బ్రెడ్ మసాలా దోశ (Bread Masala Dosa in Telugu)

కావలసిన పదార్దాలు :


బ్రెడ్ ముక్కలు : ఆరు  
దోశ పిండి : కప్పు 
ఆలూ : ఒకటి 
ఉల్లిముక్కలు : అరకప్పు 
కేప్సికం ముక్కలు : అర కప్పు 
ఉప్పు : తెగినంత 
కారం : అర టీ స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 
ఆవాలు : పావు టీ స్పూన్ 
జీలకర్ర : పావు టీ స్పూన్ 
కొత్తిమీర తురుము : పావుకప్పు 
క్యారెట్ తురుము : రెండు టేబుల్ స్పూన్లు 
కొబ్బరి తురుము : టేబుల్ స్పూన్ 
వెన్న : రెండు టేబుల్ స్పూన్లు  
నూనె : రెండు టేబుల్ స్పూన్లు 


తయారుచేయు విధానం :


1) స్టవ్ మీద కళాయి పెట్టి వెన్నవేసి కరిగించాలి. వెన్న కరిగిన తరువాత అవాలు, జీలకర్ర, కరివేపాకు వేసి వేయించాలి.
2) ఇప్పుడు ఉల్లిముక్కలు వేసి వేగాక కేప్సికం ముక్కలు వేసి కాసేపు వేయించాలి.
3) ఇప్పుడు కొబ్బరితురుము, వుడికించి చిదిమిన ఆలూ, క్యారెట్ తురుము వేసి వేయించాలి. తరువాత ఉప్పు, కారం, పసుపు, కొత్తిమీర వేసి కాసేపు కలిపి దించి చల్లారనివ్వాలి.
4) స్టవ్ మీద పాన్ పెట్టి కొద్దిగా నూనె వేసి వేడయ్యాక  దోశల పిండిలో బ్రెడ్ ముక్కను ముంచి వేడెక్కిన పాన్ మీద వేసి చుట్టూ నూనె వేసి బ్రెడ్ దోశ 
ఫైన కొద్దిగా కొత్తిమీర, కొద్దిగా క్యారెట్ తురుము వేసి రెండో ప్రక్క తిప్పి స్పూన్ నూనె వేసి రెండు ప్రక్కలా దోశ లా కాల్చి ఒక ప్లేటులోకి  తీసుకోవాలి.
5) ఇలా బ్రెడ్ ముక్కలు అన్నిదోశల పిండిలో ముంచి ఇలాగే  కాలనివ్వాలి.
ఒక ప్రక్కనే కొత్తిమీర తురుము, క్యారెట్ తురుము వెయ్యాలి.
6) ఇప్పుడు బ్రెడ్ దోశలు ప్లేట్ లో పెట్టి ఉడికించిన ఆలూ మిశ్రమం ఒక బ్రెడ్ దోశ మీద వేసి అంతా సర్ది ఫైన మరో బ్రెడ్ దోశ పెట్టాలి.
7) ఇలా అన్ని చేసుకున్నాక బ్రెడ్ దోశలు క్రాస్ గా కట్ చేసి సర్వ్ చెయ్యాలి.
అంతే బ్రెడ్ దోశ మసాలా శాండ్ విచ్ రెడీ.