ఊతప్పం (Uthappam Preparation in telugu Dibbarotti)

కావలసిన పదార్దాలు :


మినప్పప్పు : కప్పు
బియ్యం  : రెండు కప్పులు
క్యారేట్ తురుము : అరకప్పు
ఉల్లిముక్కలు : కప్పు
అల్లం : చిన్న ముక్క
పచ్చిమిర్చి: నాలుగు
ఉప్పు: సరిపడా
నూనె : అరకప్పు
జీలకర్ర : టీ స్పూన్
కొత్తిమీర : అరకప్పు
ఉల్లి కాడల తరుగు : కప్పు


తయారుచేయు విధానం :


1) మినపప్పు, బియ్యం విడివిడిగా నానబెట్టి మెత్తగా రుబ్బి ఉప్పు కలిపి రాత్రంతా పక్కన ఉంచాలి.
2) స్టవ్ ఫై కళాయిపెట్టి కొద్దిగా నూనె వేసి కాగాక జీలకర్ర, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, క్యారెట్ తురుము, ఉల్లికాడల తరుగు వేసి వేయించి పిండిలో కలపాలి.
3) స్టవ్ ఫై పాన్ పెట్టి ఈ పిండిని ఊతప్పంలా వేసి నూనె వేసి రెండు ప్రక్కలా దోరగా కాల్చాలి.

South Indian recipe preparation in telugu language.Andhra telugu Vantalu in telugu, traditional, special, sweets, breakfast, vegeterian and non vegeterian cooking for telugu people.