కావలసిన పదార్దములు :
అనాస పండు : చిన్నది ఒకటి
కొబ్బరి చెక్క : ఒకటి
పంచదార సిరప్ : 4 టేబుల్ స్పూన్లు
ఐస్ ముక్కలు : పది
తయారుచేయు విధానం :
1) అనాస పండు చెక్కు తీసి ముక్కలు చేసి జ్యుసర్ లో వేసి రసం తియ్యాలి.
2) కొబ్బరి ముక్కలు చేసి పాలు తీసుకోవాలి.
3) ఐస్ ను చిన్న ముక్కలుగా చేసి రెండు గ్లాసులో వేసి ఉంచాలి.
4) మరో గ్లాసులో అనాస రసం, కొబ్బరి పాలు, పంచదార సిరప్ వేసి కలిపి ఐస్ ముక్కలు వేసిన గ్లాసులోకి వేసి సర్వ్ చేయడమే.
Post a Comment