Showing posts with label Health Tips. Show all posts

1
కలబంద తో చిట్కా.

1) కలబంద గుజ్జు రోజు ఒక స్పూన్ తింటే ఆరోగ్యం చాలా బాగుంటుంది.

2) ఆడపిల్లలకు ప్రతి నెలలో (ఆ రోజుల్లో) చాలా ఉపయోగ పడుతుంది.

3) అలాగే ముఖానికి రోజు రాస్తు అరా గంట ఆగి ముఖం కడిగితే ముఖం కాంతివంతంగా అవవుతుంది.

తలనొప్పి తగ్గాలంటే చిట్కా.

1) మందార పూలను ఎండబెట్టి  పొడిచేసి కొబ్బరి నూనెలో కలిపి తలకు 

రాసుకుంటే తలనొప్పి తగ్గడమే కాకుండా జుట్టు నల్లగా వత్తుగా 

పెరుగుతుంది.

ముక్కు దిబ్బడిగా ఉన్నప్పుడు ఇలా చెయ్యండి.

1) వామును నలిపి ఒక గుడ్డలో (క్లాత్ లో ) మూటకట్టి వాసన పీలుస్తూ ఉంటె ముక్కు దిబ్బడ తగ్గుతుంది.
2) అలాగే వాము మూటను తలగడ దగ్గర పెట్టుకొని పడుకున్న ముక్కు దిబ్బడ తగ్గుతుంది.



 చాలామంది దానిమ్మ గింజలు తిని తొక్క పారేస్తారు.

1) కాని ఆ తొక్కలు మనకు ఎలా మంచి చేస్తాయో తెలుసుకుందాం.

2) మనకు రక్తం మంచిగా ఉండాలంటే మనం తాగే పాలల్లో దానిమ్మతోక్కలు వేసి మరిగించి, వడపోసి ఆ పాలు తాగితే రక్తం శుద్ధి అవ్వుతుంది.

3) దానిమ్మ తొక్కలు గాయాలను తగ్గించటం లో బాగా పనిచేస్తుంది.

4) ఎలా అంటే?దానిమ్మ తొక్కలు ఎండబెట్టి  కాల్చి పొడి చేసి పసుపుతో కలిపి గాయాలకు కట్టు కడితే గాయం తొందరగా తగ్గి పోతుంది.

దానిమ్మ కాయ  తింటే  ఆరోగ్యానికి ఎంతో మంచిది.

సువాసన తో కూడిన  టీ కావాలంటే ఇలా చెయ్యండి.

1) టీ పొడిలో యాలకులు తోక్కలు వేసి ఉంచితే టీ కాచేటప్పుడు  టీ పొడితో పాటు యాలుకలు(ఇలాచిలు ) వేసినట్లు అవ్వుతుంది.

2) టీ మరిగించేటప్పుడు టీ పొడితో పాటే యాలకుల తొక్కలు మరుగుతాయి కాబట్టి, టి కి మంచి రుచి వస్తుంది.

3) సువాసన తో కూడిన చక్కటి టీ మీ సొంత మవ్వుతుంది.

3
అజిర్తితో బాధపడేవాళ్ళు ఈ చిట్కా ఉపయోగించండి

శొంటి పొడిలో బెల్లం కలుపుకొని రోజు బోజనానికి ముందు తీసుకుంటే అజీర్తి తగ్గిపోతుంది.
ఇలా పది రోజులు చెయ్యాలి.

పనస తొనలు తొందరగా అరగాలంటే ఈ చిట్కా  పాటించండి.

పనస తొనలు తిన్నాకా చివరి పనస తోన నూనెలో ముంచి తింటే తొందరగా అరుగుతుంది, కడుపు నొప్పిరాదు..


కొందరికి కొబ్బరి తింటే తొందరగా జీర్ణం కాదు. అలాంటి వాళ్ళు ఈ చిట్కా పాటించండి.
కొబ్బరి తిన్నాక కొద్దిగా బియ్యం గింజలు తింటే తొందరగా కొబ్బరి జీర్ణ మవ్వుతుంది.


చాలామంది అమ్మాయిలు ఆ మూడురోజులు కడుపు నొప్పితో బాద పడతారు
అలాంటి పిల్లలు ఇలా చెయ్యండి.

ఆలోవిరా గుజ్జును (కలబంద )రోజు కొద్దిగా ఉదయం, సాయంత్రం తింటుంటే ఆ రోజుల్లో వచ్చే కడుపు నొప్పి తగ్గి పోతుంది.

1) అలాగే గొంతు నొప్పిగా ఉన్నా ,లేదా ఇన్ఫెక్షన్ వచ్చి వాపు వచ్చినా ఈ చిట్కా పాటించండి.
పది,పన్నెండు వెల్లుల్లి రేకలు కొద్దిగా చిదగొట్టి రెండు కప్పుల నీటిలో వేసి మరిగించిఆ నీటిని  గోరు వెచ్చగా ఉన్నప్పుడు కొద్ది కొద్దిగా త్రాగుతుంటే గొంతు ఇన్ఫెక్షన్ తగ్గుతుంది.


హెల్త్ టిప్స్
1) జలుబు చేసి నప్పుడు ముక్కు పట్టేసినట్లువుంటె ఇలా చేసి చూడండి.
ఒక కప్పు నీటిలో చిన్న అల్లం ముక్క చిదగొట్టి వేసి మరిగించండి.
గోరు వెచ్చగా ఉండగానే చిటికెడు మిరియాలపొడి కలిపి వడ పోసుకొని తాగండి.
వెంటనే రిలీఫ్ వస్తుంది.

.

ఇప్పుడు వేసవి కాబట్టి మాములుగానే మంచినీళ్ళు ఎక్కువ త్రాగుతాము  కాని ఒక్కోసారి ఎన్ని నీళ్ళుత్రాగినా దాహం తీరదు.అలా నీళ్ళు తాగాలనిపిస్తుంటుంది.
అదే అతి దాహం.

అలాంటప్పుడు దనియాలు నానబెట్టి కాషాయం తీసి దానిలో సరిపడ పంచదార వేసి కలిపి త్రాగితే అతి దాహం తగ్గుతుంది.

అలాగే కొన్ని మిరియాలు నోట్లో వేసుకొని చప్పరిస్తున్న అతి దాహం తగ్గుతుంది.

1


1) జలుబు చేసి నప్పుడు ముక్కు పట్టేసినట్లువుంటె ఇలా చేసి చూడండి.
ఒక కప్పు నీటిలో చిన్న అల్లం ముక్క చిదగొట్టి వేసి మరిగించండి.
గోరు వెచ్చగా ఉండగానే చిటికెడు మిరియాలపొడి కలిపి వడ పోసుకొని తాగండి.
వెంటనే రిలీఫ్ వస్తుంది.




1) తులసి ఆకులు ఎండ బెట్టి నిల్వచేసుకోవాలి.వీటిని నాలుగు టేబుల్  స్పూన్లు ఆకుల్ని తీసుకోని
ఒకకప్పు వేడినీటిలో వేసి కదపకుండా పది నిముషాలు ఉంచి చల్లారిన తరువాత ఈ నీటిలో దూదిని ముంచి ఆ దూదిని మొటిమలు ఉన్నచోట అద్దాలి. 
2) ఇలాపది రోజులు, రెండు రోజులకొకసారి చేస్తే మొటిమలు తగ్గుతాయి.

3) అలాగే కొద్దిగా నీళ్ళు తీసుకోని కొద్దిగా పసుపు, కొన్ని తులసి ఆకులు  వేసి మరిగించాలి.
ఈ నీటితో ముఖానికి ఆవిరి పట్టి ఒక నిముషం ఆగి వేరే నీటితో ముఖం కడిగేస్తే కూడా మొటిమలు  తగ్గుతాయి.

చిన్నపిల్లలకు కడుపు నొప్పిగా ఉంటె ఇలాచెయ్యండి

1) వాము వేపి పొడి చేసి పాలల్లోకాని తేనెలో కాని  కలిపి పిల్లలు నాలుక మీద రాస్తే చప్పరిస్తారు 
కాసేపటికి కడుపు నొప్పితగ్గి హాయిగా ఆడుకుంటారు 
2) కాస్త పెద్ద పిల్లలకు కడుపు నొప్పిగా ఉన్న? వాము అన్నం పెట్టండి .
అది ఎలాగంటే?
3) కాస్త నూనె వేడి చేసి దానిలో కొద్దిగా పసుపు, రెండు స్పూన్లు వాము, కరివేపాకు, కొద్దిగా ఉప్పు వేసి వేగాక కప్పు అన్నం వేసి కలిపి  పల్లలకు పెట్టండి. చూడటానికి పులిహోరా లా కనిపిస్తుంది, వాము కలిసి ఉంటుంది కాబట్టి కడుపు నొప్పి తగ్గుతుంది.





వర్షాకాలం లో వచ్చే సమస్యలకు చిట్కా

నీళ్ళల్లో పని చేసే వాళ్లకు చాలా మందికి కాళ్ళు ఒరిసి పుండ్లు పడతాయి.

అలాంటి వాళ్లకు రాత్రుళ్ళు కాళ్ళు నొప్పిలుతో నిద్ర పట్టదు

అలా పడ్డప్పుడు ఈ చిట్కా పాటించండి

కొంచెం మంచి నూనె తీసుకోని దానిని  గోరు వెచ్చగా చేసి దానిలో  పసుపు 

వేసి కలిపి దానిని కాళ్ళకు మృదువుగా మర్ధనా చేస్తే కాళ్ళ పుండ్లు, నొప్పులు 

తగ్గి హాయిగా నిద్ర పడుతుంది.


వేసవిలో చెమట కాయలు వచ్చి బాగా చిరాకు వస్తుంది
అలాంటప్పుడు ఇలా చెయ్యండి
వేపాకు, గంధం పసుపు కలిపి నూరి చెమటకాయలు ఉన్నచోట రాస్తే చెమటకాయలు పోతాయి
హాయిగా ఉంటుంది.


Powered by Blogger.