గాజర్ తురుము : కప్పు
నూనె : టేబుల్ స్పూన్
పోపు దినుసులు : టీ స్పూన్
ఎండు మిర్చి: రెండు
కరివేపాకు : రెండు రెమ్మలు
కారం : అర టీ స్పూన్
ఉప్పు : తగినంత
జీలకర్ర : అర టీ స్పూన్
వెల్లుల్లి రెబ్బలు : నాలుగు
పసుపు : చిటికెడు
తయారుచేయు విధానం:
స్టవ్ వెలిగించి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లి రెబ్బలు, జీలకర్ర, వేసి వేగాక పచ్చిమిర్చిముక్కలు, ఉల్లిముక్కలు, వేసి వేగనిచ్చి గాజర్ తురుము వేసి కాసేపు బాగా కలపాలి .
గాజర్ తురుము వేగిన తరువాత పసుపు, కారం, ఉప్పు వేసి కలపాలి. ఐదు నిముషాలు వేయించి, కొత్తిమీర జల్లి ఒక సారి కలిపి స్టవ్ ఆపాలి.
అంతే గాజర్ వేపుడు రెడి .