Showing posts with label fries. Show all posts

మెంతిఆకు పప్పుపొడి కూర 
కావలసినపదార్దాలు:

మెంతు కూర : రెండు కట్టలు 
పెసర(కంది) పప్పు: పావుకప్పు 
పోపుదినుసులు : టీ స్పూన్ 
ఎండుమిర్చి : పది  
వెల్లుల్లి రెబ్బలు :పది 
కారం : పావు టీ స్పూన్ 
ఉప్పు తగినంత 
నూనె : అర కప్పు 
పసుపు :పావు టీ స్పూన్ 
కరివేపాకు :రెండురేమ్మలు 
కొత్తిమీర :కొద్దిగా 
పచ్చిమిర్చి : నాలుగు 

తయారుచేయువిధానం: 
1)మెంతు కాడలు తీసేసి ఆకులు శుబ్రంగా కడిగి పక్కన పెట్టాలి.
2) స్టవ్ ఫై కళాయి పెట్టి వేడిచేసి పెసరపప్పు వేసి వేయించాలి.
3) దీనిలోనే కొద్దిగా నూనె వేసి ఎండు మిర్చి వేసి వేయించి తియ్యాలి. 
4) ఇప్పుడు మిక్సి జార్లో వేయించిన పెసర పప్పు,ఎండు మిర్చి, వెల్లుల్లి రెబ్బలు వేసి పొడిలా మిక్సి పట్టాలి.
5) స్టవ్ మీద నూనె వేడి చేసి పోపు దినుసులు, ఎండిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర  పచ్చిమిర్చి వేసి వేగాక మెంతుకూర వేసి ఐదు నిముషాలు మగ్గ నివ్వాలి. 
6) ఇప్పుడు కారం, పసుపు, ఉప్పు వేసి ఒక సారి కలిపి ముందుగా చేసి 
పెట్టుకున్న పెసర పొడి వేసి బాగా కలపాలి.చివరగా కొత్తిమీర చల్లి స్టవ్ ఆపాలి.    

1

కాకరకాయల ఫ్రై (వేపుడు )
కావలసిన పదార్దాలు:

కాకరకాయలు :పావుకిలో
నూనె : కప్పు
ఉప్పు : తగినంత
పసుపు : పావు టీ స్పూన్
కారం : టీ స్పూన్
కార్న్ ఫ్లోర్ : రెండు టీ స్పూన్లు
వెల్లుల్లి రెబ్బలు : ఐదు
కరివేపాకు : రెండు రెమ్మలు
నువ్వులపొడి : టీ స్పూన్
జీడిపప్పులు : పది

తయారుచేయు విధానం:

1) కాకరకాయలు ఫైన ఉండే చెక్కు తీసి నిలువుగా సన్నగా కట్చేసి పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి. అలా చేస్తే నీళ్ళు వూరతాయి.
2) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.కాగాక కాకర కాయ ముక్కలు గట్టిగా పిండి కాగే నూనెలో బాగా వేయించాలి.
3) వేగాక దానిలో కార్న్ ఫ్లోర్, కారం, కరివేపాకు, చిత కొట్టిన వెల్లుల్లి వేసి బాగా కలిపి జీడి పప్పులు చల్లి స్టవ్ ఆపాలి. 



క్యారెట్ ఫ్రై 
కావలసిన పదార్దాలు:

క్యారెట్లు : పావుకిలో
మైదా : కప్పు
శెనగపిండి : కప్పు
కారం : టీ స్పూన్
పెరుగు : కప్పు
అల్లం వెల్లుల్లి : టీ స్పూన్
కరివేపాకు : కొద్దిగా
ఉప్పు : తగినంత
నూనె : వేయించటానికి సరిపడా
పచ్చిమిర్చి : ఐదు

తయారుచేయు విధానం:

1) ఒక గిన్నెలో మైదా, శెనగ పిండి, అల్లం, వెల్లుల్లి, ఉప్పు,కారం, పెరుగు వేసి పకోడీ పిండిలా కలిపి పక్కనపెట్టాలి.
2) క్యారెట్లు నిలువుగా ముక్కలుగా కట్ చేయ్యాలి.
3) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి.కాగాక ఈ క్యారెట్ ముక్కలు కలిపిన శెనగపిండి మిశ్రమంలో ముంచి కాగే నూనెలో దోరగా వేయించాలి.
4) ఇప్పుడు మరో కళాయిలో రెండు  స్పూన్లు నూనె వేసి పచ్చిమిర్చి ముక్కలు, కరివేపాకు వేసి వేగిన తరువాత వేయించి పెట్టిన క్యారెట్ ముక్కలు కూడా వేసి బాగా కలుపుతూ చిన్న మంట మీద ఐదు నిముషాలు వేయించాలి.
అంతే క్యారెట్ ఫ్రై రెడీ 

1

కారకాయ స్టఫింగ్
కావలసిన పదార్దాలు:

కాకరకాయలు : మూడు
దనియాలు : టేబుల్ స్పూన్
మినపప్పు : టేబుల్ స్పూన్
ఎండు కొబ్బరి తురుము : రెండు టేబుల్ స్పూన్లు
పల్లీలు : టేబుల్ స్పూన్
ఎండు మిర్చి : ఐదు
ఉప్పు : తగినంత
నూనె : వేయించటానికి సరిపడా
వెల్లుల్లి : మూడు రెబ్బలు

తయారు చేయు విధానం:

1) కాకర కాయలు ఒకప్రక్క నిలువుగా చీల్చిగింజలు తీసి పక్కన పెట్టాలి.
2) స్టవ్ ఫై నూనె పెట్టి కాకరకాయలు నూనెలో మునిగేలా వేసి వేయించి పక్కన పెట్టాలి.
3) వేరే కళాయి లో కొద్దిగా నూనె వేసి దనియాలు, జీలకర్ర, పల్లీలు, మినపప్పు, ఎండుమిర్చి, పచ్చిశెనగపప్పు, వెల్లుల్లి వేసి  వేయించాలి.
4) వీటిలో ఎండుకొబ్బరి తురుము, ఉప్పు వేసి వీటన్నిటిని మిక్సిలో వేసి మెత్తగా పొడి చెయ్యాలి.
5) ఇప్పుడు ఈ పొడిని వేయించిన కాకరకాయాల్లో పెట్టి (కూరి)స్టఫ్ చెయ్యాలి.
6) ఇప్పుడు స్టవ్ మీద కొద్దిగా నూనె వేసి స్టఫ్ చేసిన కాకరకాయలు వేసి కాసేపు వేయించాలి.
7) స్టఫ్ చెయ్యగా పొడి మిగిలితే వేగుతున్న కాకర కాయల ఫైన చల్లాలి.
ఒక నిముషం ఆగి స్టవ్ ఆపాలి.
అంతే కాకరకాయల స్టఫ్డ్ కర్రీ రెడీ 

1

కావలసిన పదార్దాలు:

రొయ్యలు : పన్నెండు(పెద్దవి)
కొబ్బరి తురుము : కప్పు
బ్రెడ్ ముక్కలు : ఐదు
గుడ్లు : నాలుగు
మిరియలపొడి : టీ స్పూన్
ఉప్పు : తగినంత
నూనె : వేయించ టానికి సరిపడ
ఉల్లి ముక్కలు : పావు కప్పు 

తయారు చేయు విధానం:

1) రొయ్యలు తోకలు అలాగే ఉంచి ఫై పొలుసు వలిచి, బాగా కడిగి ఉంచుకోవాలి.
2) బ్రెడ్ స్లయిసేస్ చిదిమి వీటికి కొబ్బరితురుము కలపాలి.
3) గుడ్లు పగుల గొట్టి దీనిలో మిరియాలపొడి కలపాలి.
4) ఇప్పుడు స్టవ్ వెలిగించి  నూనె వేడి చేయ్యాలి.ఉల్లి ముక్కలు వేయించి తియ్యాలి.
5)  ఇప్పుడు రొయ్యలు ఒకొక్కటిగా గుడ్లు సోనలో ముంచి తరువాత బ్రెడ్, కొబ్బరి మిశ్రమంలో దొర్లించి కాగుతున్న నూనెలో వేసి రెండు  ప్రక్కలా దోరగా వేయించాలి.వీటికి వేయించిన ఉల్లి ముక్కలు కలపాలి.
6) ఇవి అన్నంలో తినొచ్చు,లేదా సాయింత్రాలు స్నాక్సలా తినొచ్చు .

కావలసిన పదార్దములు :


బెండకాయలు - పావుకిలో
టమాటాలు - రెండు
కారం - అర టీ స్పూన్
ఉప్పు - సరిపడా
పసుపు - పావు టీ స్పూన్
పచ్చి మిర్చి - ఆరు
కరివేపాకు - రెండు రెమ్మలు
వెల్లుల్లి -ఐదు రెబ్బలు
ఎండిమిర్చి - రెండు
నూనె - మూడు టేబుల్ స్పూన్లు
జీలకర్ర - అర టీ స్పూన్

తయారుచేయు విధానం :


1) బెండకాయలు కడిగి నిలువుగా అడ్డుగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేయాలి.
2) టమాటాలు కూడా చిన్నచిన్న ముక్కలుగా కట్ చేయాలి.
3) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చేయాలి.నూనె కాగాక పోపు దినుసులు,వేసి వేగాక ఎండి మిర్చి,కరివేపాకు,వెల్లుల్లి,జీలకర్ర వేసి వేగిన తరువాత పచ్చిమిర్చిముక్కలు వేసి కలిపి పసుపు బెండకాయముక్కలు వేసి చిన్న మంటమీద కలుపుతూ ఉండాలి.
4) ఐదునిముషాలు ఆగి టమాటముక్కలు వేయాలి.తరువాత ఉప్పు కారం వేసి కలిపి ఒకనిముషం ఆగి స్టవ్ ఆపాలి. తడిపొడిగా ఉండే బెండకాయలు టమాట వేపుడు రెడీ.

కావలసిన పదార్దాలు: 


కంద : పావుకిలో 
తోటకూర తరుగు : మూడు కప్పులు 
ఉప్పు: తగినంత  
పసుపు :  అర టీ స్పూన్ 
కారం : టీ స్పూన్ 
చింతపండు రసం : 2 టేబుల్ స్పూన్లు 
పోపు దినుసులు : టీ స్పూన్ 
కరివేపాకు : రెండు రెమ్మలు 
కొబ్బరితురుము : తెండు టీ స్పూన్లు  
నూనె : కప్పు 
బెల్లం : చిన్నముక్క 
జీలకర్ర : టీ స్పూన్ 
ఆవాలు : అర టీ స్పూన్ 
ఎండుమిర్చి : మూడు 
మినపప్పు : అర టీ స్పూన్ 
శెనగపప్పు : అర టీ స్పూన్ 
నిమ్మరసం : రెండు టేబుల్ స్పూన్లు 


తయారు చేయు విధానం :


1) ముందుగా కంద ముక్కలు ఒక గిన్నెలో వేసి పసుపు, కొద్దిగా ఉప్పు వేసి కొన్ని నీళ్ళు పోసి ఉడికించి చిల్లులగిన్నెలో వేసి ఫైన చల్లని నీళ్ళు పొయ్యాలి. ఇలా చేస్తే కంద ముక్కలు పొడిపొడిగా వుంటాయి.
2) స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచెయ్యాలి. దీనిలో తోటకూరతరుగు, ఉప్పు వేసి ఒకనిముషం మగ్గించి, తరువాత పచ్చిమిర్చి, చింత పండు రసం, కారం, బెల్లం, ఉప్పు వేసి రెండునిముషాలు మగ్గనివ్వాలి.
3) ఇప్పుడు కందముక్కలు వేసి ఒకనిముషం కలిపి పక్కనపెట్టాలి.
4) ఇప్పుడు స్టవ్ మీద నూనె వేడిచేసి  జీలకర్ర, ఆవాలు, మినప్పప్పు, శెనగ పప్పు, ఎండు మిర్చి, కరివేపాకు వేసి వేయించాలి.
5) వేగాక కందమిశ్రమం వేసి అల్లం, కొబ్బరి పొడి కలిపి స్టవ్ ఆపాలి. దించాక నిమ్మరసం కలపాలి. అంతే ఎంతో రుచిగా ఉండే కంద తోటకూర కర్రీ రెడీ.

కావలసిన పదార్ధాలు :


మటన్ కీమా : పావుకేజీ 
ఓట్సు : రెండు టేబుల్ స్పూన్లు 
బియ్యప్పిండి : రెండు టేబుల్ స్పూన్లు 
ఉప్పు : తగినంత 
కారం : ఒక టేబుల్ స్పూన్ 
కొత్తిమీర, పుదినా పేస్టు : టేబుల్ స్పూన్ 
పచ్చిబటాణి పేస్టు : టేబుల్ స్పూన్ 
పెరుగు : రెండు టేబుల్ స్పూన్లు 
అల్లం-వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 


తయారు చేయు విధానం:


1) కీమాలో చిటికెడు ఉప్పు, అల్లం పేస్టు కొద్దిగా వేసి ఉడికించాలి. 
2) ఉడికించిన కీమా మిక్సిపట్టాలి. దీనిలో కారం, ఉప్పు, పెరుగు, అల్లం వెల్లులి పేస్టు, కొత్తిమీర పేస్టు, ఓట్సు, బటాని పేస్టు కలపాలి.
3) వీటిని చిన్నచిన్న ముద్దలుగా తీసుకోని అరచేతీలో చిన్నగా వత్తి బియ్యప్పిండిలో అద్ది నాన్ స్టిక్ పాన్ మీద కొద్దిగా నూనెవేసి రెండుప్రక్కలా బాగావేయించాలి.

కావలసిన పదార్దాలు:


గాజర్ తురుము : కప్పు 
నూనె : టేబుల్ స్పూన్ 
పోపు దినుసులు : టీ స్పూన్  
ఎండు మిర్చి: రెండు 
కరివేపాకు :  రెండు రెమ్మలు 
కారం : అర టీ స్పూన్ 
ఉప్పు : తగినంత
జీలకర్ర : అర టీ స్పూన్ 
వెల్లుల్లి రెబ్బలు : నాలుగు  
పసుపు : చిటికెడు 

తయారుచేయు విధానం:

స్టవ్ వెలిగించి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, వేసి వేగాక పచ్చిమిర్చిముక్కలు, ఉల్లిముక్కలు, వేసి వేగనిచ్చి గాజర్ తురుము వేసి కాసేపు  బాగా కలపాలి .
గాజర్ తురుము వేగిన తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. ఐదు నిముషాలు వేయించి, కొత్తిమీర జల్లి ఒక సారి కలిపి స్టవ్ ఆపాలి.
అంతే గాజర్ వేపుడు రెడి .

1
వంటపేరు : మషాల పీతల వేపుడు 

కావలసిన పదార్దములు :

పీతలు : అరకిలో
టమాటాలు : రెండు 
కొబ్బరి ముక్కలు : కప్పు 
గసగసాలు : రెండు టీ స్పూన్లు (నానబెట్టాలి )
కారం : రెండు టీ స్పూన్లు 
ఉప్పు : సరిపడా 
నూనె : కప్పు 
కొత్తిమీర : చిన్న కట్ట 
మషాల : అర టీ స్పూన్ 
దనియాలు : టీ స్పూన్  
జీలకర్ర : టీ స్పూన్ 
పచ్చిమిర్చి : మూడు 
మిరియాలు : పావు టీ స్పూన్ 
పసుపు : పావు టీ స్పూన్ 
కరివేపాకు : రెండు రెమ్మలు 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 

తయారుచేయు విధానం :

1) పీతలు శుబ్రం చేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉ డికించి పక్కన పెట్టాలి.
2) మిక్సి జార్లో నానబెట్టిన గసాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి మెత్తగా అయ్యేలా మిక్స్ చెయ్యాలి.
3) తరువాత దానిలోనే కారం, ఉప్పు, మిర్చి, కొబ్బరిముక్కలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్తూ, గరంమషాల వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా రుబ్బాలి.
4) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేయాలి. కాగాక కరివేపాకు వేసి వేగాక  రుబ్బిన మషాల ముద్ద వేసి గరిటతో కలుపుతూ మంచి వాసనవచ్చే వరకు వేయించాలి.
5) ఇప్పుడు ఉడికించిన పీతలు వేసి చిన్నమంటమీద వేయించాలి. చక్కటి వాసన వచ్చే వరకు వేయించి కొత్తిమీర జల్లి ఒకసారి కలిపి స్టవ్ ఆపాలి.


అంతే మసాలా పీతల వేపుడు రెడీ. 

1
రొయ్యల వేపుడు

కావలసిన పదర్దామలు :

రొయ్యలు : అరకిలో
నూనె వేయించటానికి సరిపడా 
నువ్వులు : అర కప్పు 
కొత్తిమీర (కట్ చేసినది) : అర కప్పు  
టమాట సాస్ : 2 టేబుల్ స్పూన్లు 
బియ్యపిండి : 2 టేబుల్ స్పూన్ 
కార్న్ ఫ్లొర్ : 1 టేబుల్ స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్టు : 1 టీ స్పూన్ 
మిరియాలపొడి : పావు టీ స్పూన్ 
కారం : టీ స్పూన్ 
అజినమోటో : పావు టీ స్పూన్ 
ఉప్పు : సరిపడా 

తయారుచేయు విధానం :

1) రొయ్యలు శుభ్రం చేసి పసుపు, చిటికెడు ఉప్పు వేసి స్టవ్ మీద నీరంతా పోయేవరకు ఉడికించి ఉంచాలి.
2) ఇప్పుడు ఈ రొయ్యల్లో నూనె తప్పించి మిగిలిన పైన చెప్పినవన్నీ కలిపి పావుగంట పక్కన పెట్టాలి.
3) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. కాగిన తరువాత సిద్దం చేసిన రొయ్యల్ని వేసి దోరగా వేయించి ప్లేటులోకి తియ్యాలి. వీటిమీద కొత్తిమీర జల్లి సర్వ్ చేయాలి.
* ఎంతో రుచిగా ఉండే రొయ్యల వేపుడు రెడీ.

1
వంటపేరు : బంగాళాదుంప వేపుడు  


కావలసిన పదార్దములు :


బంగాళాదుంపలు : పావుకేజీ  
జీలకర్ర : అర టీ స్పూన్ 
మెంతులు : పావు టీ స్పూన్  
పసుపు : పావు టీ స్పూన్ 
కారం : అర టీ స్పూన్  
ఉప్పు : సరిపడా 
నూనె : రెండు టేబుల్ స్పూన్లు 
పచ్చిమిర్చి : మూడు    
ఆవాలు : టీ స్పూన్ 
ఎండిమిర్చి : రెండు 
వెల్లుల్లి రెబ్బలు : నాలుగు 
కరివేపాకు : రెండు రెమ్మలు 


తయారు చేయువిధానం : 


1) బంగాళాదుంపలు కడిగి పొట్టుతీసి చిన్నముక్కలుగా చేసి నీళ్ళలో వేసి పక్కన వుంచాలి.
2) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె వేడి చెయ్యాలి, నూనె కాగాక మెంతులు, జీలకర్ర, ఆవాలు, మినపప్పు, ఎండిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగాక పచ్చిమిర్చి ముక్కలు వేసి దోరగా వేగాక కారం, పసుపు, ఉప్పు వేసి ఒకసారి కలిపి బంగాళాదుంప ముక్కలు వేసి చిన్నమంటమీద పది నిముషాలు మూతపెట్టి వుడకనివ్వాలి.
3) నీటిలోనుండి తీసిన బంగాళాదుంపల తడికి మూతనుండిపడుతున్న ఆవిరికి ముక్కలు మెత్తబడతాయి.
4) ఇప్పుడు మూత పెట్టకుండా మరో  పదినిముషాలు వుంచి కలుపుతూ వుంటే తడిమొత్తం పోయి పొడిపొడిగా వేపుడు రెడి అవుతుంది.


* అంతే బంగాళాదుంపల వేపుడు రెడి.


వంటపేరు :చికెన్ 65


కావలసిన పదార్దములు 


చికెన్ : అర కిలో 
పెరుగు : మూడు టేబుల్ స్పూన్లు 
కారం : టీ స్పూన్ 
పసుపు : అర టీ స్పూన్ 
ఉప్పు : సరిపడా 
సోయాసాస్ : రెండు టీ స్పూన్లు   
చిల్లీసాస్ : రెండు టీ స్పూన్లు 
ధనియాలపొడి : రెండు టీ స్పూన్లు  
గరం మసాలా : టీ స్పూన్ 
అజినమోటో : కొద్దిగా  
కాన్ ఫ్లొర్ : టీ స్పూన్లు 
మైదా : రెండు టేబుల్ స్పూన్లు 
కోడిగుడ్డు : ఒకటి 
కొత్తిమీర : చిన్నకట్ట 
పచ్చిమిర్చి : నాలుగు  
వెల్లుల్లి రెబ్బలు : ఆరు 
నూనె : అరకిలో  
ఉల్లిపాయ : ఒకటి చక్రాలాకట్ చెయ్యాలి  


తయారు చేయు విధానం :


1) ముందుగాఒక గిన్నెలో చికెన్ వేసుకొని దానిలో ధనియాలపొడి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాల, అజినమోటో, కాన్ ఫ్లోర్ , మైదా, ఒక స్పూన్ చిల్లిసాస్, ఒకస్పూన్ సోయాసాస్, గుడ్డుసొన వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.
2) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన తరువాత అన్ని కలిపిన చికెన్ ఒకొక్కటిగా వేసి ఫ్రె  చెయ్యాలి. అలా వేపిన చికెన్ ఒక ప్లేటులోకి తీసి పక్కన పెట్టాలి.
3) ఇప్పుడు మరో కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తరువాత  పెరుగు వేసి ఒకసారి కలిపి, వేయించిన చికెన్ ముక్కలు, మిగిలిన చిల్లీసాస్, సోయాసాస్, ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి పెరుగు యిగిరిపోయే వరకు కలుపుతూ వుంటే ఒక నిముషంలో రెడీ అవ్వుతుంది. ఇప్పుడు కొత్తిమీర జల్లి  స్టవ్ ఆపాలి.


* వీటిని ఒక ప్లేటులోకి తీసుకోని ఉల్లి చక్రాలతో అలంకరించి  సర్వ్ చేయడమే.


* అంతే  చికెన్ 65 రెడీ. 

1
వంటపేరు : గుడ్లు కొబ్బరి పొరటు


కావలసిన పదార్ధాలు : 


గుడ్లు : మూడు
కొబ్బరి తురుము : కప్పు 
ఉల్లి ముక్కలు : కప్పు
పచ్చిమిర్చి : నాలుగు
పోపుదినుసులు : టీ స్పూన్
కరివేపాకు : కొద్దిగా
కారం : టీ స్పూన్
ఉప్పు : సరిపడా
పసుపు : చిటికెడు
మసాలా : అర టీ స్పూన్
నూనె : రెండు టీ స్పూన్లు
పాలు : అర కప్పు


తయారుచేయు విధానం :


1) స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడిచేసి పోపుదినుసులు వేసి వేగాక, ఉల్లి, మిర్చి ముక్కలు వేసి వేపాలి.
2) ఉల్లిముక్కలు వేగాక కొబ్బరి తురుము, పాలు, ఉప్పు, కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి.
3) పాలు యిగిరిన తరువాత గుడ్లు పగుల కొట్టి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కారం, పసుపు, గరం మసాల వేసి చిన్న మంటమీద కలుపుతూ వుంటే కూర పొడిపొడిగా వుంటుంది.
4) స్టవ్ ఆపి కొత్తిమిర జల్లితే ఎంతోరుచిగా ఉండే గుడ్లు కొబ్బరి పొడి కూర రెడి.



1
వంటపేరు : అరటికాయ వేపుడు 


కావలసిన పదార్దములు :


అరటికాయలు : రెండు
పచ్చిమిర్చి : నాలుగు
పోపు దినుసులు : రెండు టీ స్పూన్లు 
(ఆవాలు ,జీలకర్ర ,మినపప్పు సెనగపప్పు )
ఎండిమిర్చి: రెండు
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : పావు టీ స్పూన్ 
ఉప్పు : తగినంత
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
నిమ్మరసం : టీ స్పూన్
అల్లంవెల్లుల్లి పేస్టూ : అర టీ స్పూన్
కొత్తిమిర : కొద్దిగా


తయారుచేయు విధానం :


1) అరటికాయల్నిఒక గిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి స్టవ్ మీద పెట్టి 
    ఉడకనివ్వాలి.
2) తరువాత వలిచి చిన్నచిన్న ముక్కలు ఉండేలా చిదపాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడి చెయ్యాలి.
4) నూనె కాగాక, పోపు దినుసులు వేసి వేగాక, ఎండిమిర్చి, కరివేపాకు వేసి 
    వేగాక, అల్లంవెల్లుల్లి, పచ్చి మిర్చి ముక్కలు వేసి వేగానివ్వాలి. 
5) పసుపు వేసి కలిపి, చిదిమిన అరటికాయపొడిని, ఉప్పు వేసి కలిపి ఒక 
    నిముషo మూతపెట్టి ఉంచాలి.
6) ఇప్పుడు స్టవ్ ఆపి, నిమ్మ రసం కలిపి కొత్తిమిర జల్లి వడ్డించాలి 


* అంతే అరటికాయ వేపుడు రెడి.
 (దినినినే అరటికాయ పొడికూర అని కుడా అనొచ్చు)

వంటపేరు : దొండకాయ ఉల్లికారం 


కావలసిన పదార్ధాలు :

దొండకాయలు : అరకేజీ 
ఉల్లిపాయలు : నాలుగు 
కారం : టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
జీలకర్ర : టీ స్పూన్ 
నూనె : రెండు టేబుల్ స్పూన్లు 
పసుపు : అర టీ స్పూన్ 

తయారుచేయు విధానం :

1) దొండకాయలు కడిగి రెండు చివర్లు కట్ చేసి ఒక వైపు చాకుతో 
    దొండకాయను నిలువుగా సగం కట్ చెయ్యాలి. అలాగే రెండో వైపుకుడా 
    నిలువుగా కట్ చెయ్యాలి అప్పుడే దొండకాయ విడిపోకుండా 
    గుత్తులావుంటుంది .
2) అలాగే అన్నిదొండకాయలు కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు కట్ చేసిన 
    దొండకాయలు ఒకగిన్నెలో వేసి కొంచెం ఉప్పు, కొద్దిగా నూనె వేసి కలిపి, 
    పావు కప్పు  నీళ్ళుపోసి చిన్నమంట మీద ఐదు నిముషాలు ఉడికింఛి 
    చల్లారనివ్వాలి.
3) ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసి మిక్సిలో కచ్చపచ్చగా మిక్సి చేసి 
    దీనిలో జీలకర్ర పొడి, కారం, ఉప్పు, పసుపు వేసి కలపాలి. 
4) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేసి వుడికిన దొండకాయలు వేసి 
    కాసేపు మూతపెట్టి ఉంచాలి. దొండకాయాల్లో నీళ్ళు ఇగిరి పోయాక 
    ఉల్లికారం ముద్ద వేసి కలపాలి. (మూత పెట్టగూడదు).
5) అలా కలుపుతూ వుంటే పది నిముషాల్లో కూర రెడి.



1
వంటపేరు : వంకాయ వేపుడు 


కావలసిన పదార్ధాలు :


వంకాయలు : పావుకేజీ (లేతవి )
అల్లం, పచ్చిమిర్చి పేస్టు : ఒక టీ స్పూన్
పసుపు : అర టీ స్పూన్
పోపు దినుసులు : టేబుల్ స్పూన్
వెల్లులి : నాలుగు రెబ్బలు
ఎండుమిర్చి : రెండు
కరివేపాకు : కొద్దిగా
నూనె : మూడు టేబుల్ స్పూన్లు
ఉప్పు : తగినంత


తయారుచేయు విధానం : 


1)  వంకాయలను నిలువుగా ముక్కలు కోసి నీళ్ళలో వేసి ఉంచాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక 
    పోపుదినుసులు వేసి వేపాలి. అవి వేగాక కరివేపాకు, ఎండిమిర్చి, వెల్లుల్లి 
    వేసి ఒకసారి కలిపి పచ్చిమిర్చి-అల్లం పేస్టూ, పసుపు వేసి కలిపి 
    వంకాయలు వేసి కలపాలి. 
3) చిన్న మంటమీద వేగనివ్వాలి. వంకాయ ముక్కలు మెత్తబడ్డాక ఉప్పు 
    వేసి కలపాలి. ఒకనిముషం వేగాక స్టవ్ ఆపాలి.


* అంతే వంకాయ వేపుడు రెడి.



కావలసిన పదార్దములు :


చిక్కుడు కాయలు : పావుకేజీ
పోపుదినుసులు : టేబుల్ స్పూన్
ఎండిమిర్చి: రెండు
వెల్లుల్లి : రెబ్బలు ఆరు
కారం : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
నూనె  : రెండు టేబుల్ స్పూన్లు
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : చిటికెడు
పచ్చిమిర్చి పేస్టు : 1 టీ స్పూన్


తయారుచేయు విధానం :


1) చిక్కుడు కాయలు ముక్కలుగా చేసి కడగాలి.
2) స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చెయ్యాలి.
3) నూనె కాగాక పోపుదినుసులు వేసి వేగాక, ఎండిమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి 
    వేసి వేగాక పసుపు వేసి కలిపి, చిక్కుడు ముక్కలు, పచ్చిమిర్చి పేస్టు వేసి 
    ఒకసారి కలిపి మూత పెట్టాలి.
4) చిన్న మంటమీద పది నిముషాలు వేగనివ్వాలి. మధ్యమధ్యలో 
    కలుపుతూ ఉండాలి.
5) ఆవిరికి చిక్కుడు ముక్కలు మెత్తబడతాయి. ఇప్పుడు మూత తీసి కారం, 
    ఉప్పువేసి కలిపి, రెండు నిముషాలు వేగనిచ్చి, తడి పోయాక స్టవ్ ఆపాలి. 
    (ఉప్పు, కారం వేసాక మూత పెట్టకూడదు)


* అంతే చిక్కుడుకాయల వేపుడు రెడి. 

1
వంటపేరు : 
          అరటికాయ, సెనగపప్పు కూర


కావలసిన పధార్ధాలు :


అరటికాయ : ఒకటి
సెనగపప్పు : వంద గ్రాములు
ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి : మూడు
పోపుదినుసులు : టేబుల్ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
వెల్లుల్లి : ఆరు రెబ్బలు
ఉప్పు : తగినంత
పసుపు : కొద్దిగా
కారం : టీ స్పూన్
నూనె : రెండు టేబుల్ స్పూన్లు


తయారుచేయు విధానం :


1) సెనగపప్పును పావుగంట నానబెట్టాలి. 
2) అరిటికాయను, ఉల్లిపాయను, పచ్చిమిర్చిని ముక్కలుగా కోసి 
    పక్కన వుంచాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడి చేసి పోపుదినుసులు, 
    వెల్లుల్లి, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగనివ్వాలి.
4) అవి వేగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వేపాలి. 
5) ఉల్లిముక్కలు వేగాక, అరటి ముక్కలు, సెనగపప్పు వేసి ఒకసారి బాగా 
    కలిపి మూతపెట్టాలి.
6) చిన్నమంత మీద (సింలో) పది నిముషాలు ఉడికిన తరువాత మూత తీసి 
    ఒకసారి కలిపి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి, కొద్దిగా నీళ్ళుపోసి కాసేపు 
    మూత పెట్టాలి. 
7) కూర పూర్తిగా ఉడికి నీళ్ళు మొత్తం యిగిరి, కూర పొడిపొడిగా అవుతుంది.
8) ఇప్పుడు మసాలాపొడి జల్లి, కొత్తిమిర వేసి స్టవ్ ఆపాలి.



1
వంటపేరు  : కాకరకాయ వేపుడు 


కావలసిన పదార్ధాలు :


కాకరకాయలు : పావుకేజీ
పోపుదినుసులు : రెండు టీ స్పూన్ లు
వెల్లుల్లి రెబ్బలు : ఆరు
కారం : టీ స్పూన్
ఉప్పు : సరిపడా
పసుపు : అర టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
నూనె : కప్పు


తయారుచేయు విధానం :


1) కాకరకాయలు ముక్కలుగా కోసి పసుపు, ఉప్పు వేసి బాగా కలిపి కొద్దిగా 
    నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి ఉడకబెట్టాలి.
2) ఐదు నిముషాలు ఉడికిన తరువాత దించి నీళ్లువుంటే వంచి 
    పక్కనపెట్టాలి.
3) ఇప్పుడు స్టవ్ మీద పాన్ పెట్టి, నూనె వేడి చేసి పోపుదినుసులు వేసి 
    వేగాక వెల్లుల్లి, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, కాకరకాయ ముక్కలు 
    వేసి కలపాలి.
4) ఐదు నిముషాలు వేగాక ఉప్పు, కారం వేసి బాగా కలపాలి.  
5) మరో ఐదునిముషాలు వేపి, కాకరకాయలు బాగావేగి, పొడిపొడిగా 
    అయ్యాక స్టవ్ ఆపాలి.


* అంతే కాకరకాయ వేపుడు రెడి.



Powered by Blogger.