కావలసిన పదార్దములు :
స్ట్రాబెర్రిలు ముక్కలు : రెండు కప్పులు
కాచి చల్లార్చిన పాలు : అర లీటరు
పంచదార : నాలుగు టేబుల్ స్పూన్లు
జీడిపప్పులు : అరకప్పు
ఎండుద్రాక్షా : రెండు టేబుల్ స్పూన్లు
ఐస్ ముక్కలు : కొన్ని
తయారుచేయు విధానం :
1) జీడిపప్పు నాలుగు గంటలు నీటిలో నానబెట్టాలి. వీటిని మిక్సి లో వేసి మెత్తగా పేస్టులా చెయ్యాలి.
2) ఇప్పుడు దీనిలో స్ట్రాబెర్రి ముక్కలు వేసి మిక్సి వెయ్యాలి.
3) పంచదార, పాలు వేసి మళ్ళి మిక్సి వేస్తె పాలు, స్ట్రాబెర్రిలు, జీడిపప్పు పేస్టు, పంచదార బాగా కలిసి చక్కటి లైట్ పింక్ కలర్ లో కనిపిస్తుంది.
4) దీనిని గ్లాసులో వేసి ఎండు ద్రాక్షా, స్ట్రాబెర్రి ముక్కలు వేసి కలిపి సర్వ్ చేయండి.
4) దీనిని గ్లాసులో వేసి ఎండు ద్రాక్షా, స్ట్రాబెర్రి ముక్కలు వేసి కలిపి సర్వ్ చేయండి.
ఎంతో రుచిగా ఉండే స్ట్రాబెర్రి మిల్క్ రెడీ .
Post a Comment