కావలసిన పదార్దాలు :
గుడ్లు : ఆరు
పచ్చిజీడిపప్పు : కప్పు
ఉల్లిపాయలు : మూడు
ఉల్లిపాయలు : మూడు
పచ్చిమిర్చి : మూడు
కారం : టీ స్పూన్
ఉప్పు : తగినంత
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్
గరం మసాలా : అర టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : పావు టీ స్పూన్
నూనె : మూడు టేబుల్ స్పూన్లు
కొత్తిమీర : కొద్దిగా
టమాటాలు : రెండు
తయారుచేయు విధానం :
1) గుడ్లు వలిచి పక్కన పెట్టాలి. ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలుగా కట్ చెయ్యాలి. పచ్చిజీడిపిక్కలు రెండుగా కోసి దాని నుండి జీడిపప్పును తీసుకోవాలి. ఫై పొర వలిచి కడిగి పక్కన పెట్టాలి.
2) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడిచెయ్యాలి. నూనె కాగాక గుడ్లుకి అక్కడక్కడ గాట్లుపెట్టి వేయించి తియ్యాలి.
3) అదే నూనెలో ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేయించాలి. తరువాత అల్లం వేల్లుల్లి పేస్టు వేసి వేగిన తరువాత టమాటముక్కలు వేసి ఒకనిముషం మూతపెట్టాలి.
4) ఇప్పుడు మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి కొద్దిగా నీళ్ళు పోసి మూతపెట్టి ఐదునిముషాలు ఉడకనివ్వాలి. ఇప్పుడు వేయించిన గుడ్లు, జీడిపప్పు వేసి మరో ఐదునిముషాలు ఉడకనిచ్చి మసాలా, కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆపాలి.