Showing posts with label salads. Show all posts


కావలసిన పదార్దాలు :

పుట్టగొడుగులు : పది
ఉప్పు :తగినంత
నీళ్ళు : ఐదు కప్పులు
ఉల్లి ముక్కలు : టేబుల్ స్పూన్
బీన్స్ ముక్కలు : టేబుల్ స్పూన్
క్యారెట్ : ఒకటి
క్యాబేజి ఆకులు : రెండు
వెల్లుల్లి : ఒకటి
కొత్తిమీర తరుగు : అర కప్పు
కార్న్ ఫ్లోర్ : మూడు టీ స్పూన్లు
నిమ్మరసం : నాలుగు టీ స్పూన్లు పంచదార : టీ స్పూన్

తయారుచేయు విధానం :

1) ఒక కప్పులోకి కొద్దిగా నీళ్ళు తీసుకోని దీనిలో కార్న్ ఫ్లోర్ వేసి
ఉండలులేకుండా కలిపిపక్కన పెట్టాలి.
2) స్టవ్ మీద గిన్నేపెట్టి ఐదు కప్పుల  నీళ్ళు పోసి ఉప్పు వేసి మరగనివ్వాలి.
3) మరుగు తున్న నీటిలో బీన్స్, క్యారెట్, పుట్టగొడుగులు, ఉల్లిముక్కలు,
వెల్లుల్లి, క్యాబేజి ఆకులు వేసి ఉడికించాలి.
4) ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర, పంచదార వేసి కాసేపు మరగనివ్వాలి.
5) నీటిలో కలిపిన మొక్కజొన్న పిండి వేసి రెండు నిముషాలు మరిగించి స్టవ్ ఆపాలి.
6) ఇప్పుడు నిమ్మరసం కలిపి మిగిలిన కొత్తిమీర వేసి మూత పెట్టాలి.
అంతే మష్రూం సూప్ రెడీ.

కావలసినపదార్దాలు :

ఓట్స్ : పావుకప్పు 
క్యారెట్ ముక్కలు : కప్పు
ఉల్లి ముక్కలు : పావు కప్పు
ఉప్పు : తగినంత 
మిరియాల పొడి : చిటికెడు 
కొత్తిమీర : కొద్దిగా 
వెన్న : టీ స్పూన్ 

తయారుచేయు విధానం: 

1) ఒకగిన్నేలో ఉల్లిముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి మెత్తగా వుడికించాలి.
2) ఇప్పుడు వీటిని చల్లారనిచ్చి మిక్సి జార్లో వేసి గ్రైండ్ చేసి వడకట్టుకోవాలి.
3) ఇప్పుడు పాన్ పై వెన్న వేడిచేసి ఓట్స్ దోరగా వేయించి, వేగాక వీటిలో కప్పు నీళ్ళు పోసి రెండునిముషాలు ఉడికించుకోవాలి.
4) ఓట్స్ ఉడికిన తరువాత ముందు ఉడికించుకున్న క్యారెట్ రసం, మిరియాలపొడి, ఉప్పు వేసి చిక్కబడేవరకు ఉడికించి స్టవ్ ఆపాలి.
5) సర్వ్ చేసే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చెయ్యాలి.

కావలసిన పదార్దాలు :


కీరా ముక్కలు : కప్పు
కాలీ ఫ్లవర్ ముక్కలు : కప్పు
టమాట ముక్కలు : కప్పు
బీరకాయ ముక్కలు : అరకప్పు
 కేరెట్ ముక్కలు : కప్పు
పొట్ల కాయ ముక్కలు : అర కప్పు
మిరియాల పొడి : అర టీ-స్పూన్
ఉప్పు : అర టీ-స్పూన్
నిమ్మరసం : టీ-స్పూన్
చాట్ మసాల : అర టీ-స్పూన్


తయారుచేయు విధానం :


1) కూరగాయలను శుభ్రంగా కడిగి  చిన్నచిన్న ముక్కలుగా కట్  చెయ్యాలి.
2) కూరగాయ ముక్కలు ఒక ప్లేట్ లోకి తీసుకొని స్పూన్ తో కలిపి, వాటి మీద చిటికెడు మిరియాల పొడి, చిటికెడు ఉప్పు, చిటికెడు చాట్ మసాల పొడి జల్లి నిమ్మరసం పిండి ఒకసారి కలిపితె వెజిటబుల్ సలాడ్ రెడి.

వంటపేరు : వెజ్ ప్ర్రుట్ సలాడ్                                                            


కావలసిన పదార్ధాలు :

కేరెట్ : ఒకటి
బిట్రూట్ : ఒకటి                                                       
కీరదోస ముక్కలు : మూడు                                  
టమాటాలు : రెండు
అరటి పండు : ఒకటి
బొప్పాయి : కాయలో సగం
యాపిల్ : రెండు
అనాస : సగం
చాట్ మసాల : పావు టీ స్పూన్


తయారుచేయు విధానం :


ఒక ప్లేటులో గుండ్రంగా కోసిన కేరెట్ ముక్కలు, టమాటముక్కలు, కిరా ముక్కలు, బిట్ రూట్ ముక్కలు వేసి వీటి మీద అరటి ముక్కలు, అనాస ముక్కలు, బొప్పాయి ముక్కలు, యాపిల్ ముక్కలు వేసి కలిపి, చాట్ మసాల జల్లండి.


* అంతే వెజ్ ఫ్రూట్ సలాడ్ రెడి



వంటపేరు : ఫ్రూట్ సలాడ్


కావలసిన పదార్ధాలు :


అరటి పళ్ళు ముక్కలు : ఒక కప్పు
యాపిల్ ముక్కలు : ఒక కప్పు
ఆరంజి ముక్కలు : ఆరు తొనలు
బొప్పాయి ముక్కలు : ఒక కప్పు
దానిమ్మ గింజలు : అర కప్పు
జామ ముక్కలు : ఒక కప్పు
అనాస ముక్కలు : ఒక కప్పు
ద్రక్షాలు : ఒక కప్పు
తేనె : ఒక స్పూన్ 
మిరియాల పొడి : చిటికెడు
ఉప్పు : చిటికెడు


తయారుచేయు విధానం :


ఫ్రూట్ సలాడ్ కావాలంటే ఆరటిముక్కలు, యాపిల్ ముక్కలు, బొప్పాయి ముక్కలు, అనాస ముక్కలుతో పాటు కమలా తొనల ముక్కలు, దానిమ్మ గింజలు గుప్పెడు, జామ ముక్కలు, ద్రక్షాలు అన్నికలిపి కొద్దిగా తేనె, చిటికెడు మిరియాల పొడి, చిటికెడు ఉప్పు కలిపితే ఫ్రూట్ సలాడ్ రెడి.



బొప్పాయి సలాడ్




కావలసిన పదార్ధాలు :


బొప్పాయి : అరకిలో
బత్తాయి రసం : అరకప్పు
టమాటాలు : పెద్దవి రెండు
నిమ్మరసం : రెండు టీ స్పూన్ లు మిరియాలపొడి : 1 టీ స్పూన్
ఉప్పు : చిటికెడు




తయారుచేయు విధానం :


1) బొప్పాయి చెక్కు తీసి చిన్నచిన్న ముక్కలుగా కోయ్యాలి. 
2) వీటిలో బత్తాయి రసం, ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం, టామాట 
    ముక్కలు కలిపాలి.


*  గాజు పాత్రలో వేసి పిల్లలకు అందించటానికి బొప్పాయి సలాడ్ రెడి.



Powered by Blogger.