వంటపేరు : స్వీట్ గోరుమిటీలు
కావలసిన పదార్ధాలు :
మైదా : అరకేజీ
బొంబాయి రవ్వ : పావుకేజీపంచదార : కేజీ
నెయ్యి : కప్పు
నూనె : అరకేజీ
యాలుకలపొడి : టేబుల్ స్పూన్
తయారుచేయు విధానం :
1) మైదాని జల్లించి నెయ్యి, రవ్వ వేసి కలపాలి.
2) నెయ్యి, పిండి బాగా కలిసాక నీళ్ళుకలిపి ముద్దలా కలపాలి. దీనిని అర గంట పక్కనపెట్టాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి.
4) ఇప్పుడు పిండిని చిన్నఉండలుగా తీసుకోని చేతితో కాస్త పొడవుగా చేసి
బొటనవేలుతో నొక్కి గోరిమిటిలా చేసి కాగే నూనెలో వేసి వేగనివ్వాలి.
బొటనవేలుతో నొక్కి గోరిమిటిలా చేసి కాగే నూనెలో వేసి వేగనివ్వాలి.
5) అలామొత్తం పిండి అంతా గోరిమిటిలు చేసి పక్కన పెట్టాలి.
6) ఇప్పుడు పంచదారలో కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ మీదపెట్టి పాకం పట్టాలి. తీగ పాకం వచ్చాక దానిలో యాలుకల పొడి, నెయ్యి, వేపిన గోరిమిటిలు వేసి బాగాకలిపి ప్లేటులోకి తీసి చల్లారాక డబ్బాలో పెట్టుకోవాలి.
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te