Showing posts with label vegetarian. Show all posts

1

కావలసిన పదార్ధాలు :


చింత చిగురు : వంద గ్రాములు 

కందిపప్పు : కప్పు 

పచ్చిమిర్చి : ఏడు  
కారం : స్పూన్ 
పసుపు : కొద్దిగా 
ఉప్పు : సరిపడ 
నూనె : సరిపడ 
పోపు గింజలు : రెండు  స్పూన్స్ 


తయారుచేసే విధానం :


1)  పప్పును కడిగి కుక్కర్లో వేసి సరిపడ నీళ్ళు పోసి కొంచం పలుకుగ ఉడికించాలి.
 2) ఇప్పుడు చింత చిగురు, సన్నగా కట్ చేసిన పచ్చిమిర్చి పప్పులో వేసి ఉడికించాలి. 
3) పప్పు, ఆకు బాగా ఉడికిన తరువాత దించి, పప్పులోని నీటిని వంపేసి పక్కన పెట్టుకోవాలి.
 4) ఇప్పుడు పప్పులో  సరిపడా ఉప్పువేసి పప్పుగుత్తితో మెత్తగా మెదుపుకోవాలి. 
5) తరువాత పక్కన పెట్టుకున్న పప్పు నీటికీ కారం, పసుపు వేసి పప్పు లో కలపాలి.
6) ఇప్పుడు కడాయిలో నూనె పోసి ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఎండుమిర్చి వేసి పోపు పెట్టాలి.
7) ఇప్పుడు  పోపు బాగా వేగిన తరువాత మెదిపి ఉంచుకున్న పప్పును ఇందులో కలపాలి. అంతే వేడి వేడి చింత చిగురు పప్పు రేడి.

కావలసిన పదార్దాలు :

ఎండు బటాణీలు : పావుకిలో
పసుపు : అరటీస్పూన్
జీలకర్ర : అరటీస్పూన్
మిరియాలు : అర టీస్పూన్
పచ్చిమిర్చి : నాలుగు
అల్లం ముద్ద : టీస్పూన్ 
పుదీనా : కట్ట
కొత్తిమీర : కట్ట
చాట్ మసాల : అర టీస్పూన్
నెయ్యి : పావు కప్పు
ఉప్పు : తగినంత

తయారుచేయు విధానం : 

1) బటానీలను ముందురోజు రాత్రే నానబెట్టుకోవాలి. 
2) ఒక గిన్నెలో నీళ్ళు, కొద్దిగా ఉప్పు వేసి బటానీలను ఉడికించాలి. 
3) ఉడికిన తరువాత కొద్దిగా నీళ్ళు వంపేయాలి. 
4) వీటిలో జీలకర్ర, చాట్ మసాల, మిరియాల పొడి, పచ్చిమిర్చి ముద్ద, అల్లం,  పుదీనా, కొత్తిమీర తురుము,  ఉడుకుతున్న బటాణీలలో వేసి బాగా దగ్గరగా వచ్చేఅంతవరకు ఉడికించాలి. 
5) చివరగా నెయ్యి, కొంచెం ఉప్పు వేసి దించేయాలి.
చపాతి, పూరీల్లోకి ఈ కూర బాగు౦టుంది.

కావలసిన పదార్దాలు :

వంకాయలు :నాలుగు  పెద్ద ముక్కలుగా కట్ చెయ్యాలి.
చింతపండు :  నిమ్మకాయంత
మెంతులు : టీ స్పూన్
ఆవాలు : టేబుల్ స్పూన్
ఎండు మిరపకాయలు : ఆరు
మినపప్పు : టీ స్పూన్
పసుపు : పావు టీ స్పూన్
ఉప్పు: తగినంత
నూనె : పావు కప్పు 


తయారుచేయు విధానం :

1) నీళ్ళల్లో వంకాయలు, చిటికెడు పసుపు, ఉప్పు వేసి ఉడక పెట్టుకోవాలి.
2) ఒక పాన్ లో కొంచెం నూనె పోసి కాగాక ఆవాలు, మినపప్పు, మెంతులు 3) వేయించి. ఆఖరున ఎండు మిరపకాయలను వేసి దించేయాలి.
4) వీటికీ  కొంచెం ఉప్పు వేసి అన్ని పొడి చేసి పక్కన పెట్టుకోవాలి.
5) ఇప్పుడు వేరే  పాన్ లో నూనె పోసి కాగాక ఉడికించిన వంకాయ ముక్కలను వేసి దోరగా వేయించాలి.
6) అవి వేగాక  చేసుకున్న పొడి వేసి కాసేపు వేయించి దించేయాలి.
అంతే వంకాయ మెంతి కారం రెడీ.


కావాల్సిన పదార్దాలు :

బ్రెడ్ స్లైసెస్ : ఆరు
క్యాబేజి, క్యారెట్ తురుము : కప్పున్నర
ఉల్లికాడలు తరుగు : రెండు చెంచాలు
బంగాళదుంపలు : నాలుగు
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : మూడు
సోయా సాస్ : స్పూన్
టమాట సాస్ : స్పూన్
వెల్లుల్లి రేకలు : ఏడు
నూనె :సరిపడా  

ఉప్పు : తగినంత

తయారుచేయు విధానం :


1) బంగాళదుంపలు  ఉడకబెట్టి, పొట్టు తీసి ముక్కలుగా కోసుకోవాలి. 
2) తరువాత బాణలి పెట్టి కొంచెం నూనె పోసి ఉల్లిపాయ ముక్కలు, బంగాళ దుంప ముక్కలు, క్యాబేజి తురుము, క్యారెట్ తురుము, పచ్చిమిర్చి తురుము, ఉప్పు వేసి బాగా వేయించుకోవాలి. 
3) ఇది బాగా దగ్గరగా కూరలా అయ్యాక దింపేసి ఉండలుగా చుట్టుకోవాలి. 
4) ఇప్పుడు బ్రెడ్ స్లైసుల అంచులు తీసి నీళ్ళల్లో ముంచి వెంటనే తీసివేసి రెండు అరిచేతుల మద్య గట్టిగా పిండాలి. తరువాత ఒక్కో స్లైస్ పైన కూర ఉండను ఉంచి చుట్టూ మూసివేయాలి. 
5) బాణలిలో నూనె వేసి వేడిచేసి బ్రెడ్ ఉండలని వేయించాలి. 
6) తరువాత మందపాటి గిన్నెలో నాలుగు చెంచాల నూనె వేసి ఉల్లికాడలు, వెల్లుల్లి రేకలు, సోయా సాస్, టమోట సాస్, వేయించి పెట్టుకున్న బ్రెడ్ ఉండలు వేసి ఒక ఐదు నిమిషాలు ఉంచి దించేయాలి.

1

కావలసిన పదార్దాలు : 

కేబేజీ తురుము : కప్పు 
శనగపిండి : కప్పు 
అల్లం : ముక్క 
జిలకర్ర : స్పూన్ 
నూనె : తగినంత 
కారం : రెండు  స్పూన్ 
గరం మసాలా :  స్పూన్ 
జీడిపప్పుపేస్టు :  కప్పు 
ఉల్లిపాయలు పేస్ట్ : కప్పు 
టమాటాలు పేస్ట్ : కప్పు 
ఉప్పు : సరిపడ
కొత్తిమీర : సరిపడ 


 తయారుచేసే విధానం :


1) ఒక గిన్నెలోకి క్యాబేజీ తురుము, ఉప్పు, రెండు స్పూన్ల కారం, అరస్పూన్ గరం మసాలా, ఒక కప్పు శనగపిండి వేసి కొద్దిగా వాటర్ కలిపి అన్నింటిని బాగా కలిపి మొత్తం మిశ్రమాన్ని బాల్స్ గా  చేసుకోవాలి. 
2) ఇప్పుడు స్టౌ పై పాన్ పెట్టి అందులో డీప్ ఫ్రైకు సరిపడ నూనె పోసి కాగాక తయారు చేసి పెట్టుకొన్న క్యాబేజి బాల్స్ ను అందులో వేసి ఎర్రగా వేయించి పక్కన తీసి పెట్టుకోవాలి. 
3) మరొక పాన్ లో కొద్దిగా నూనె వేసి  ఉల్లిపాయ పేస్ట్  అందులో వేయాలి 
4) కొద్దిగా వేగాక, టమోటో పేస్ట్, అల్లం పేస్ట్, జిలకర్ర, కొద్దిగా కారం, ఉప్పు, గరం మసాలా, కొతిమీర వేసి బాగా వేగాక కొద్దిగా నీళ్ళు వేసి మూతపెట్టాలి. 
5) ఈ మిశ్రమం ఐదు  నిమిషాలు ఉడికిన తర్వాత జీడిపప్పు పేస్ట్ వేసి మిశ్రమం అంతా బాగా కలిసేలా కలపాలి .
6) తర్వాత ముందుగా తయారు చేసుకొన్న క్యాబేజి బాల్స్ ని అందులో వేసి దింపుకోవాలి.
అంతే కొత్తిమీర గార్నిష్ చేసుకుని సర్వ్ చెయ్యటమే.

1

కావలసిన పదార్దాలు :

క్యాప్సికమ్ లు :  ఐదు
ఉల్లి పాయలు : మూడు 
అల్లం వేల్లుల్లిపేస్తూ : టీ స్పూన్ 
నువ్వుల పొడి : టీ స్పూన్ 
గరం మసాలా : అర టీ స్పూన్ 
కారం : రెండు టీ స్పూన్లు 
ఉప్పు : తగినత 
దనియాల పొడి : టీ స్పూన్ 
పసుపు : పావు టీ స్పూన్ 
నూనె : అర కప్పు 
పచ్చిమిర్చి : నాలుగు 
కొబ్బరి పాలు : అర కప్పు 
 కరివేపాకు : రెండు రెబ్బలు 
కొత్తిమీర : కొద్దిగా  

తయారుచేయు విధానం :

1) క్యాప్సికం లు కాస్త పెద్ద ముక్కలుగా కట్ చేసుకోవాలి.ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చెయ్యాలి.
2) మిక్సి జార్లో ఉల్లిముక్కలు, అల్లం వెల్లుల్లి ముద్దా, ధనియాలపొడి  వేసి మెత్తగా మిక్సి తిప్పాలి.
3) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
4) నూనె కాగాక కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక ఉల్లి ముద్ద వేసి వేయించాలి.
5) ఉల్లి ముద్ద వేగాక  ఉప్పు, కారం, పసుపు, వేసి కలిపి  క్యాప్సికం ముక్కలు వేసి వేయించాలి. 
6) నీళ్ళు పోయకుండా చిన్న మంటమీద  మూత పెట్టి మగ్గనివ్వాలి.
7) ముక్కలు మెత్త బడ్డాక నువ్వులపొడి,గరంమసాలా వేసి కలిపి కొబ్బరి పాలు వేసి ఐదు నిముషాలు ఉడికించాలి.
ఇప్పుడు స్టవ్ ఆపి  కొత్తిమీర చల్లి సర్వ్ వ్హేయ్యాలి.  



కావలసిన పదార్దాలు :

కంద : పావుకిలో 
బచ్చలి కూర తరుగు : మూడు కప్పులు 
ఉప్పు: తగినంత  
పసుపు :  అర టీ స్పూన్ 
కారం : టీ స్పూన్ 
చింతపండు రసం : రెండు టేబుల్ స్పూన్లు 
పోపుదినుసులు : టీ స్పూన్ 
కరివేపాకు : రెండు రెమ్మలు 
కొబ్బరి తురుము : తెండు టీ స్పూన్లు  
నూనె : కప్పు 
బెల్లం : చిన్న ముక్క 
జీలకర్ర : టీ స్పూన్ 
ఆవాలు : అర టీ స్పూన్ 
ఎండు మిర్చి : మూడు 
మినపప్పు : అర టీ స్పూన్ 
శెనగ పప్పు : అర టీ స్పూన్ 
నిమ్మరసం : రెండు టేబుల్ స్పూన్లు 

తయారు చేయు విధానం: 

1) ముందుగా కంద ముక్కలు ఒక గిన్నెలో వేసి పసుపు,కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్ళు పోసి ఉడికించి  చిల్లుల గిన్నెలో వేసి ఫైన చల్లని నీళ్ళు పొయ్యాలి. ఇలా చేస్తే కంద ముక్కలు పొడిపొడిగా వుంటాయి.
2) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.దీనిలో బచ్చలి కూర తరుగు,ఉప్పు వేసి ఒకనిముషం మగ్గించి 
తరువాత పచ్చిమిర్చి,చింత పండు రసం, కారం,బెల్లం ముక్క వేసి రెండు నిముషాలు  మగ్గనివ్వాలి.
3) ఇప్పుడు కంద ముక్కలు వేసి ఒక నిముషం కలిపి పక్కనపెట్టాలి.
4) ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడి చేసి  జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శెనగ పప్పు, ఎండు మిర్చి కరివేపాకువేసి వేయించా లి.
5) వేగాక కంద మిశ్రమం వేసి అల్లం, కొబ్బరి పొడి కలిపి స్టవ్ ఆపాలి.దించక నిమ్మరసం కలపాలి. 
అంతే ఎంతో రుచిగా ఉండే కంద బచ్చలి  కర్రీ రెడీ.  


కావలసిన పదార్దాలు :

కందిపప్పు : కప్పు 
బచ్చలి కూర కట్ట : ఒకటి 
టమాటాలు : రెండు 
పచ్చిమిర్చి : నాలుగు 
ఉల్లి పాయ : ఒకటి 
పసుపు : పావు టీస్పూన్ 
కారం : అర టీ స్పూన్ 
ఉప్పు : సరిపడా 
వెల్లుల్లి రేకలు : పది 
జీలకర్ర : పావు టీ స్పూన్ 
పోపుదినుసులు : టీ స్పూన్ 
ఎండు మిర్చి : రెండు 
కరివేపాకు : రెండు రెమ్మలు  
కొత్తిమీర : కొద్దిగా 
నెయ్యి : టేబుల్ స్పూన్ 
చింత పండు : నిమ్మకాయంత 

తయారుచేయు విధానం 

1) బచ్చలి కూర కడిగి చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.టమాటా,పచ్చిమిర్చి,ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2) కంది పప్పు బాగా కడిగి కుక్కర్లో వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి అరగంట నానబెట్టాలి.
3) స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి.మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపాలి.
4) కుక్కర్ ఆవిరి పోయాక మూత తీసి పచ్చిమిర్చి ముక్కలు,టమాటా ముక్కలు ఉల్లి ముక్కలు ,బచ్చలి కూర,పసుపు,కారం వేసి వుడకనివ్వాలి. పది నిముషాలు వుడికిన తరువాత ఉప్పు,చింతపండు రసం వేసి 
ఐదు నిముషాలు వుడకనివ్వాలి. కుక్కర్ దించుకోవాలి.
5)ఇప్పుడు  స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేడి చేయ్యాలి.
6)  పోపుదినుసులు,ఎండిమిర్చి,కరివేపాకు,జీలకర్ర,వెల్లుల్లి వేసి వేగిన తరువాత ఈ తాలింపు పప్పులో వేసి కలపాలి. కొత్తిమీర కూడా వేసి మూత పెట్టి స్టవ్ ఆపాలి.  

మిల్ మేకర్ గోంగూర 
కావలసిన పదార్దాలు : 

మిల్ మేకర్ : పదిహేను 
గోంగూర : రెండు కట్టలు 
కొబ్బరి పొడి :రెండు టీ స్పూన్ లు 
జీలకర్ర పొడి :టీ స్పూన్ 
గరం మసాలా : అర టీ స్పూన్ 
కారం : రెండు టీ స్పూన్లు 
ఉప్పు : తగినంత 
గసాలు : టీ స్పూన్ 
దనియాల పొడి : టీ స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 
పసుపు : అర టీ స్పూన్ 
ఉల్లి పాయలు : రెండు 
టమాటాలు : మూడు 
పచ్చిమిర్చి : నాలుగు 
కొత్తిమీర : టేబుల్ స్పూన్ 
జీలకర్ర : అర టీ స్పూన్ 
నూనె :పావు కప్పు 
జీడిపప్పులు : పది 

తయారుచేయు విధానం :

1) మిల్ మేకర్ ని వేడి నీళ్ళల్లో వేసి ఒక నిముషం ఉంచి నీళ్ళు పిండి  పక్కన పెట్టాలి.
2) గోంగూర,పచ్చిమిర్చి,జీలకర్ర నూనె లో ఉడికించి పేస్టు చేసుకొనిపక్కన పెట్టాలి.
3) జీడిపప్పు,గసాలు,కొబ్బరి కలిపి పేస్టు చేసు కోవాలి.
4) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి కాగాక జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక ఉల్లి ముక్కలు వేసి వేగాక  అల్లం వెల్లుల్లి పేస్టు  పసుపు వేసి వేయించాలి.
5) ఇప్పుడు టమాటాలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. టమాటాలు మెత్తబడ్డాక  కొబ్బరి పేస్టు వేసి కాసేపు వేయించి తరువాత  గోంగూర పేస్టు,వేసి కలిపి ఐదు నిముషాలు ఉడికించాలి.
6) ఇప్పుడు జీలకర్ర పొడి, ధనియాలపొడి, కారం,  వేసి రెండు నిముషాలు ఉడికించి మిల్  మేకర్ ని కలపాలి. 
కొత్తిమీర  చల్లి మూత పెట్టి స్టవ్ ఆపాలి.

1

కావలసిన పదార్దాలు :

పనీర్ : రెండు కప్పులు
బఠాని : కప్పు
ఉప్పు : తగినంత
కారం : రెండు టీ స్పూన్లు
టమాటాలు : నాలుగు
గరం మసాలా : టీ స్పూన్
దనియాల పొడి : టీ స్పూన్
జీలకర్ర పొడి : టీ స్పూన్
అల్లం పేస్టు : టీ స్పూన్
పచ్చిమిర్చి : నాలుగు
పసుపు : చిటికెడు
నెయ్యి : రెండు టీ స్పూన్లు
క్రీం : రెండు టేబుల్ స్పూన్లు
చింతపండు గుజ్జు : రెండు టేబుల్ స్పూన్లు
 నూనె : రెండు టేబుల్ స్పూన్లు 

తయారుచేయు విధానం:

1) స్టవ్ వెలిగించి ఒక గిన్నెలో బఠానీలు కొద్దిగా నీళ్ళు వేసి ఉడికించాలి.
2) పనీర్ ముక్కలు ఒక గిన్నెలో వేసి పసుపు, ఉప్పు వేసి రెండు నిముషాల ఉడికించాలి.
3) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేసి అల్లం పేస్టు,చింతపండు గుజ్జు, టమాటాలు,పచ్చిమిర్చి వేసి ఉడికించాలి.
4) ఇప్పుడు వేరే కళాయి పెట్టి నెయ్యి వేసి జీలకర్ర, పసుపు, దనియాల పొడి, జీలకర్ర పొడి వేసి కలిపి ముందు ఉడికించుకున్నచింతపండు గుజ్జు వేసి కలపాలి.
5) ఇప్పుడు ఉప్పు, కారం, క్రీం వేసి చిన్నమంట మీద ఉడికించాలి.
6) తరువాత పనీర్ ముక్కలు, బఠానీలు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు వేసి ఐదు నిముషాలు ఉడికించాలి. దించే ముందు కొత్తిమీర వేసి మూత పెట్టి స్టవ్ ఆపాలి.


కావలసిన పదార్దాలు :

పుట్టగొడుగులు : రెండువందల  గ్రాములు 

ఉల్లిపాయ ముక్కలు : కప్పు 
అల్లం వెల్లుల్లి : టీ స్పూన్ 
కారం : ఒకటిన్నర టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
కొత్తిమీర : కట్ట 
టమాటాలుముక్కలు : ఒక కప్పు 
పసుపు : పావు టీ స్పూన్ 
గరంమషాలా:టీస్పూన్ 
వెన్న: అరకప్పు 

తయారుచేయు విధానం :


1) పుట్టగొడుగులు శుబ్రంగా కడిగిఒక నిముషం  ఉడికించి పక్కన పెట్టాలి. 

2) స్టీవ్ మీద గిన్నె పెట్టి వెన్నవేసి కరిగించాలి.ఇప్పుడు  ఉల్లి ముక్కలు వేసి వేయించాలి.
3) వేగాక అల్లం వెల్లుల్లి వేసి ఒక నిముషం వేయించి పచ్చిమిర్చి,టమాటా ముక్కలు వేసి రెండు నిముషాలు మగ్గనివ్వాలి.
4)  ఇప్పుడు  పుట్టగొడుగుల ముక్కలు, కారం, పసుపు వేసి కాసేపు వేయించాలి..
5) ఉప్పు గరం మషాలా వేసి కలిపి తగినన్ని నీళ్ళు పోసి మూత పెట్టి చిన్నమంట మీద  ఐదు నిముషాలు ఉడకనిచ్చి కొత్తిమీర వేసి స్టవ్ ఆపాలి.  
అంతే ఎంతో రుచిగా ఉండే పుట్టగొడుగులు మషాలాకర్రీ రెడీ.


కావలసిన పదార్దాలు:

పుట్టగొడుగులు : రెండువందల  గ్రాములు 

ఉల్లిపాయ ముక్కలు : కప్పు 
అల్లం వెల్లుల్లి : టీ స్పూన్
కారం : ఒకటిన్నర టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
కొత్తిమీర : కట్ట 
గోంగూర : కట్టలు పది 
పసుపు : పావు టీ స్పూన్ 
నూనె: అరకప్పు 


తయారుచేయు విధానం :

1) పుట్టగొడుగులు శుబ్రంగా కడిగి ఉడికించి పక్కన పెట్టాలి.

2) గొంగురను కడిగి పచ్చిమిర్చి వేసి ఉడికించి 
మెత్తగా మెదిపి పక్కన పెట్టాలి.
3) స్టీవ్ మీద గిన్నె పెట్టి నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు వేసి వేయించాలి.
4) వేగాక అల్లం వెల్లుల్లి, కారం, పసుపు వేసి కాసేపు వేయించాలి.
5) తరువాత ఉడికించిన పుట్టగొడుగుల ముక్కలువేసి ఒక నిముషం వేయించాలి.
6) ఇప్పుడు కొత్తిమీర, గోంగూర, ఉప్పు వేసి ఐదు నిముషాలు వేయించాలి.  
అంతే ఎంతో రుచిగా ఉండే పుట్టగొడుగులు గోంగూర కూర రెడీ.


కావలసిన పధర్దాలు:


పుట్టగొడుగులు : పావుకిలో
ఉల్లిపాయ : ఒకటి
ఉప్పు : తగినంత
అల్లం వెల్లుల్లి : ఒక స్పూన్
మిరియాల పొడి : అర స్పూన్
పచ్చిమిర్చి : మూడు
కొత్తిమీర పొడి : ఒక స్పూన్
కరివేపాకు పొడి : ఒక స్పూన్
నిమ్మరసం : ఒక స్పూన్
నూనె : ఐదు టేబుల్ స్పూన్లు
పసుపు : అ ర టీ స్పూన్ 

తయారు చేయు విధానం : 

కొద్దిగా నీళ్ళల్లో ఉప్పు వేసి వేడి చేసి దానిలో మస్ర్హూమ్స్ వేసి అర గంట నానబెట్టాలి.
స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేసి ఉల్లి ముక్కలు,పచ్చిమిర్చి ముక్కలు,అల్లం వెల్లుల్లి వేసి వేయించాలి.
వేగాక మస్ర్హూమ్స్,మిరియాల పొడి, కరివేపాకు పొడి, కొత్తిమీర పొడి,పసుపు వేసి కాసేపు వేయించాలి.
ఇప్పుడు ఉప్పు వేసి కాసేపు కలిపి పది నిముషాలు వేయించాలి.
ఇప్పుడు నిమ్మరసం వేసి బాగా కలిపి రెండు నిముషాలు ఆగి స్టవ్ ఆపాలి.

కావలసిన పదార్దములు :


బెండకాయలు - పావుకిలో
టమాటాలు - రెండు
కారం - అర టీ స్పూన్
ఉప్పు - సరిపడా
పసుపు - పావు టీ స్పూన్
పచ్చి మిర్చి - ఆరు
కరివేపాకు - రెండు రెమ్మలు
వెల్లుల్లి -ఐదు రెబ్బలు
ఎండిమిర్చి - రెండు
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
జీలకర్ర - అర టీ స్పూన్

తయారుచేయు విధానం :


1) బెండకాయలు కడిగి నిలువుగా అడ్డుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
2) టమాటాలు కూడా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి.
3) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చేయాలి.నూనె కాగాక పోపు దినుసులు,వేసి వేగాక ఎండి మిర్చి,కరివేపాకు,వెల్లుల్లి,జీలకర్ర వేసి వేగిన తరువాత పచ్చిమిర్చిముక్కలు వేసి కలిపి పసుపు బెండకాయముక్కలు వేసి చిన్న మంటమీద కలుపుతూ ఉండాలి.
4) ఐదునిముషాలు ఆగి టమాటముక్కలు వేయాలి.తరువాత ఉప్పు కారం వేసి కలిపి ఒకనిముషం ఆగి స్టవ్ ఆపాలి. తడిపొడిగా ఉండే బెండకాయలు టమాట వేపుడు రెడీ.

కావలసిన పదార్దాలు: 


కంద : పావుకిలో 
తోటకూర తరుగు : మూడు కప్పులు 
ఉప్పు: తగినంత  
పసుపు :  అర టీ స్పూన్ 
కారం : టీ స్పూన్ 
చింతపండు రసం : 2 టేబుల్ స్పూన్లు 
పోపు దినుసులు : టీ స్పూన్ 
కరివేపాకు : రెండు రెమ్మలు 
కొబ్బరితురుము : తెండు టీ స్పూన్లు  
నూనె : కప్పు 
బెల్లం : చిన్నముక్క 
జీలకర్ర : టీ స్పూన్ 
ఆవాలు : అర టీ స్పూన్ 
ఎండుమిర్చి : మూడు 
మినపప్పు : అర టీ స్పూన్ 
శెనగపప్పు : అర టీ స్పూన్ 
నిమ్మరసం : రెండు టేబుల్ స్పూన్లు 


తయారు చేయు విధానం :


1) ముందుగా కంద ముక్కలు ఒక గిన్నెలో వేసి పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్ళు పోసి ఉడికించి చిల్లులగిన్నెలో వేసి ఫైన చల్లని నీళ్ళు పొయ్యాలి. ఇలా చేస్తే కంద ముక్కలు పొడిపొడిగా వుంటాయి.
2) స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచెయ్యాలి. దీనిలో తోటకూరతరుగు, ఉప్పు వేసి ఒకనిముషం మగ్గించి, తరువాత పచ్చిమిర్చి, చింత పండు రసం, కారం, బెల్లం, ఉప్పు వేసి రెండునిముషాలు మగ్గనివ్వాలి.
3) ఇప్పుడు కందముక్కలు వేసి ఒకనిముషం కలిపి పక్కనపెట్టాలి.
4) ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడిచేసి  జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శెనగ పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
5) వేగాక కందమిశ్రమం వేసి అల్లం, కొబ్బరి పొడి కలిపి స్టవ్ ఆపాలి. దించాక నిమ్మరసం కలపాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కంద తోటకూర కర్రీ రెడీ.

కావలసిన పదార్దాలు : 


మిల్ మేకర్ : పదిహేను  
కొబ్బరి పొడి : రెండు టీ స్పూన్ లు 
జీలకర్ర పొడి : టీ స్పూన్ 
గరం మసాలా : అర టీ స్పూన్ 
కారం : రెండు టీ స్పూన్లు 
ఉప్పు : తగినంత 
గసాలు : టీ స్పూన్ 
దనియాల పొడి : టీ స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 
పసుపు : అర టీ స్పూన్ 
ఉల్లి పాయలు : రెండు 
టమాటాలు : మూడు 
పచ్చిమిర్చి : నాలుగు 
కొత్తిమీర : టేబుల్ స్పూన్ 
జీలకర్ర : అర టీ స్పూన్ 
నూనె :పావు కప్పు 
జీడిపప్పులు : పది 


తయారుచేయు విధానం :


1) మిల్ మేకర్ ని వేడినీళ్ళల్లో వేసి ఒక నిముషం తరువాత నీళ్ళు పిండి కీమా కట్ చేసి పక్కన పెట్టాలి.
2) జీడిపప్పు, గసాలు, కొబ్బరి కలిపి పేస్టు చేసుకోవాలి.
3) స్టవ్ మీద కళాయిపెట్టి నూనెవేసి కాగాక జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేసి వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేయించాలి.
4) ఇప్పుడు టమాటాలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. టమాటాలు మెత్తబడ్డాక  కొబ్బరి పేస్టు వేసి కాసేపు వేయించి తరువాత జీలకర్ర పొడి, ధనియాలపొడి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళుపోసి రెండునిముషాలు ఉడికించాలి.
5) ఇప్పుడు మిల్ మేకర్ కీమా, నెయ్యి వేసి రెండునిముషాలు ఉడికించి గరంమసాలా, కొత్తిమీర చల్లి మూతపెట్టి స్టవ్ ఆపాలి.

కావలసిన పదార్దాలు :

క్యాప్సికమ్ లు : మూడు 
ఉల్లిపాయలు : మూడు 
అల్లం వేల్లుల్లి పేస్తూ : టీ స్పూన్ 
మిరియాల  పొడి : పావు టీ స్పూన్  
కారం : రెండు టీ స్పూన్లు 
ఉప్పు : తగినత 
దనియాల పొడి : టీ స్పూన్ 
పసుపు : పావు టీ స్పూన్ 
నూనె : అర కప్పు 
పచ్చిమిర్చి : నాలుగు 
మెంతికూర తురుము  :  కప్పు 
కరివేపాకు : రెండు రెబ్బలు 
కొత్తిమీర : కొద్దిగా  
టమాటాలు : రెండు 

తయారుచేయు విధానం :

1) పనీర్ చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకొని కొత్తిమీర, మిరియాలపొడి చల్లి పక్కనపెట్టాలి. 
2) క్యాప్సికంలు కాస్త చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చెయ్యాలి.
3) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి. కాగాక పనీర్ ముక్కలు వేయించి పక్కన పెట్టుకోవాలి. అదే నూనెలో క్యాప్సికం ముక్కలు కూడా వేసి వేయించి ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
 4) ఇంకొంచెం నూనె వేసి కాగాక కరివేపాకు, పచ్చిమిర్చి ముక్కలు, ఉల్లిముక్కలు వేసి వేగాక అల్లంవెల్లుల్లి  ముద్ద వేసి వేయించాలి.
 5) వేగాక మెంతుకూర, టమాటాముక్కలు, ఉప్పు, కారం, పసుపు వేసి రెండునిముషాలు వేయించాలి.
6) ఇప్పుడు క్యాప్సికం ముక్కలు, పనీర్ ముక్కలు  వేసి కొద్దిగా నీళ్ళు వేసి పదినిముషాలు ఉడికించి  కొత్తిమీర చల్లి స్టవ్ ఆపాలి.

కావలసిన పదార్దాలు:

అరటికాయ : ఒకటి 
స్వీట్ కార్న్ పేస్టు : అర కప్పు 
కారం : టీ స్పూన్ 
ఉప్పు : తగినంత
జీడిపప్పు, కిస్మిస్లు : టేబుల్ స్పూన్ 
పనీర్ తురుము : పావుకప్పు 
కొత్తిమీర తురుము : కొద్దిగా 
నూనె : వేయించటానికి సరిపడా  
ఉల్లి ముద్ద : పావు కప్పు 
టమాట ప్యూరి : టేబుల్ స్పూన్ 
గరం మసాల : కొద్దిగా 

తయారుచేయు విధానం :

1) అరటికాయను వుడికించి వలిచి మెత్తగా ముద్దగా చెయ్యాలి.
2) ఒకగిన్నెలో అరటిముద్ద, పనీర్ తురుము, స్వీట్ కార్న్ పేస్టు, కారం, ఉప్పు, కొత్తిమీర, గరం మసాల, జీడిపప్పులు వేసి ముద్దగా కలిపి చిన్నచిన్న ఉండలుగా చేసి పక్కనపెట్టాలి.
3) స్టవ్ వెలిగించి నూనె వేడిచేసి చేసిన అరటిఉండలు వేసి వేయించాలి. బాగా వేగాక ఒకప్లేటులోకి తీసుకోవాలి. ఇవే అరటి కోప్తాలు.
4) స్టవ్ మీద కళాయిపెట్టి రెండుస్పూన్లు నూనెవేసి ఉల్లిముద్ద వేసి కాసేపు వేయించాలి.
5) తరువాత టమాట ప్యూరి, ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళు వేసి ఒకనిముషం ఉడకనిచ్చి కారం, మసాల, అల్లంవెల్లుల్లి పేస్టు వేసి కలిపి వేయించిన కోప్తాలు వేసి రెండునిముషాలు వుడకనివ్వాలి.
6) ఇప్పుడు స్టవ్ ఆపి కొత్తిమీరతో అలంకరించి సర్వ్ చెయ్యాలి.

కావలసిన పదార్దాలు :

పెసర పప్పు : కప్పు 
చుక్క కూర కట్ట : ఒకటి 
టమాటాలు : రెండు 
పచ్చిమిర్చి : నాలుగు 
ఉల్లి పాయ : ఒకటి 
పసుపు : పావు టీస్పూన్ 
కారం : అర టీ స్పూన్ 
ఉప్పు : సరిపడా 
వెల్లుల్లి రేకలు : పది 
జీలకర్ర : పావు టీ స్పూన్ 
పోపుదినుసులు : టీ స్పూన్ 
ఎండు మిర్చి : రెండు 
కరివేపాకు : రెండు రెమ్మలు  
కొత్తిమీర : కొద్దిగా 
నెయ్యి : టేబుల్ స్పూన్ 
చింతపండు : నిమ్మకాయంత 

తయారుచేయు విధానం :

1) చుక్కకూర కడిగి చిన్నముక్కలుగా కట్ చేసుకోవాలి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2) పెసరపప్పు బాగాకడిగి కుక్కర్లో వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి పదినిముషాలు నానబెట్టాలి.
3) స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి. రెండు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపాలి.
4) కుక్కర్ ఆవిరిపోయాక మూతతీసి పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లి ముక్కలు, చుక్కకూర, పసుపు, కారం వేసి వుడకనివ్వాలి. పదినిముషాలు వుడికిన తరువాత ఉప్పు, చింతపండురసం వేసి ఐదునిముషాలు వుడకనివ్వాలి. కుక్కర్ దించుకోవాలి.
5) ఇప్పుడు  స్టవ్ మీద కళాయి పెట్టి నెయ్యి వేడిచేయ్యాలి.
6) పోపుదినుసులు, ఎండిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి వేసి వేగిన తరువాత ఈ తాలింపు పప్పులో వేసి కలపాలి. కొత్తిమీర కూడా వేసి మూతపెట్టి స్టవ్ ఆపాలి.

కావలసిన పదార్దాలు :


ముల్లంగి  : పావుకిలో 
కొబ్బరి తురుము (కోరు) : కప్పు 
పచ్చిమిర్చి : నాలుగు  
ఉల్లిపాయలు : రెండు 
ఆవాలు : టీ స్పూన్
ఎండుమిర్చి : రెండు 
వెల్లుల్లి రేకలు : ఐదు 
కారం : అర టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
నూనె : రెండు టేబుల్ స్పూన్లు 
పసుపు : చిటికెడు 
కొత్తిమీర : కొద్దిగా 
కరివేపాకు : రెండు రెమ్మలు 


తయారుచేయు విధానం :


1) ముల్లంగి కడిగి పెద్ద ముక్కలుగా కట్ చెయ్యాలి. ఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళు పోసి స్టవ్ ఫై పెట్టి ఒకపొంగు వచ్చాక దించి పక్కన పెట్టాలి.
2) అలాగే ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలుగా కట్ చెయ్యాలి. 
3) స్టవ్ ఫై కళాయిపెట్టి నూనె వేడిచేసి ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి వేసి వేయించాలి. తరువాత ఉల్లి, మిర్చిముక్కలు వేసి వేగాక ముల్లంగిముక్కలు వేసి మూతపెట్టాలి.
4) అప్పుడప్పుడు కలుపుతూ వుంటే పదినిముషాలకు ముల్లంగిముక్కలు నూనెలో మగ్గి మెత్తబడే వరకు వేయించాలి.
5) ఇప్పుడు పసుపు, ఉప్పు, కారం వేసి కలిపి ఒకనిముషం ఆగి కొబ్బరితురుము వేసి మరో ఐదునిముషాలు కలపాలి.
కొబ్బరికోరు, ముల్లంగిముక్కలు బాగా కలిసాక కొత్తిమీర జల్లి స్టవ్ ఆపాలి.

Powered by Blogger.