Showing posts with label non-vegetarian-fry. Show all posts

కావలసిన పదార్దాలు 
చందువా చేపముక్కలు : అర కిలో 

పచ్చిమిర్చి : ఏడు 
ఉప్పు : తగినంత 
కొత్తిమీర : కట్ట 
పుదినా : కట్ట 
నిమ్మకాయ : ఒకటి 
కొబ్బరి తురుము  : అర కప్పు 
పసుపు : అర టీ స్పూన్ 
అరటి ఆకులు : తగినన్ని 
అల్లం : చిన్నముక్క 

తయారుచేయు విధానం : 

౧) చేపముక్కలు శుబ్రంగా కడిగి పసుపు,ఉప్పు,నిమ్మరసం పట్టించి పక్కనపెట్టాలి.
౨)పుదినా,కొత్తిమీర,కొబ్బరి, అల్లం, పచ్చిమిర్చి, ఉప్పు, నిమ్మరసం గ్రైండ్ చేసి దీనిని చేపముక్కలకు పట్టించాలి.
వీటిని పది నిముషాలు పక్కన పెట్టాలి.
౩) ఇప్పుడు ఒకొక్క ముక్కను అరిటాకులో చుట్టి ఉడిపోకుండాదారంతో కట్టాలి.
౪) అలా అన్ని చేసాక ఒక గిన్నెలో పెట్టి మూతపెట్టాలి.
ఇప్పుడు కుక్కర్లో నీళ్ళు పోసి దీనిలో చేపముక్కలు ఉన్న గిన్నె పెట్టి విజిల్ (వెయిట్ )పెట్టకుండా మూత పెట్టి పది నిముషాలు ఉడికించాలి.
౬) వేడి చల్లారిన తరువాత అరిటాకులోనుండి చేపముక్కలు తీసి ఒక ప్లేటులో పెట్టి సర్వ్ చెయ్యాలి. 

1

తందూరి చికెన్ :

కావలసిన పదార్దాలు :

చికెన్ : పావుకిలో
పెరుగు : అర కప్పు
అల్లం వెల్లుల్లి పేస్ట్ : టీ స్పూన్
కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత
గరం మసాల : అర టీ స్పూన్
నిమ్మకాయ : ఒకటి
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
చాట్ మసాల : అర టీ స్పూన్
పుదినా : చిన్న కట్ట
ఉల్లిముక్కలు : కప్పు


తాయారు చేయు విధానం :

1) చికెన్ కాస్త పెద్దవిగా కట్ చేసుకోవాలి.
2) పెరుగులో నిమ్మ రసం,  ఉప్పు, కారం, గరం మసాల ,అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా కలిపి చికెన్ ముక్కలకు పట్టించాలి.
3) ఒక గంట పక్కన పెట్టాలి.

4) గంట తరువాత నానిన చికెన్ ముక్కలను పది నిమిషాలు గ్రిల్ (కాల్చాలి.)చేయాలి.
5) ముక్కలు బయటకు తిసి నూనె రాసి మళ్లీ  పది నిమిషాలు గ్రిల్ చేసుకోవాలి.
6) చివరిగా చాట్ మసాల ,పుదినా ,ఉల్లి ముక్కలు తో సర్వ్ చేయాలి

1

కావలసిన పదార్దాలు:

రొయ్యలు : పన్నెండు(పెద్దవి)
కొబ్బరి తురుము : కప్పు
బ్రెడ్ ముక్కలు : ఐదు
గుడ్లు : నాలుగు
మిరియలపొడి : టీ స్పూన్
ఉప్పు : తగినంత
నూనె : వేయించ టానికి సరిపడ
ఉల్లి ముక్కలు : పావు కప్పు 

తయారు చేయు విధానం:

1) రొయ్యలు తోకలు అలాగే ఉంచి ఫై పొలుసు వలిచి, బాగా కడిగి ఉంచుకోవాలి.
2) బ్రెడ్ స్లయిసేస్ చిదిమి వీటికి కొబ్బరితురుము కలపాలి.
3) గుడ్లు పగుల గొట్టి దీనిలో మిరియాలపొడి కలపాలి.
4) ఇప్పుడు స్టవ్ వెలిగించి  నూనె వేడి చేయ్యాలి.ఉల్లి ముక్కలు వేయించి తియ్యాలి.
5)  ఇప్పుడు రొయ్యలు ఒకొక్కటిగా గుడ్లు సోనలో ముంచి తరువాత బ్రెడ్, కొబ్బరి మిశ్రమంలో దొర్లించి కాగుతున్న నూనెలో వేసి రెండు  ప్రక్కలా దోరగా వేయించాలి.వీటికి వేయించిన ఉల్లి ముక్కలు కలపాలి.
6) ఇవి అన్నంలో తినొచ్చు,లేదా సాయింత్రాలు స్నాక్సలా తినొచ్చు .

కావలసిన పదార్ధాలు :


మటన్ కీమా : పావుకేజీ 
ఓట్సు : రెండు టేబుల్ స్పూన్లు 
బియ్యప్పిండి : రెండు టేబుల్ స్పూన్లు 
ఉప్పు : తగినంత 
కారం : ఒక టేబుల్ స్పూన్ 
కొత్తిమీర, పుదినా పేస్టు : టేబుల్ స్పూన్ 
పచ్చిబటాణి పేస్టు : టేబుల్ స్పూన్ 
పెరుగు : రెండు టేబుల్ స్పూన్లు 
అల్లం-వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 


తయారు చేయు విధానం:


1) కీమాలో చిటికెడు ఉప్పు, అల్లం పేస్టు కొద్దిగా వేసి ఉడికించాలి. 
2) ఉడికించిన కీమా మిక్సిపట్టాలి. దీనిలో కారం, ఉప్పు, పెరుగు, అల్లం వెల్లులి పేస్టు, కొత్తిమీర పేస్టు, ఓట్సు, బటాని పేస్టు కలపాలి.
3) వీటిని చిన్నచిన్న ముద్దలుగా తీసుకోని అరచేతీలో చిన్నగా వత్తి బియ్యప్పిండిలో అద్ది నాన్ స్టిక్ పాన్ మీద కొద్దిగా నూనెవేసి రెండుప్రక్కలా బాగావేయించాలి.

1
వంటపేరు : మషాల పీతల వేపుడు 

కావలసిన పదార్దములు :

పీతలు : అరకిలో
టమాటాలు : రెండు 
కొబ్బరి ముక్కలు : కప్పు 
గసగసాలు : రెండు టీ స్పూన్లు (నానబెట్టాలి )
కారం : రెండు టీ స్పూన్లు 
ఉప్పు : సరిపడా 
నూనె : కప్పు 
కొత్తిమీర : చిన్న కట్ట 
మషాల : అర టీ స్పూన్ 
దనియాలు : టీ స్పూన్  
జీలకర్ర : టీ స్పూన్ 
పచ్చిమిర్చి : మూడు 
మిరియాలు : పావు టీ స్పూన్ 
పసుపు : పావు టీ స్పూన్ 
కరివేపాకు : రెండు రెమ్మలు 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 

తయారుచేయు విధానం :

1) పీతలు శుబ్రం చేసి కొద్దిగా ఉప్పు, పసుపు వేసి ఉ డికించి పక్కన పెట్టాలి.
2) మిక్సి జార్లో నానబెట్టిన గసాలు, ధనియాలు, మిరియాలు, జీలకర్ర వేసి మెత్తగా అయ్యేలా మిక్స్ చెయ్యాలి.
3) తరువాత దానిలోనే కారం, ఉప్పు, మిర్చి, కొబ్బరిముక్కలు, టమాటాలు, అల్లం వెల్లుల్లి పేస్తూ, గరంమషాల వేసి కొద్దిగా నీళ్ళు పోసి మెత్తగా రుబ్బాలి.
4) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేయాలి. కాగాక కరివేపాకు వేసి వేగాక  రుబ్బిన మషాల ముద్ద వేసి గరిటతో కలుపుతూ మంచి వాసనవచ్చే వరకు వేయించాలి.
5) ఇప్పుడు ఉడికించిన పీతలు వేసి చిన్నమంటమీద వేయించాలి. చక్కటి వాసన వచ్చే వరకు వేయించి కొత్తిమీర జల్లి ఒకసారి కలిపి స్టవ్ ఆపాలి.


అంతే మసాలా పీతల వేపుడు రెడీ. 

1
రొయ్యల వేపుడు

కావలసిన పదర్దామలు :

రొయ్యలు : అరకిలో
నూనె వేయించటానికి సరిపడా 
నువ్వులు : అర కప్పు 
కొత్తిమీర (కట్ చేసినది) : అర కప్పు  
టమాట సాస్ : 2 టేబుల్ స్పూన్లు 
బియ్యపిండి : 2 టేబుల్ స్పూన్ 
కార్న్ ఫ్లొర్ : 1 టేబుల్ స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్టు : 1 టీ స్పూన్ 
మిరియాలపొడి : పావు టీ స్పూన్ 
కారం : టీ స్పూన్ 
అజినమోటో : పావు టీ స్పూన్ 
ఉప్పు : సరిపడా 

తయారుచేయు విధానం :

1) రొయ్యలు శుభ్రం చేసి పసుపు, చిటికెడు ఉప్పు వేసి స్టవ్ మీద నీరంతా పోయేవరకు ఉడికించి ఉంచాలి.
2) ఇప్పుడు ఈ రొయ్యల్లో నూనె తప్పించి మిగిలిన పైన చెప్పినవన్నీ కలిపి పావుగంట పక్కన పెట్టాలి.
3) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. కాగిన తరువాత సిద్దం చేసిన రొయ్యల్ని వేసి దోరగా వేయించి ప్లేటులోకి తియ్యాలి. వీటిమీద కొత్తిమీర జల్లి సర్వ్ చేయాలి.
* ఎంతో రుచిగా ఉండే రొయ్యల వేపుడు రెడీ.

వంటపేరు :చికెన్ 65


కావలసిన పదార్దములు 


చికెన్ : అర కిలో 
పెరుగు : మూడు టేబుల్ స్పూన్లు 
కారం : టీ స్పూన్ 
పసుపు : అర టీ స్పూన్ 
ఉప్పు : సరిపడా 
సోయాసాస్ : రెండు టీ స్పూన్లు   
చిల్లీసాస్ : రెండు టీ స్పూన్లు 
ధనియాలపొడి : రెండు టీ స్పూన్లు  
గరం మసాలా : టీ స్పూన్ 
అజినమోటో : కొద్దిగా  
కాన్ ఫ్లొర్ : టీ స్పూన్లు 
మైదా : రెండు టేబుల్ స్పూన్లు 
కోడిగుడ్డు : ఒకటి 
కొత్తిమీర : చిన్నకట్ట 
పచ్చిమిర్చి : నాలుగు  
వెల్లుల్లి రెబ్బలు : ఆరు 
నూనె : అరకిలో  
ఉల్లిపాయ : ఒకటి చక్రాలాకట్ చెయ్యాలి  


తయారు చేయు విధానం :


1) ముందుగాఒక గిన్నెలో చికెన్ వేసుకొని దానిలో ధనియాలపొడి, కారం, ఉప్పు, పసుపు, గరం మసాల, అజినమోటో, కాన్ ఫ్లోర్ , మైదా, ఒక స్పూన్ చిల్లిసాస్, ఒకస్పూన్ సోయాసాస్, గుడ్డుసొన వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.
2) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన తరువాత అన్ని కలిపిన చికెన్ ఒకొక్కటిగా వేసి ఫ్రె  చెయ్యాలి. అలా వేపిన చికెన్ ఒక ప్లేటులోకి తీసి పక్కన పెట్టాలి.
3) ఇప్పుడు మరో కళాయి పెట్టి రెండు టేబుల్ స్పూన్ల నూనె వేసి వెల్లుల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగిన తరువాత  పెరుగు వేసి ఒకసారి కలిపి, వేయించిన చికెన్ ముక్కలు, మిగిలిన చిల్లీసాస్, సోయాసాస్, ఉప్పు, కొత్తిమీర వేసి కలిపి పెరుగు యిగిరిపోయే వరకు కలుపుతూ వుంటే ఒక నిముషంలో రెడీ అవ్వుతుంది. ఇప్పుడు కొత్తిమీర జల్లి  స్టవ్ ఆపాలి.


* వీటిని ఒక ప్లేటులోకి తీసుకోని ఉల్లి చక్రాలతో అలంకరించి  సర్వ్ చేయడమే.


* అంతే  చికెన్ 65 రెడీ. 

1
వంటపేరు : గుడ్లు కొబ్బరి పొరటు


కావలసిన పదార్ధాలు : 


గుడ్లు : మూడు
కొబ్బరి తురుము : కప్పు 
ఉల్లి ముక్కలు : కప్పు
పచ్చిమిర్చి : నాలుగు
పోపుదినుసులు : టీ స్పూన్
కరివేపాకు : కొద్దిగా
కారం : టీ స్పూన్
ఉప్పు : సరిపడా
పసుపు : చిటికెడు
మసాలా : అర టీ స్పూన్
నూనె : రెండు టీ స్పూన్లు
పాలు : అర కప్పు


తయారుచేయు విధానం :


1) స్టవ్ వెలిగించి కళాయిలో నూనె వేడిచేసి పోపుదినుసులు వేసి వేగాక, ఉల్లి, మిర్చి ముక్కలు వేసి వేపాలి.
2) ఉల్లిముక్కలు వేగాక కొబ్బరి తురుము, పాలు, ఉప్పు, కరివేపాకు వేసి కాసేపు వేగనివ్వాలి.
3) పాలు యిగిరిన తరువాత గుడ్లు పగుల కొట్టి వేసి బాగా కలపాలి. ఇప్పుడు కారం, పసుపు, గరం మసాల వేసి చిన్న మంటమీద కలుపుతూ వుంటే కూర పొడిపొడిగా వుంటుంది.
4) స్టవ్ ఆపి కొత్తిమిర జల్లితే ఎంతోరుచిగా ఉండే గుడ్లు కొబ్బరి పొడి కూర రెడి.



కావలసిన పదార్ధాలు :

చికెన్ లెగ్స్ : ఆరు
అల్లం-వెల్లుల్లి పేస్టు : 2 టి. స్పూన్లు
వరిపిండి : 2 టేబుల్ స్పూన్లు
మిరియాలపొడి : 1 టి స్పూన్
ఉప్పు : తగినంత
కారం : 1 టేబుల్ స్పూన్
నూనె : పావుకిలో
గరం మసాల : 1 టి.స్పూన్
దనియాల పొడి : 1 టి.స్పూన్
పెరుగు : 2 టేబుల్ స్పూన్లు
పసుపు : 1 టి స్పూన్
సెనగపిండి : 1 టేబుల్ స్పూన్

తయారుచేయు విధానం :

అల్లంవెల్లుల్లి, కారం, ఉప్పు, పసుపు, మిరియాలపొడి, పెరుగు, సెనగపిండి, వరిపిండి, గరం మసాల, ధనియాల పొడి, అన్నీ కలిపి మిశ్రమంలా తయారుచేయాలి. చికెన్ లెగ్స్ కి చాకుతో ఘాట్లు పెట్టి, సిద్డంచేసుకున్న మిశ్రమాన్ని పట్టించి గంట పక్కనపెట్టాలి. ఇప్పుడు స్టవ్ పై కళాయిపెట్టి నూనె వేడిచేయ్యాలి. మసాలతో వున్న చికెన్ లెగ్స్ని కాగిననూనెలో వేసి బాగా వేపి తియ్యాలి. వీటిని నిమ్మకాయ ముక్కలుతో ఉల్లి ముక్కలతో అలంకరించాలి. అంతే చికెన్ లెగ్స్ వేపుడు రెడి.

కావలసిన పదార్ధాలు :

చేపముక్కలు : అర కేజీ
కారం : రెండు టేబుల్ స్పూన్లు
అల్లం-వెల్లుల్లి ముద్ద : ఒక స్పూన్
ఉప్పు : సరిపడా
పసుపు : 1 టీ.స్పూన్
నిమ్మకాయ : ఒకటి
కొత్తిమిర : 1 కట్ట
గరం మసాల : 1 టి.స్పూన్
నూనె : పావు కేజీ


తయారుచేయు విధానం :

చేపముక్కలు బాగా కడిగి నీరు లేకుండా చేసి, వీటిలో కారం, పసుపు, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, నిమ్మరసం కలిపి అరగంట పక్కన పెట్టాలి. తరువాత స్టవ్ వెలిగించి బాండిపెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన తరువాత చేపముక్కలు ఒకొక్కటిగా కాగిన నూనెలో వేసి బాగా వేగిన తరువాత మిగిలిన నూనెను వేరే గిన్నెలోకి వంచి, మరల ఇప్పుడు వేపిన ముక్కలన్నీ  బాండిలో వేసి గరంమసాల కలిపి కొత్తిమిర జల్లాలి. అంతే చేపల వేపుడు రెడి.

కావలసిన పదార్ధాలు :

చికెన్ : అరకేజీ
చిన్నచిన ముక్కలుగా చెయ్యాలి
అల్లం, వెల్లుల్లి : ఒక టేబుల్ స్పూన్
పెరుగు : 1  కప్పు
నిమ్మరసం : 1  టి.స్పూన్
 వెనిగర్ : 1  టి.స్పూన్
ఉప్పు : సరిపడా
గరం మసాల : 1  టి.స్పున్
కొత్తిమిర : కొద్దిగా
నూనె : అరకేజీ
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : ఆరు
సెనగపిండి : పావుకేజీ

తయారుచేయు విధానం :

శుభ్రం చేసిన చికెన్ లో ఉప్పు, పెరుగు, మసాల, అల్లంవెల్లుల్లి ముద్ద, వెనిగర్, నిమ్మరసం, కొద్దిగా నూనే కలిపి గంట పక్కనపెట్టాలి. ఇప్పుడు సెనగపిండిలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కొద్దిగా నీళ్ళుపోసి కలిపి అరగంట గడిచిన తరువాత, పక్కన పెట్టిన చికెన్లో కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిలో నూనె పోసి కాగనివ్వాలి, నూనె వేడిఅయ్యాక చికెన్ కలిపిన  పిండిని పకోడిలా నూనెలో వేసి ఎర్రగా వేపి ఒక ప్లేటులోతియ్యలి. అంతే చికెన్ పకోడీ తయార్.

కావలసిన పదార్ధాలు :

చికెన్ : అరకేజీ 
మెంతియాకు : 1 కట్ట 
(ఆకులుకోసి కడిగి, నీరు లేకుండా శుభ్రంగా చేసి పక్కనపెట్టాలి)
అల్లం వెల్లుల్లి ముద్ద : రెండు చెంచాలు
కారం : మూడు చేమ్చాలు 
ఉప్పు : సరిపడా 
గరం మసాల : 1 చెమ్చా
దనియల పొడి : 1 చెమ్చా 
కొత్తిమిర : 1 కట్ట 

తయారు చేయు విధానం :

చికెన్ కడిగి నీరువంచి పక్కన పెట్టాలి. ఇప్పుడు కారం, ఉప్పు, అల్లం వెల్లుల్లి ముద్ద, ధనియాల పొడి, కొత్తిమిర అన్ని చికెన్లో కలిపి అరగంట పక్కన పెట్టాలి.

ఇప్పుడు స్టవ్ వెలిగించి పాన్ పెట్టి నూనె పోసి కాగనివ్వాలి, నూనె కాగిన తరువాత అన్నీ కలిపిన చికెన్ వేసి వేగనివ్వాలి. మధ్య మధ్యలో కలుపుతూ వుండాలి, అలా చికెన్ బాగా వేగి నీరంతా ఇగిరిపోయాక మెంతాకు వేసి కలపాలి. రెండు నిముషాలకు పొడిపొడిగా అవుతుంది. ఇప్పుడు గరం మసాలా జల్లి స్టౌ ఆపాలి, అంతే గుమ గుమలాడే మెంతాకు చికెన్ ఫ్రై రెడి.

Powered by Blogger.