Showing posts with label rasam-items. Show all posts

కావలసిన పధార్దాలు :


ములక్కాడలు : మూడు  
టమాటాలు : రెండు  
చింతపండు : నిమ్మకాయంత 
పసుపు : పావు టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
మిరియాల పొడి : అర టీ స్పూన్ 
ఎండుమిర్చి : రెండు 
పోపుదినుసులు : అర టీ స్పూన్ 
కరివేపాకు : రెండు రెమ్మలు 
కొత్తిమీర : కొద్దిగా  
రసం పొడి : టీ స్పూన్ 
నూనె : రెండు టీ స్పూన్లు 


తయారుచేయు విధానం :


1) చింతపండు నీటిలో నానబెట్టాలి. టమాటాలు, ములక్కాడలు  ముక్కలుగా కట్ చేయ్యాలి.
2) ములక్కాడముక్కలు, కొద్దిగా నీళ్ళు పోసి ఒకనిముషం ఉడికించాలి. అలాగే టమాటాలు ఉడికించాలి.
3) ఇప్పుడు నానిన చింతపండు గుజ్జులాచెయ్యాలి.
4) ఇప్పుడు నీళ్ళు స్టవ్ మీదపెట్టి మరిగించాలి. మరుగుతున్న నీళ్ళల్లో ఉడికించిన టమాట, ములక్కాడలు, ఉప్పు, చింతపండుగుజ్జు, పసుపు, కరివేపాకు, మిరియాలపొడి, రసంపొడి వేసి ఐదునిముషాలు మరిగించాలి.
5) ఇప్పుడు స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచేసి పోపుదినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగిన తరువాత ఈ తాలింపు మరిగిన ములక్కాడల రసంలో వేసి కొత్తిమీర కూడా వేసి మూతపెట్టి స్టవ్ ఆపాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే ములక్కాడలరసం రెడీ.

కావలసినపధర్దాలు :


ఉలవలు : కప్పు
చింతపండు రసం : కప్పు
ఉల్లిపాయలు : రెండు 
టమాటాలు : రెండు 
ఉప్పు : తగినంత
కారం : టీ స్పూన్ 
పచ్చిమిర్చి : నాలుగు 
పసుపు : పావు టీ స్పూన్ 
ధనియాల పొడి : టీ స్పూన్ 
కొత్తిమీర తరుగు : కొద్దిగా 
కరివేపాకు : రెండు రెమ్మలు 
పోపు దినుసులు : టేబుల్ స్పూన్ 
వెల్లుల్లి : ఐదు రేకలు 
ఎండుమిర్చి : మూడు 
జీలకర్ర : టీ స్పూన్ 
నూనె : మూడు టేబుల్ స్పూన్లు 


తయారుచేయు విధానం :

1) ముందు రోజు రాత్రి ఉలవలు నానబెట్టాలి.
2) ఉదయమే నానిన ఉలవలు కడిగి కుక్కర్లో మెత్తగా ఉడికించి మెత్తగా చేసి పక్కన పెట్టాలి. 
3) ఉల్లి, పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
4) స్టవ్ మీద గిన్నెపెట్టి నూనె వేడిచేసి పోపుదినుసులు, ఎండుమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు, జీలకర్ర వేసి వేగిన తరువాత ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు ఒకదాని తరువాత ఒకటి వేసి మగ్గనివ్వాలి.
5) ఇప్పుడు మెత్తగా చేసిన ఉలవపప్పులో చింతపండురసం వేసి కలిపి దీనిని తాలింపులో వేసి రెండుకప్పుల నీళ్ళు వేసి ఉప్పు, కారం, పసుపు, ధనియాలపొడి వేసి మరిగించాలి.
6) దించేముందు కొత్తిమీర తరుగు వేసి మూతపెట్టి స్టవ్ ఆపాలి.

వంటపేరు : మసాల మజ్జిగ 


కావలసిన పదార్ధాలు :


పెరుగు : ఒక,గ్లాసు .
పచ్చిమిర్చి : ముక్కలు టీ స్పూన్
ఉప్పు : తగినంత
అల్లం ముక్కలు : టీ స్పూన్
కొత్తిమిర తురుము : టీ స్పూన్
లేత కరివేపాకు ముక్కలు : కొద్దిగా
జీలకర్ర పొడి : చిటికెడు
శొంటిపొడి : చిటికెడు


తయారుచేయు విధానం 


1) పెరుగును మెత్తగా చిలికి నీళ్ళువేసి మజ్జిగాలా చెయ్యాలి.
2) దానిలో మిర్చి ముక్కలు, అల్లం ముక్కలు, కొత్తిమిర తురుము, కరివేపాకు 
    ముక్కలు, జీరా పొడి, శొంటి పొడి, ఉప్పు వేసి గరిటతో బాగా కలపాలి.  
3) పావుగంట తరువాత త్రాగితే చాలా బాగుంటుంది.


* ఇది ఆరోగ్యానికి చాలా మంచిది.
* అంతే మసాల మజ్జిగ రెడి.



1
వంటపేరు : ఆనబకాయ దప్పళం 


కావలసిన పదార్ధాలు :


ఆనబకాయ : ఒకటి (చిన్నది )
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి: నాలుగు
ఉప్పు: తగినంత
కారం : 1 టీ స్పూన్
బెల్లం : వంద గ్రాములు
చింతపండు : వందగ్రాములు
కొత్తిమిర : కొద్దిగా
కరివేపాకు : రెండు రెమ్మలు
పోపుదినుసులు : 1 టేబుల్ స్పూన్
ఎండిమిర్చి : రెండు
పసుపు : అర టీ స్పూన్


తయారుచేయు విధానం :


1) ఆనబకాయను పెద్దముక్కలుగా కొయ్యాలి
2) ఒక గిన్నెలో ఆనబముక్కలు, ఉల్లి, మిర్చిముక్కలు, కారం, ఉప్పు, 
    పసుపు, కొంచెం కొత్తిమిర, బెల్లం వేసి బాగా కలిపి ముక్కలు మునిగేలా 
    నీళ్లుపోసి మూత పెట్టి  స్టవ్ పై ఉడకనివ్వాలి.
3) పది నిముషాలు ఉడికిన తరువాత మూత తీసి, చింతపండు రసం 
    పొయ్యాలి. మరో పది నిముషాలు ఉడికించాలి
4) తరువాత దించి, అదే స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచేసి పోపు 
    దినుసులు వేసి వేగాక, ఎండి మిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగాక, 
    ఉడికిన ఆనబకాయ దప్పళం, తాలింపులో వేసి మిగిలిన కొత్తిమిర జల్లి 
    మూత పెట్టాలి.


* అంతే ఆనబకాయ దప్పళం రెడి.



వంటపేరు : చింతపండు చారు (రసం)


కావలసిన పదార్దములు :


చింతపండు : నిమ్మకాయంత
టమాట : ఒకటి
ఉప్పు: తగినంత
మిరియాలపొడి : అర టీ స్పూన్
పసుపు : అర టీ స్పూన్
కొత్తిమిర : కొద్దిగా 
నూనె : టేబుల్ స్పూన్
పోపుదినుసులు : టేబుల్ స్పూన్
(జీలకర్ర ,ఆవాలు ,మినపప్పు, మెంతులు ,సెనగపప్పు )
ఎండిమిర్చి : రెండు
వెల్లుల్లి : మూడు రెబ్బలు
కరివేపాకు : రెండు రెమ్మలు


తయారుచేయు విధానం :


1) రెండు గ్లాసులు మంచినీళ్ళు తీసుకోని వాటిలో చింతపండు, టమాట 
    ముక్కలు, ఉప్పు, మిరియాలపొడి, పసుపు, కొత్తిమిర వేసి బాగాకలిపి స్టవ్ 
    మీద పెట్టి మరిగించాలి.
2) పది నిముషాలు మరిగాక దించి పక్కనపెట్టాలి.
3) ఇప్పుడు అదే  స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచేసి పోపుదినుసులు 
     వేసి వేగనివ్వాలి.
4) అవి వేగాక ఎండిమిర్చి, వెల్లుల్లి, కరివేపాకు వేసి వేగాక, మరిగించిన చారు 
    లో వున్న చింతపండుపిప్పు, టమాట ముక్కలు తీసివేసి, పోపులో వేసి  
    మూతపెట్టి స్టవ్ ఆపాలి.



వంటపేరు : మజ్జిగచారు


కావలసిన పదార్ధాలు :


పుల్లటి మజ్జిగ : పావు లీటరు (గ్లాసుడు )
పోపుదినుసులు : టేబుల్ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
ఎండిమిర్చి: రెండు
వెల్లుల్లి : నాలుగు రెమ్మలు
పసుపు : అర టీ స్పూన్
పచ్చిమిర్చి పేస్టూ : టీ స్పూన్
ఉల్లి ముక్కలు : కప్పు
నూనె : టేబుల్ స్పూన్
కొత్తిమిర : కొద్దిగా


తయారుచేయు విధానం :


1) మజ్జిగలో పచ్చిమిర్చి పేస్టూ, పసుపు, కొత్తిమిర వేసి కలిపి పక్కనపెట్టాలి. 2) ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెలో నూనె వేడి చెయ్యాలి. 
3) నూనే కాగాక, పోపుదినుసులు వేసి వేగాక, వెల్లుల్లి, ఎండి మిర్చి వేసి 
    వేగాక, కరివేపాకు, ఉల్లి ముక్కలు కూడా  వేసి మజ్జిగ తాలింపు వెయ్యాలి.
4) ఇప్పుడు ఉప్పు కలిపి స్టవ్ ఆపాలి.


* అంతే మజ్జిగ చారు రెడీ.



వంటపేరు : పచ్చిపులుసు




కావలసిన పదార్ధాలు :


ఎండిమిర్చి : పది
ఉప్పు : సరిపడా
చింతపండు : నిమ్మకాయంత
ఉల్లిపాయలు : రెండు
వంకాయ : ఒకటి(కాల్చాలి )
నూనె : 1 టేబుల్ స్పూన్




తయారుచేయు విధానం :


1) స్టవ్ వెలిగించి, నూనె వేడిచేసి, ఎండుమిర్చి వేసి వేపాలి. వేగాక స్టవ్ 
    ఆపాలి.
2) ఇప్పుడు చింతపండు రసం తీసుకోని ఉంచాలి. ఒక గిన్నెలో మిర్చి, ఉప్పు 
    కలిపి, మెత్తగా పొడిచేసి, చింతపండు రసం వేసి కలపాలి. 
3) ఇప్పుడు వంకాయ వేసి బాగా కలిపి, ఉల్లిపాయ ముక్కలు వేసి కలపటమే.


* అంతే పచ్చిపులుసు రెడి.



వంటపేరు : సాంబారు


కావలసిన పదార్ధాలు :


కందిపప్పు : పావుకేజీ
చింతపండు : 100g
టమాటాముక్కలు : కప్పు
బెండకాయముక్కలు : కప్పు
వంకాయముక్కలు : కప్పు (నిలువుగా కొయ్యాలి )
దోసకా య ముక్కలు : అరకప్పు
ములక్కడాముక్కలు : ఆరు
ఉల్లిముక్కలు : అరకప్పు (పెద్దవి కొయ్యాలి)
అనబకాయ ముక్కలు : ఆరు (పెద్దవి  కొయ్యాలి )
కారం : టేబుల్ స్పూన్
ఉప్పు : సరిపడ
సాంబారు పోడి : టేబుల్ స్పూన్
పచ్చిమిర్చి : ఆరు (నిలువుగా కట్ చ్చేయ్యాలి)
కొబ్బరి ,వెల్లుల్లి, జీలకర్ర కలిపిన  ముద్ద : 1 టేబుల్ స్పూన్  (ఇష్టమైతే బెల్లం చిన్నముక్క )
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర : ఒక కట్ట
పసుపు : అర  టీ స్పూన్
తాలింపుకి పోపుదినుసులు, ఎండిమిర్చి, కరివేపాకు




తయారుచేయు విధానం :


1) పప్పు కుక్కర్లో వేసి నీళ్ళుపోసి ఆరు విజిల్సు రానివ్వాలి.
2) ఇప్పుడు కూరగాయ ముక్కలన్నీ వేరే గిన్నెలో వేసి కొద్దిగా నీళ్ళుపోసి 
    ఉడకనివ్వాలి.
3) ఇప్పుడు పసుపు, కారం, పచ్చిమిర్చి, ఉల్లిముక్కలు, కొబ్బరి, వెల్లుల్లి, జీరా  
    పేస్టూ, బెల్లం, కొత్తిమిర కొద్దిగా వేసి, మెత్తగా వుడికిన పప్పు కూడా వేసి 
    కలిపి, చింతపండు పులుసు వేసి పది నిముషాలు మరగబెట్టాలి.
4) సాంబారు పొడి వేస్తే, మరిగి మంచి వాసన వస్తుంది.
5) ఇప్పుడు నూనె వేడిచేసి పోపుదినుసులు వేగాక, ఎండిమిర్చి, కరివేపాకు, 
    వెల్లుల్లి వేసి వేగాక, సాంబారులో కొత్తిమిర కూడా వేసి మూతపెట్టాలి.


* అంతే ఘుమఘుమలాడే   సాంబార్ రెడి.


కావలసిన పదార్ధాలు :

టమాటాలు : రెండు
చింతపండు : నిమ్మకాయంత
మిరియాలపొడి : టి స్పూన్ 
ఉప్పు : సరిపడా
పసుపు : టి స్పూన్
కొత్తిమిర : చిన్నకట్ట
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
పోపుదినుసులు : కొంచెం 
కరివేపాకు : రెండు రెమ్మలు
ఎండిమిర్చి : రెండు
వెల్లుల్లి రెబ్బలు : నాలుగు


తయారు చేయు  విధానం :

టమాటాలు వేడి నీటిలో వేసి రెండు నిముషాలు ఉంచాలి, అవి మెత్తబడతే అదే నీటిలో చింతపండు వేసి, పసుపు, ఉప్పు, మిరియాలపొడి, కొత్తిమిర వేసి బాగా కలిపి స్టవ్ వెలిగించి, ఇవన్నీ కలిపిన గిన్నెను స్టవ్ మీద పెట్టి పది నిముషాలు మరగబెట్టి దించాలి. ఇప్పుడు వేరే గిన్నె స్టవ్ మీద పెట్టి కొద్దిగా నూనె వేసి పోపుదినుసులు, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక, మరగపెట్టిన టమాట రసం తాలింపు వేసి మూతపెట్టి స్టవ్ ఆపాలి. అంతే టమాట రసం రెడి.

Powered by Blogger.