వంటపేరు : బీట్రూట్ ఉప్మా
ఉప్మారవ్వ : పావుకిలో
కావలసిన పదార్ధాలు :
ఉప్మారవ్వ : పావుకిలో
నూనె : అరకప్పు
బీట్రూట్ తురుము : అర కప్పు
బీట్రూట్ తురుము : అర కప్పు
ఎండిమిర్చి: రెండు
ఆవాలు : టీ స్పూన్
సెనగపప్పు : టీ స్పూన్
జీడిపప్పులు : పది
పల్లీలు : కొద్దిగా
నూనె : అరకప్పు
నెయ్యి : టేబుల్ స్పూన్
ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, అల్లం ముక్కలు అన్ని కలిపి : 1 కప్పు
కరివేపాకు : కొద్దిగా
ఉప్పు : తగినంత
నిమ్మరసం : టీ స్పూన్
కొత్తిమిర : కొద్దిగా
జీలకర్ర : అర టీ స్పూన్
మినపప్పు : టీ స్పూన్
తయారుచేయు విధానం :
తయారుచేయు విధానం :
1) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.
2) నూనె కాగాక, సెనగపప్పు, పల్లీలు, జీడిపప్పు, మినపప్పు, జీలకర్ర వేసి వేగాక ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, ఉల్లి, మిర్చి, అల్లం ముక్కలు వేసి వేగనివ్వాలి.
3) ఇప్పుడు బీట్రూట్ తురుము కుడా వేసి కలిపి, రెండు గ్లాసుల నీళ్ళు, ఉప్పు వేసి మూతపెట్టాలి. నీళ్ళు మరుగుతుండగా మూతతీసి రవ్వ పోస్తూ బాగాకలిపి గట్టి పడ్డాక స్టవ్ ఆపాలి.
4) ఇప్పుడు నెయ్యి, నిమ్మరసం వేసి కలిపి కొత్తిమిర వేసి మూత పెట్టాలి.
* అంతే బీట్రూట్ (ఎరుపు కలర్) ఉప్మా రెడి.
* అంతే బీట్రూట్ (ఎరుపు కలర్) ఉప్మా రెడి.
Post a Comment