పుచ్చకాయ, నల్లద్రాక్ష జ్యూస్ (Grape, Water Melon Juice)

పుచ్చకాయ, నల్లద్రాక్ష జ్యూస్


కావలసిన పదార్ధాలు :


పుచ్చముక్కలు : నాలుగు కప్పులు
నల్లని ద్రాక్షా : పావు కప్పు (గింజలు లేనివి)
నిమ్మరసం : పావుకప్పు
పంచదార : సరిపడా


తయారుచేయు విధానం :


1. పుచ్చకాయ చెక్కు గింజలు తీసి ముక్కలుగా కోసుకోవాలి. ఈ ముక్కల్లో 
    ద్రాక్షా, పంచదార కలిపి మిక్సిలో వేసి బాగా మిక్స్ చేయాలి.
2. మెత్తగా అయ్యాక కొద్దిగా నీళ్ళు, నిమ్మరసం వేసి ఒక సారితిప్పి గ్లాసుల్లో 
    ఐస్ ముక్కలు వేస్తె త్రాగటానికి జ్యూస్ రెడి.
3. ఇది చూడటానికి గులాబి కలర్లో ఉండి పుల్లపుల్లగా తియ్యతియ్యగా ఎంతో 
    రుచిగా వుంటుంది.