కావలసిన పధార్దాలు :
ములక్కాడలు : మూడు
టమాటాలు : రెండు
చింతపండు : నిమ్మకాయంత
పసుపు : పావు టీ స్పూన్
ఉప్పు : తగినంత
మిరియాల పొడి : అర టీ స్పూన్
ఎండుమిర్చి : రెండు
పోపుదినుసులు : అర టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర : కొద్దిగా
రసం పొడి : టీ స్పూన్
నూనె : రెండు టీ స్పూన్లు
తయారుచేయు విధానం :
1) చింతపండు నీటిలో నానబెట్టాలి. టమాటాలు, ములక్కాడలు ముక్కలుగా కట్ చేయ్యాలి.
2) ములక్కాడముక్కలు, కొద్దిగా నీళ్ళు పోసి ఒకనిముషం ఉడికించాలి. అలాగే టమాటాలు ఉడికించాలి.
3) ఇప్పుడు నానిన చింతపండు గుజ్జులాచెయ్యాలి.
4) ఇప్పుడు నీళ్ళు స్టవ్ మీదపెట్టి మరిగించాలి. మరుగుతున్న నీళ్ళల్లో ఉడికించిన టమాట, ములక్కాడలు, ఉప్పు, చింతపండుగుజ్జు, పసుపు, కరివేపాకు, మిరియాలపొడి, రసంపొడి వేసి ఐదునిముషాలు మరిగించాలి.
5) ఇప్పుడు స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచేసి పోపుదినుసులు, కరివేపాకు, ఎండుమిర్చి వేసి వేగిన తరువాత ఈ తాలింపు మరిగిన ములక్కాడల రసంలో వేసి కొత్తిమీర కూడా వేసి మూతపెట్టి స్టవ్ ఆపాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే ములక్కాడలరసం రెడీ.