ఆకుకూరలతో చపాతి (Curry Leaf Chapati in Telugu)

కావలసిన పదార్ధాలు :


గోధుమ పిండి : ఐదు కప్పులు 
వెన్న : రెండు టేబుల్ స్పూన్ 
ఉప్పు : తగినంత  
నూనె : పావు కప్పు 
పచ్చి మిర్చి పేస్టు :  టీ స్పూన్ 
పాలకూర తరుగు : పావు కప్పు 
తోటకూర తరుగు : పావు కప్పు 
బచ్చలికూర తరుగు : పావు కప్పు 
పొనగంటికూర తరుగు : పావు కప్పు 
కొత్తిమీర తరుగు : పావు కప్పు 

తయారుచేయు విధానం :


1) ఒక గిన్నెలో ఆకుకూరల తరుగు, గోధుమ పిండి, ఉప్పు, పచ్చిమిర్చి పేస్టు, వెన్న వేసి నీళ్ళు పోసి ముద్దగా కలిపి ఒకగంట పక్కన పెట్టాలి.
2) గంట తరువాత చపాతీలు చేసుకోవాలి. గ్రీన్ కలర్ గా ఉంటాయి.
3) స్టవ్ మీద పాన్ పెట్టి స్పూన్ నూనె వేసి వేడిఅయ్యాక చేసిన చపాతీలు వేసి రెండుప్రక్కలా కాలనిచ్చి ఒక ప్లేటులోకి తీసుకోవాలి.
4) వీటిమీద వెన్నరాసి మడతపెట్టి బాక్సులో పెట్టుకోవాలి. ఎన్ని గంటలు గడిచినా మెత్తగా మృదువుగా ఉంటాయి.