Showing posts with label liquids. Show all posts

ఉగాది పానీయం 

కావలసిన పదార్దాలు :

మామిడికాయలు : రెండు 
ఉప్పు : స్పూన్ 
కారం : పావు టీ స్పూన్ 
బెల్లం : వంద గ్రాములు 
వేపపువ్వు : టేబుల్ స్పూన్ 

తయారుచేయు విధానం: 

1) పుల్లని పచ్చి మామిడి కాయలు నీటిలో వేసి ఉడికించాలి.

2) ఉడికిన తరువాత అదే నీటిలో చల్లార్చి జ్యూస్ లా చేసి టెంకను తీసెయ్యాలి.

3) ఇప్పుడు ఈ జ్యూస్ లో బెల్లం, ఉప్పు, కారం, వేపపువ్వు వేసి 

మరి కాస్త చల్లని నీళ్ళుకలిపితే ఉగాది పానీయం రెడి.

4) ఉగాది పచ్చడితో పాటే ఈ పానీయాన్ని అతిధులకు అందించండి.

కావలసిన పదార్దాలు :


పాలు : లీటరు 
ఖర్జూరాలు : పది  
పంచదార :  కప్పు 
జీడిపప్పు : కొద్దిగా  
బాదం పప్పు : కొద్దిగ 
వాల్‌నట్స్ : కొద్దిగ 
యాలకుల పొడి : కొద్దిగ

తయారుచేయు విధానం :


1) ఖర్జూరాలలో గింజలు తీసేసి పావు కప్పు పాలలో ఖర్జూరాలు, జీడిపప్పు, బాదం పప్పు, వాల్‌నట్స్ ని రెండు గంటలసేపు నానబెట్టాలి. 
2) అవి బాగా నానిన తరువాత మిక్సీలో వేసి మెత్తగా గ్రైండ్ చేయాలి. 
3) మిగిలిన పాలను స్టవ్ మీద పెట్టి చిక్కగా అయ్యేంత వరకు మరిగించుకోవాలి. 
4) ఇప్పుడు అందులో పంచదార వేసి బాగా కలపాలి.
5) తరువాత ఇందులో గ్రైండ్ చేసిన మిశ్రమాన్ని కలిపి అడుగు అంటకుండా బాగా కలిపి యాలకుల పొడి వేసి దించేయాలి.
 6) చల్లారిన తరువాత కాసేపు ఫ్రిజ్‌లో ఉంచి సర్వ్ చేయాలి.

కావలసిన పదార్దాలు :


ఫైనాఫిల్,ముక్కలు -రెండు కప్పులు
అరటిపళ్ళు- మూడు
పంచదార -మూడు టేబుల్ స్పూన్లు 
పెరుగు : రెండు కప్పులు
కమలా పళ్ళు రసం : రెండు కప్పులు
ఐస్ ముక్కలు : రెండు కప్పులు 


తయారుచేయు విధానం :


1) మిక్సి జార్లో పెరుగు తప్ప మిలిన వన్నివేసి బాగా కలిసేలా తిప్పాలి
2)  తరువాత పెరుగు కుడా వేసి తిప్పి (కావాలంటే)
ఐస్ ముక్కలు వేసి అతిధులకు అందించటమే

దోసకాయ జ్యుస్
కావలసిన పదార్దాలు :

దోసకాయ : ఒకటి 
ఉప్పు : తగినంత 
నిమ్మరసం : టీ స్పూన్ 
పుదినా ఆకులు : కొద్దిగా 
ఐస్ క్యూబ్స్ : మూడు 

తయారుచేయు విధానం :

1) దోసకాయను చెక్కి ముక్కలుగా చెయ్యాలి.దీనిలో గింజలు తీసేయ్యాలి.
2) మిక్సి జార్లో దోసకాయ ముక్కలు, ఉప్పు, పుదినా ఆకులు  వేసి గ్రైండ్  చెయ్యాలి.
3) దోస ముక్కలు మెత్తగా అయ్యాక గ్లాసు నీళ్ళు పోసి మళ్ళి గ్రైండ్ చెయ్యాలి. దీనిని గ్లాసులోకి వడకట్టి నిమ్మరసం 
కలిపి  ఐస్ క్యూబ్స్ వేసి సర్వ్ చెయ్యాలి.

కావలసిన పదార్దాలు :


బీట్ రూట్ : రెండు చిన్నవి
క్యారెట్ : రెండు 
పంచదార : పావు టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
నిమ్మ రసం :  టీ స్పూన్ 
వెల్లుల్లి రేక : చిన్నది ఒకటి 


తయారుచేయు విధానం :


1) క్యారెట్ ముక్కలు చేసి, మిక్సిలో వేసి రసం తియ్యాలి. ఇది ఒక కప్పు.
2) బీట్రూట్ కూడా ముక్కలు చేసి మిక్సిలో రసం తియ్యాలి. ఇది ఒక కప్పు.
3) వెల్లుల్లిని క్రష్ చెయ్యాలి.
4) క్యారెట్ రసం, బీట్రూట్ రసం, ఉప్పు, పంచదార, వెల్లుల్లి అన్నీ కలిపి మిక్సి జార్లో వేసి బ్లెండ్ చెయ్యాలి.


దీనిని ఒక గ్లాసులో వేసి లోబీపీ ఉన్నప్పుడు తీసుకుంటే బీపీని మామూలు స్థితికి తీసుకువస్తుంది.


చల్లగా కావాలనుకుంటే ఐస్ క్యూబ్స్ వేసుకోవచ్చు.

అనాసపండు కొబ్బరి పాలు

కావలసిన పదార్దములు :

అనాస పండు : చిన్నది ఒకటి 
కొబ్బరి చెక్క : ఒకటి 
పంచదార  సిరప్ : 4 టేబుల్ స్పూన్లు 
ఐస్ ముక్కలు : పది 

తయారుచేయు విధానం :

1) అనాస పండు చెక్కు తీసి ముక్కలు చేసి జ్యుసర్ లో వేసి రసం తియ్యాలి.
2) కొబ్బరి ముక్కలు చేసి పాలు తీసుకోవాలి.
3) ఐస్ ను చిన్న ముక్కలుగా చేసి రెండు గ్లాసులో వేసి ఉంచాలి.
4) మరో గ్లాసులో అనాస రసం, కొబ్బరి పాలు, పంచదార సిరప్ వేసి కలిపి ఐస్ ముక్కలు వేసిన గ్లాసులోకి వేసి సర్వ్ చేయడమే.

కమలా రసం (ఆరంజ్ జ్యూస్) 

కావలసిన పదార్దములు :

కమాలారసం : అర కప్పు 
నిమ్మరసం : అరకప్పు 
అనాస రసం : అర కప్పు
ద్రాక్షా రసం : పావు కప్పు 
పంచదార సిరప్ : పావుకప్పు 
ఐస్ ముక్కలు : పదిహేను 

తయారుచేయు విధానం :

1) ఒక గ్లాసులో ఐస్ ముక్కలు చిన్నగా చేసి వెయ్యాలి.   
2) మరో గ్లాసులో కమలారసం, ద్రాక్షా రసం, అనాస రసం, నిమ్మరసం, పంచదార సిరప్ వేసి కలపాలి. 
3)  వెంటనే ఐస్ ముక్కలు ఉన్న గ్లాసుల్లో వేసి సర్వ్ చేయటమే. 

1
షుగర్ సిరప్ :


కావలసిన పదార్ధాలు :

పంచదార : కేజీ 
మంచినీళ్ళు : లీటరు 

తయారుచేయు విధానం :

1) స్టవ్ వెలిగించి వెడల్పుగా ఉన్న గిన్నెలో పంచదార, నీళ్ళుపోసి పాకం రానివ్వాలి. 
2) లేతపాకం రాగానే స్టవ్ ఆపాలి. చల్లారిన తరువాత  ఒక సీసాలో భద్రం చేసుకోవాలి.
3) పళ్ళరసాలు చేసుకొనేటప్పుడు ఈ సిరప్ ఉపయోగ పడుతుంది.

ఆపిల్ ద్రాక్షా జ్యూస్ 

కావలసిన పదార్దములు :

ఆపిల్ : ఒకటి 
ద్రాక్షాలు : వంద గ్రాములు 
నిమ్మరసం : టీ స్పూన్ 
పంచదార : రెండు టేబుల్ స్పూన్లు
ఐస్ ముక్కలు : పది 

తయారుచేయు విధానం :

1) ఆపిల్ ని ముక్కలు చేసి జ్యూసర్లో వేసి రసం తియ్యాలి. ఇది అర కప్పు వస్తుంది.
2) ఇప్పుడు ద్రాక్షలు జ్యూసర్ లో వేసి రసం తియ్యాలి, ఇది అర కప్పు వస్తుంది.
3) ఐస్ ముక్కలు చిదకొట్టి ఒక గ్లాసులో వేసి ఉంచాలి.
4) మరో గ్లాస్ తీసుకోని ఆపిల్ రసం, ద్రాక్ష రసం వేసి దానిలో పంచదార సిరప్, నిమ్మరసం కలిపి ఐస్ ఉన్న గ్లాస్ లోకి వేసి గ్లాస్ ఫై ఆపిల్ ముక్కలతో అలంకరించి సర్వ్ చేయండి.
  
* అంతే చల్లచల్లని ఆపిల్  ద్రాక్షా జ్యూస్ రెడి.

నిమ్మసోడా 


కావలసిన పదార్దములు :


సోడా : అర కప్పు 
నిమ్మరసం : పావుకప్పు 
పుదీనా ఆకులు : పది 
ఐస్ ముక్కలు : పది 
నిమ్మ ముక్కలు : ఐదు 




తయారుచేయు విధానం :


1) ఒకగ్లాసులో చిన్నగా చిదక్కోట్టిన ఐస్ ముక్కలు వేయాలి. 
2) పుదీనా ఆకులు మెత్తగా చేసి నిమ్మరసంలో కలపాలి. 
3) ఇప్పుడు ఐస్ ముక్కలు ఉన్న గ్లాసులోకి పుదీనా కలిపిన నిమ్మరసం వడకట్టాలి.
4) దీనిలో సోడా, నిమ్మ ముక్కలు వేసి సర్వ్ చేయాలి.


* అంతే చల్లచల్లని నిమ్మ సోడా రెడీ.


కేరెట్ ఆరంజ్ జ్యుస్


కావలసినపదార్దములు :


టమాటాలు : రెండు
కేరెట్లు : రెండు
కమలా : రెండు
పంచదార : అర కప్పు
నిమ్మకాయ : ఒకటి
మిరియాలపొడి : రెండు చిటికెలు
ఉప్పు : చిటికెడు


తయారుచేయు విధానం :


1) కమలా కాయలు వలిచి తొనలు తీసి,ఆ తొనలు కూడా వలిచి పలుచటి 
    పోరను, గింజలును తీసి పక్కనపెట్టాలి.
2) కేరేట్లు, టమాటాలు ముక్కలుగా కట్  చెయ్యాలి.
3) ఇప్పుడు టమాటాలు, కేరెట్ ముక్కలు, ఉప్పు మిక్సి జార్లో వేసి మిక్సి 
     పట్టాలి.
4) తరువాత వలిచిన కమలా తోనలు, పంచదార వేసి మిక్సి పట్టాలి. ఒక 
     నిముషంలో జ్యుస్ రెడీ అవ్వుతుంది.
5) దీనిని రెండు గ్లాస్ ల్లో వడపోసి ఫైన నిమ్మరసం, మిరియాలపొడి వేసి 
     అతిధులకు అందించటమే.


* అంతే ఎంతో రుచిగా ఉండే కేరెట్ ఆరంజ్ జ్యుస్ రెడీ.

స్ట్రాబెర్రి మిల్క్ 


కావలసిన పదార్దములు :

స్ట్రాబెర్రిలు ముక్కలు : రెండు కప్పులు 
కాచి చల్లార్చిన పాలు : అర లీటరు 
పంచదార : నాలుగు టేబుల్ స్పూన్లు 
జీడిపప్పులు : అరకప్పు 
ఎండుద్రాక్షా : రెండు టేబుల్ స్పూన్లు 
ఐస్ ముక్కలు : కొన్ని 

తయారుచేయు విధానం :


1) జీడిపప్పు నాలుగు గంటలు నీటిలో నానబెట్టాలి. వీటిని మిక్సి లో వేసి మెత్తగా పేస్టులా చెయ్యాలి. 
2) ఇప్పుడు దీనిలో స్ట్రాబెర్రి ముక్కలు వేసి మిక్సి వెయ్యాలి.
3) పంచదార, పాలు వేసి మళ్ళి మిక్సి వేస్తె పాలు, స్ట్రాబెర్రిలు, జీడిపప్పు పేస్టు, పంచదార బాగా కలిసి చక్కటి లైట్ పింక్ కలర్ లో కనిపిస్తుంది.
4) దీనిని గ్లాసులో వేసి ఎండు ద్రాక్షా, స్ట్రాబెర్రి ముక్కలు వేసి కలిపి సర్వ్ చేయండి.


ఎంతో రుచిగా ఉండే స్ట్రాబెర్రి మిల్క్ రెడీ .



ద్రాక్ష షర్బత్

కావలసిన పదార్దములు :

నల్లద్రాక్ష : రెండుకప్పులు 
బత్తాయి రసం : కప్పు
యాపిల్ ముక్కలు : అర కప్పు 
పంచదార : 1 స్పూన్ 
జీలకర్ర పొడి : టీ స్పూన్  
ఉప్పు : కొద్దిగా 

తయారుచేయు విధానం :

ముందుగా మిక్సిలో ద్రాక్షాలు, యాపిల్ ముక్కలు వేసి మిక్సి పట్టాలి.
దీనిని వేరే గిన్నెలోకి వడపోసి దీనిలో జీలకర్ర పొడి, పంచదార, ఉప్పు కొద్దిగా నీళ్ళు, బత్తాయి రసం కలపాలి.
రెండు, మూడు ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయడమే.


అంతే  చల్లచల్లని షర్బత్ రెడి. 



డ్రై ఫ్రూట్ జ్యూస్


కావలసిన పదార్ధాలు : 

జీడిపప్పులు : అర కప్పు 
బాదం పప్పులు : అర కప్పు 
ఎండి  ద్రాక్ష : అర కప్పు 
పాలు : అర లీటరు 
పంచదార : కప్పు 
తేనే : రెండు టేబుల్ స్పూన్లు 

తయారుచేయు విధానం :

1) ముందురోజు రాత్రి బాదం, జీడిపప్పు, ఎండుద్రాక్షా నీటిలో నానబెట్టాలి.
2) ఇప్పుడు జ్యూస్ జార్లో నానపెట్టిన పప్పులు వేసి మిక్సి పట్టాలి.
3) ఇవి మెత్తగా అయ్యిన తరువాత పాలు, పంచదార వేసి ఒకసారి మిక్సి పట్టాలి.
4) ఇప్పుడు తయారయిన జ్యూస్ ని  గ్లాస్ లోకి పోసి తేనే, నిమ్మరసం, ఐస్ ముక్కలు వేసి అతిధులకు అందించటమే.


* వేసవిలో తాగటానికి చల్లచల్లని డ్రై ఫ్రూట్ జ్యూస్ రెడి. 



వంటపేరు : టమాట కేప్సికం సాస్


కావలసిన పదార్దములు :


కేప్సికంలు : రెండు
టమాటాలు: నాలుగు
మిరియాల పొడి : రెండు చిటికలు
ఉప్పు : పావు స్పూన్
పంచదార : ఆరు టీ స్పూన్లు


తయారుచేయు విధానం :


1) కేప్సికంలకు ఫైన నూనెరాసి స్టవ్ మీద కాల్చాలి. అలాగే టమాటలకు నూనెరాసి స్టవ్ మీద కాల్చాలి. 
2) ఇవి చల్లారిన తరువాత, పైన తొక్కతీసి ముక్కలుగా కట్ చేసి లోపల గింజలు కుడా తీసి వేయాలి.
3) ఇప్పుడు మిక్సి జార్ లో కేప్సికం ముక్కలు, టమాట ముక్కలు, ఉప్పు, మిరియాల పొడి, పంచదార వేసి మెత్తగా గ్రైండ్ చెయ్యాలి.


* అంతే కేప్సికం సాస్ రెడి.
* ఇది కొన్ని రోజులు నిల్వ ఉండాలంటే స్టవ్ వెలిగించి కళాయిలో 1 టేబుల్ స్పూన్ నూనె వేసి వేడయ్యాక ఈ సాస్ ను  వేసి, కాసేపు ఉడికించి చల్లారిన తరువాత ఒక బాటిల్ లో జాగ్రత్త చెయ్యాలి.



పుచ్చకాయ, నల్లద్రాక్ష జ్యూస్


కావలసిన పదార్ధాలు :


పుచ్చముక్కలు : నాలుగు కప్పులు
నల్లని ద్రాక్షా : పావు కప్పు (గింజలు లేనివి)
నిమ్మరసం : పావుకప్పు
పంచదార : సరిపడా


తయారుచేయు విధానం :


1. పుచ్చకాయ చెక్కు గింజలు తీసి ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కల్లో 
    ద్రాక్షా, పంచదార కలిపి మిక్సిలో వేసి బాగా మిక్స్ చేయాలి.
2. మెత్తగా అయ్యాక కొద్దిగా నీళ్ళు, నిమ్మరసం వేసి ఒక సారితిప్పి గ్లాసుల్లో 
    ఐస్ ముక్కలు వేస్తె త్రాగటానికి జ్యూస్ రెడి.
3. ఇది చూడటానికి గులాబి కలర్లో ఉండి పుల్లపుల్లగా తియ్యతియ్యగా ఎంతో 
    రుచిగా వుంటుంది.



కావలసిన పదార్ధాలు :


పుదినా ఆకులు : అర కప్పు
నీళ్ళు : కప్పు
గ్రీన్ టీ బ్యాగులు : మూడు
తేనే : రెండు టేబుల్ స్పూన్లు






తయారుచేయు విధానం :


1) నీళ్ళు మరిగించి దానిలో పుదినా ఆకులు వేసి ఒక నిముషం మరిగాక స్టవ్ ఆపి, దీనిలో తేనే, గ్రీన్ టీ బ్యేగులు వేసి పది నిముషాలు పక్కన పెట్టాలి. 
2) తరువాత టీ బ్యేగులు, పుదినా ఆకులూ తీసి కాసేపు ఫ్రిజులో పెట్టాలి.


* చల్లబడ్డాక తాజా పుదినా అకులుతో అలంకరించి అందించాలి.
* (వేడిగాను త్రాగొచ్చు)
* అంతే తొందరగా తయారయే గ్రీన్ టీ రెడి.

వంటపేరు : ఫ్రూట్ సలాడ్


కావలసిన పదార్ధాలు :


అరటి పళ్ళు ముక్కలు : ఒక కప్పు
యాపిల్ ముక్కలు : ఒక కప్పు
ఆరంజి ముక్కలు : ఆరు తొనలు
బొప్పాయి ముక్కలు : ఒక కప్పు
దానిమ్మ గింజలు : అర కప్పు
జామ ముక్కలు : ఒక కప్పు
అనాస ముక్కలు : ఒక కప్పు
ద్రక్షాలు : ఒక కప్పు
తేనె : ఒక స్పూన్ 
మిరియాల పొడి : చిటికెడు
ఉప్పు : చిటికెడు


తయారుచేయు విధానం :


ఫ్రూట్ సలాడ్ కావాలంటే ఆరటిముక్కలు, యాపిల్ ముక్కలు, బొప్పాయి ముక్కలు, అనాస ముక్కలుతో పాటు కమలా తొనల ముక్కలు, దానిమ్మ గింజలు గుప్పెడు, జామ ముక్కలు, ద్రక్షాలు అన్నికలిపి కొద్దిగా తేనె, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు ఉప్పు కలిపితే ఫ్రూట్ సలాడ్ రెడి.



వంటపేరు : స్ట్రాబెర్రీ లస్సి


కావలసిన పదార్ధాలు :


స్ట్రాబెర్రీ ముక్కలు : మూడు కప్పులు
పెరుగు : రెండు కప్పులు
పంచదార : ఒక కప్పు
ఉప్పు : చిటికెడు
యాలుకలపొడి : చిటికెడు
ఐసు ముక్కలు : ఒక కప్పు


తయారుచేయు విధానం :


1) మిక్సి జార్లో స్ట్రాబెర్రీలు, ఉప్పు, పంచదార, యాలుకలపొడి వేసి బాగా 
    కలిసేలా తిప్పాలి.
2) ఇప్పుడు పెరుగు వేసి మళ్లీ ఒకసారి తిప్పాలి. 
3) దీనిని గ్లాసులోకి వంచి ఐసు ముక్కలు వేసి అందించటమే.


* అంతే స్ట్రాబెర్రీ లస్సి రెడి.



వంటపేరు : లస్సి


కావలసిన పధార్ధాలు :


పెరుగు : కప్పు
రోజ్వాటర్ : టీ స్పూన్
నీళ్ళురెండు : కప్పులు
యాలుకల : పొడి చిటికెడు
పుదినా : ఆకులూ రెండు
ఉప్పు : తగినంత


తయారుచేయు విధానం :


1) మిక్సి జార్లో పెరుగు, యాలుకపొడి, రోజ్ వాటర్, మంచి నీళ్ళు, ఉప్పు వేసి 
    బాగా మిక్స్ చెయ్యాలి .
2) ఇప్పుడు దీనిని గ్లాసులోకి వేసి పుదినా ఆకులు వేసి అతిధులకు 
    అందించండి.


* ఇది వేసవి కాలంలో తీసుకుంటే చాలా మంచిది.
* అంతే లస్సి రెడి.
* (స్వీట్ లస్సి కావాలంటే ఉప్పు బదులు పంచదార వేసుకోవడమే)



Powered by Blogger.