పాలకూర కట్ట : ఒకటి
కొత్తిమీర కట్ట : ఒకటి
అల్లం పచ్చిమిర్చి పేస్టు : టీ స్పూన్
మినప్పప్పు : కప్పు
బియ్యం : రెండు కప్పులు
అటుకులు : కప్పు
ఉప్పు : తగినంత
నూనె : కప్పు
తయారుచేయు విధానం :
1) ముందురోజు బియ్యం, మినప్పప్పు విడివిడిగా నానబెట్టాలి. మినప్పప్పు నానిన తరువాత కడిగి పొట్టు తీసేయ్యాలి.
2) అటుకులు ఐదునిముషాలు నానబెడితే చాలు. ఇప్పుడు మినప్పప్పు, బియ్యం, అటుకులు అన్ని మెత్తగా రుబ్బి ఒకరాత్రి ఉంచాలి.
3) మర్నాడు పచ్చిమిర్చి, అల్లం, ఉప్పు, కొత్తిమీర తురుము, పాలకూర తురుము మిక్సిలో వేసి మెత్తగా చేసి ఈ పిండిలో కలుపుకోవాలి.
4) స్టవ్ ఫై పాన్ పెట్టి ఈ పిండిని దోశలా వేసి చుట్టూ నూనె వేసి రెండు ప్రక్కలా కాలాక ప్లేటులోకి తీసుకోవాలి.