మిల్ మేకర్ కీమాకర్రీ (Meal-Maker Keema Curry in Telugu)

కావలసిన పదార్దాలు : 


మిల్ మేకర్ : పదిహేను  
కొబ్బరి పొడి : రెండు టీ స్పూన్ లు 
జీలకర్ర పొడి : టీ స్పూన్ 
గరం మసాలా : అర టీ స్పూన్ 
కారం : రెండు టీ స్పూన్లు 
ఉప్పు : తగినంత 
గసాలు : టీ స్పూన్ 
దనియాల పొడి : టీ స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 
పసుపు : అర టీ స్పూన్ 
ఉల్లి పాయలు : రెండు 
టమాటాలు : మూడు 
పచ్చిమిర్చి : నాలుగు 
కొత్తిమీర : టేబుల్ స్పూన్ 
జీలకర్ర : అర టీ స్పూన్ 
నూనె :పావు కప్పు 
జీడిపప్పులు : పది 


తయారుచేయు విధానం :


1) మిల్ మేకర్ ని వేడినీళ్ళల్లో వేసి ఒక నిముషం తరువాత నీళ్ళు పిండి కీమా కట్ చేసి పక్కన పెట్టాలి.
2) జీడిపప్పు, గసాలు, కొబ్బరి కలిపి పేస్టు చేసుకోవాలి.
3) స్టవ్ మీద కళాయిపెట్టి నూనెవేసి కాగాక జీలకర్ర, కరివేపాకు వేసి వేగాక ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చిముక్కలు వేసి వేగాక అల్లంవెల్లుల్లి పేస్టు, పసుపు వేసి వేయించాలి.
4) ఇప్పుడు టమాటాలు వేసి కాసేపు మగ్గనివ్వాలి. టమాటాలు మెత్తబడ్డాక  కొబ్బరి పేస్టు వేసి కాసేపు వేయించి తరువాత జీలకర్ర పొడి, ధనియాలపొడి, కారం, ఉప్పు వేసి కొద్దిగా నీళ్ళుపోసి రెండునిముషాలు ఉడికించాలి.
5) ఇప్పుడు మిల్ మేకర్ కీమా, నెయ్యి వేసి రెండునిముషాలు ఉడికించి గరంమసాలా, కొత్తిమీర చల్లి మూతపెట్టి స్టవ్ ఆపాలి.