కావలసినపదార్దాలు :
ఓట్స్ : పావుకప్పు
క్యారెట్ ముక్కలు : కప్పు
ఉల్లి ముక్కలు : పావు కప్పు
ఉప్పు : తగినంత
మిరియాల పొడి : చిటికెడు
కొత్తిమీర : కొద్దిగా
వెన్న : టీ స్పూన్
తయారుచేయు విధానం:
1) ఒకగిన్నేలో ఉల్లిముక్కలు, క్యారెట్ ముక్కలు వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి స్టవ్ మీద పెట్టి మెత్తగా వుడికించాలి.
2) ఇప్పుడు వీటిని చల్లారనిచ్చి మిక్సి జార్లో వేసి గ్రైండ్ చేసి వడకట్టుకోవాలి.
3) ఇప్పుడు పాన్ పై వెన్న వేడిచేసి ఓట్స్ దోరగా వేయించి, వేగాక వీటిలో కప్పు నీళ్ళు పోసి రెండునిముషాలు ఉడికించుకోవాలి.
4) ఓట్స్ ఉడికిన తరువాత ముందు ఉడికించుకున్న క్యారెట్ రసం, మిరియాలపొడి, ఉప్పు వేసి చిక్కబడేవరకు ఉడికించి స్టవ్ ఆపాలి.
5) సర్వ్ చేసే ముందు కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చెయ్యాలి.