ద్రాక్ష షర్బత్ (Grape MIxture in telugu Draksha Sharbat)

ద్రాక్ష షర్బత్

కావలసిన పదార్దములు :

నల్లద్రాక్ష : రెండుకప్పులు 
బత్తాయి రసం : కప్పు
యాపిల్ ముక్కలు : అర కప్పు 
పంచదార : 1 స్పూన్ 
జీలకర్ర పొడి : టీ స్పూన్  
ఉప్పు : కొద్దిగా 

తయారుచేయు విధానం :

ముందుగా మిక్సిలో ద్రాక్షాలు, యాపిల్ ముక్కలు వేసి మిక్సి పట్టాలి.
దీనిని వేరే గిన్నెలోకి వడపోసి దీనిలో జీలకర్ర పొడి, పంచదార, ఉప్పు కొద్దిగా నీళ్ళు, బత్తాయి రసం కలపాలి.
రెండు, మూడు ఐస్ ముక్కలు వేసి సర్వ్ చేయడమే.


అంతే  చల్లచల్లని షర్బత్ రెడి.