలిగించి  నూనె వేడి చేయ్యాలి.ఉల్లి ముక్కలు వేయించి తియ్యాలి.
5)  ఇప్పుడు రొయ్యలు ఒకొక్కటిగా గుడ్లు సోనలో ముంచి తరువాత బ్రెడ్, కొబ్బరి మిశ్రమంలో దొర్లించి కాగుతున్న నూనెలో వేసి రెండు  ప్రక్కలా దోరగా వేయించాలి.వీటికి వేయించిన ఉల్లి ముక్కలు కలపాలి.
6) ఇవి అన్నంలో తినొచ్చు,లేదా సాయింత్రాలు స్నాక్సలా తినొచ్చు .



కావలసిన పదార్దాలు:
చికెన్ : అర కిలో
ములక్కాడలు : మూడు
ఉల్లి ముక్కలు : కప్పు
పచ్చిమిర్చి : మూడు
కారం : రెండు టీ స్పూన్లు
పసుపు : పావు టీ స్పూన్
ఉప్పు : తగినంత
గరం మసాలా : టీ స్పూన్
టమాటా ప్యూరి : పావు కప్పు
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్
కొత్తిమీర : కట్ట
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
 కరివేపాకు : కొద్దిగా 

తయారు చేయు విధానం:

1) ములక్కాడలు ముక్కలుగా కట్ చెయ్యాలి. ఉల్లి ముక్కలు పేస్టు లాచేయ్యాలి. 
2) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి దానిలో శుబ్రం చేసిన చికెన్, కారం, ఉప్పు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్టు వేసి మూత పెట్టి ఉడికించాలి.
3) ప్రక్క స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.దీనిలో ఉల్లిపేస్టు వేసి రెండు నిముషాలు వేయించాలి.
4) అది వేగాక టమాట ప్యూరి వేసి మరి  కాసేపు వేయించాలి.దీనిలో కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేయించాలి.
5) ఇప్పుడు ములక్కాడ ముక్కలు వేసి కాసేపు వేయించి గ్లాస్ నీళ్ళు పోసి మూతపెట్టి ఉడికించాలి.
6) ఇప్పుడు చికెన్ లో  నీళ్ళు పూర్తిగా యిగిరి పొడిగా అవ్వుతుంది. దీనిని ఉడుకుతున్న ములక్కాడ ల్లో వేసి బాగా కలిపి మిగిలిన అల్లం వెల్లుల్లి పేస్టు, గరం మసాలా,ఉప్పు వేసి ఒకసారి కలిపి మూత పెట్టి ఐదు నిముషాలు ఉడికించాలి.
7) దించేముందు కొత్తిమీర చల్లి స్టవ్ ఆపాలి.

కావలసిన పదార్దాలు :


గుడ్లు : మూడు 
ఉల్లిముక్కలు : కప్పు 
పచ్చిమిర్చి ముద్ద : టీ స్పూన్ 
కారం : పావు టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
అల్లం వెల్లుల్లి ముద్ద : టీ స్పూన్ 
గరం మసాలా : పావు టీ స్పూన్ 
కరివేపాకు : రెండు రెమ్మలు 
కొత్తిమీర తురుము : టేబుల్ స్పూన్ 
నూనె : రెండు టేబుల్ స్పూన్లు 
పసుపు : పావు టీ స్పూన్ 


తయారుచేయు విధానం :


1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి. కాగాక ఉల్లిముక్కలు వేసి వేయించాలి.
2) ఉల్లిముక్కలు వేగాక పచ్చిమిర్చిపేస్టు, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేవరకు వేయించాలి.
3) ఇప్పుడు కారం, ఉప్పు, పసుపు, కరివేపాకు వేసి కలిపి గుడ్లు పగులగొట్టి వెయ్యాలి. గుడ్లు వేసిన వెంటనే కలుపుతూ ఉండాలి. ఐదునిముషాలకు పొడిపొడిగా తయారవ్వుతుంది.
4) ఇప్పుడు గరంమసాలా, కొత్తిమీర వేసి స్టవ్ ఆపాలి.

కావలసిన పధార్దాలు:


చికెన్ : అరకిలో
అల్లం వెల్లుల్లి పేస్టు : టేబుల్ స్పూన్ 
కారం : టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
గరం మసాలా : అర టీ స్పూన్ 
కొత్తిమీర: కట్ట 
పుదినా : కట్ట 
ఉల్లిపాయముక్కలు : కప్పు 
పచ్చిమిర్చి :నాలుగు 
పలావు ఆకు : మూడు 
పలావ్ :మసాలా దినుసులు పొడి : టీ స్పూన్ 
బియ్యం :అరకిలో 
పెరుగు : అర కప్పు 
దనియాల పొడి : టీ స్పూన్ 
చెక్క, లవంగాలు, యాలుకులు : అర టీ స్పూన్ 
నూనె : కప్పు 
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు 


తయారుచేయు విధానం: 


1) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడిచేసి ఉల్లిముక్కలు వేయించి ప్లేటులోకి తీసుకోవాలి. అదే నూనెలో పచ్చిమిర్చి కూడా వెయించాలి. అలాగే పుదినా కూడా వేయించి ప్లేటులోకి తియ్యాలి. అలాగే కొత్తిమీర కూడా వేయించాలి.
2) చికెన్ శుబ్రంచేసి ఒకగిన్నెలో వెయ్యాలి. దీనిలో ఉప్పు, కారం, అల్లంవెల్లుల్లి పేస్టు, మసాలా, పలావ్ మసాల, పెరుగు, ధనియాలపొడి, వేయించిన పచ్చిమిర్చి, వేయించిన కొత్తిమీర, పుదినా, కొత్తిమీర, పుదినా వెయించగా మిగిలిన నూనె కూడా వేసి బాగాకలిపి ఒకగంట పక్కనపెట్టాలి.
3) ఒకగిన్నేలో బియ్యం, చెక్క, లవంగాలు, యాలుకులు, పలావ్ ఆకూ, కొద్దిగా ఉప్పు వేసి తగినన్ని నీళ్ళు పోసి మూడువంతులు ఉడికించి (పొడి పొడిగా) పక్కన పెట్టాలి.
4) ఇప్పుడు ఒక మందపాటి పాత్ర తీసుకోని దానిలో చికెన్ వేసి సర్ది  దానిమీద ఉడికించిన అన్నం సగంవేసి సమంగా చేసి దానిమీద కొద్దిగా వేయించిన ఉల్లి ముక్కలు, కొత్తిమీర, పుదినా వేసి దానిఫైన మిగిలిన అన్నం వేసి దానిమీద మిగిలిన ఉల్లిముక్కలు, కొత్తిమీర, పుదినా వేసి ఫైన నెయ్యి వేసి మూతపెట్టి స్టవ్ మీదపెట్టి పది పదిహేను నిముషాలు ఉడికించి స్టవ్ ఆపాలి. అంతే ఘుమఘుమలాడే చికెన్ బిర్యాని రెడీ.

కావలసిన పదార్దాలు :

గుడ్లు : ఆరు 
బంగాళా దుంపలు చిన్నవి : పది  
ఉల్లిపాయలు : మూడు  
పచ్చిమిర్చి : మూడు 
కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 
గరం మసాలా : అర టీ స్పూన్ 
చింతపండు : నిమ్మకాయంత 
కరివేపాకు : రెండు రెమ్మలు 
పసుపు : పావు టీ స్పూన్ 
నూనె : మూడు టేబుల్ స్పూన్లు 
కొత్తిమీర : కొద్దిగా 
టమాటాలు : రెండు 

తయారుచేయు విధానం: 

1) గుడ్లు, బంగాళదుంపలు ఉడికించి వలిచి పక్కనపెట్టాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలుగా కట్ చెయ్యాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడిచెయ్యాలి. నూనె కాగాక గుడ్లుకి అక్కడక్కడ గాట్లుపెట్టి వేయించి తియ్యాలి.
3) అదే నూనెలో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేయించాలి. తరువాత అల్లంవేల్లుల్లి పేస్టు వేసి వేగిన తరువాత టమాటముక్కలు వేసి మగ్గిన తరువాత  బంగాళాదుంపలు వేసి కలిపి ఒకనిముషం మూతపెట్టాలి.
4) ఇప్పుడు మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. తరువాత చింతపండురసం, గుడ్లు వేసి మరో ఐదునిముషాలు ఉడకనివ్వాలి.
* ఇప్పుడు మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపాలి.

కావలసిన పదార్ధాలు :


మటన్ కీమా : పావుకేజీ 
ఓట్సు : రెండు టేబుల్ స్పూన్లు 
బియ్యప్పిండి : రెండు టేబుల్ స్పూన్లు 
ఉప్పు : తగినంత 
కారం : ఒక టేబుల్ స్పూన్ 
కొత్తిమీర, పుదినా పేస్టు : టేబుల్ స్పూన్ 
పచ్చిబటాణి పేస్టు : టేబుల్ స్పూన్ 
పెరుగు : రెండు టేబుల్ స్పూన్లు 
అల్లం-వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 


తయారు చేయు విధానం:


1) కీమాలో చిటికెడు ఉప్పు, అల్లం పేస్టు కొద్దిగా వేసి ఉడికించాలి. 
2) ఉడికించిన కీమా మిక్సిపట్టాలి. దీనిలో కారం, ఉప్పు, పెరుగు, అల్లం వెల్లులి పేస్టు, కొత్తిమీర పేస్టు, ఓట్సు, బటాని పేస్టు కలపాలి.
3) వీటిని చిన్నచిన్న ముద్దలుగా తీసుకోని అరచేతీలో చిన్నగా వత్తి బియ్యప్పిండిలో అద్ది నాన్ స్టిక్ పాన్ మీద కొద్దిగా నూనెవేసి రెండుప్రక్కలా బాగావేయించాలి.

కావలసిన పదార్దాలు :

గుడ్లు : ఆరు 
పచ్చిరొయ్యలు : పావుకేజీ 
ఉల్లిపాయలు : మూడు  
పచ్చిమిర్చి : మూడు 
కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 
గరం మసాలా : అర టీ స్పూన్ 
చింతపండు : నిమ్మకాయంత 
కరివేపాకు : రెండు రెమ్మలు 
పసుపు : పావు టీ స్పూన్ 
నూనె : మూడు టేబుల్ స్పూన్లు 
కొత్తిమీర : కొద్దిగా 
టమాటాలు : రెండు 

తయారుచేయు విధానం :

1) గుడ్లు ఉడికించి వలిచి పక్కన పెట్టాలి. పచ్చిరొయ్యలు లో ఉప్పు, పసుపు వేసి ఉడికించి పక్కన పెట్టాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలుగా కట్ చెయ్యాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడిచెయ్యాలి. నూనె కాగాక గుడ్లుకి అక్కడక్కడ గాట్లుపెట్టి వేయించి తియ్యాలి.
3) అదే నూనెలో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. తరువాత అల్లంవేల్లుల్లి పేస్టు వేసి వేగిన తరువాత టమాట ముక్కలు వేసి మగ్గిన తరువాత పచ్చిరొయ్యలు వేసి కలిపి ఒకనిముషం మూతపెట్టాలి.
4) ఇప్పుడు మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టి ఐదునిముషాలు ఉడకనివ్వాలి. తరువాత చింతపండురసం, గుడ్లు వేసి మరో ఐదునిముషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపాలి. 

కావలసిన పదార్దాలు :

గుడ్లు : ఆరు 
పచ్చిజీడిపప్పు : కప్పు   
ఉల్లిపాయలు : మూడు  
పచ్చిమిర్చి : మూడు 
కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 
గరం మసాలా : అర టీ స్పూన్ 
కరివేపాకు : రెండు రెమ్మలు 
పసుపు : పావు టీ స్పూన్ 
నూనె : మూడు టేబుల్ స్పూన్లు 
కొత్తిమీర : కొద్దిగా 
టమాటాలు : రెండు 

తయారుచేయు విధానం :

1) గుడ్లు వలిచి పక్కన పెట్టాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు  ముక్కలుగా కట్ చెయ్యాలి. పచ్చిజీడిపిక్కలు రెండుగా కోసి దాని నుండి జీడిపప్పును తీసుకోవాలి.  ఫై పొర వలిచి కడిగి పక్కన పెట్టాలి.
2) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి. నూనె కాగాక గుడ్లుకి అక్కడక్కడ గాట్లుపెట్టి వేయించి తియ్యాలి.
3) అదే నూనెలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేయించాలి. తరువాత అల్లం వేల్లుల్లి పేస్టు వేసి వేగిన తరువాత టమాటముక్కలు వేసి ఒకనిముషం మూతపెట్టాలి.
4) ఇప్పుడు మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టి ఐదునిముషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు వేయించిన గుడ్లు, జీడిపప్పు వేసి మరో ఐదునిముషాలు ఉడకనిచ్చి మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపాలి.

కావలసిన పదార్దాలు :

గుడ్లు : ఆరు 
బెండకాయలు :  పావుకేజీ 
ఉల్లిపాయలు : రెండు 
పచ్చిమిర్చి : మూడు 
కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 
గరం మసాలా : అర టీ స్పూన్ 
చింతపండు : నిమ్మకాయంత 
కరివేపాకు : రెండు రెమ్మలు 
పసుపు : పావు టీ స్పూన్ 
నూనె : మూడు టేబుల్ స్పూన్లు 
కొత్తిమీర : కొద్దిగా 

తయారుచేయు విధానం :

1) గుడ్లు ఉడికించి వలిచి పక్కన పెట్టాలి. బెండకాయలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చెయ్యాలి.
2) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక గుడ్లుకి అక్కడక్కడ గాట్లుపెట్టి వేయించి తియ్యాలి.
3) అదే నూనెలో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. తరువాత అల్లం వేల్లుల్లి పేస్తూ వేసి వేగిన తరువాత బెండకాయ ముక్కలు వేసి కలిపి ఒక నిముషం  మూత పెట్టాలి.
4)  ఇప్పుడు మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. తరువాత చింతపండు రసం, గుడ్లు వేసి మరో ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలా, కొత్తిమీర వేసి స్టవ్ ఆపాలి.

కావలసిన పదార్దాలు :

గుడ్లు : ఆరు 
ములక్కాడలు : నాలుగు 
ఉల్లిపాయలు : మూడు  
పచ్చిమిర్చి : మూడు 
కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 
గరం మసాలా : అర టీ స్పూన్ 
చింతపండు : నిమ్మకాయంత 
కరివేపాకు : రెండు రెమ్మలు 
పసుపు : పావు టీ స్పూన్ 
నూనె : మూడు టేబుల్ స్పూన్లు 
కొత్తిమీర : కొద్దిగా 
టమాటాలు : రెండు 

తయారుచేయు విధానం :

1) గుడ్లు ఉడికించి వలిచి పక్కన పెట్టాలి. ములక్కాడలు, ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలుగా కట్ చెయ్యాలి.
2) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి. నూనె కాగాక గుడ్లుకి అక్కడక్కడ గాట్లుపెట్టి వేయించి తియ్యాలి.
3) అదే నూనెలో ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేయించాలి. తరువాత అల్లం-వేల్లుల్లి పేస్టు వేసి వేగిన తరువాత టమాటముక్కలు వేసి మగ్గిన తరువాత ములక్కాడముక్కలు వేసి కలిపి, ఒక నిముషం మూతపెట్టాలి.
4) ఇప్పుడు మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. తరువాత చింతపండు రసం, గుడ్లు వేసి మరో ఐదు నిముషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపాలి. 

Powered by Blogger.