అల్లం వెల్లుల్లి పేస్టు (Ginger Garlic Paste Preparation in Telugu)

కావలసిన పదార్దాలు :


అల్లం : వంద గ్రాములు 
వెల్లుల్లి : వంద గ్రాములు 
ఉప్పు : అర టీ స్పూన్ 
పసుపు : పావు టీ స్పూన్ 


తయారుచేయు విధానం :


1) అల్లం శుబ్రంగా కడిగి ఫై పొట్టు వలిచి ముక్కలుగా కట్ చేసుకోవాలి. వెల్లుల్లి పొట్టు వలవాలి.
2) ఇప్పుడు అల్లం ముక్కలు, వెల్లుల్లి రెబ్బలు, ఉప్పు, పసుపు అన్ని కలిపి మిక్సి జార్లో మెత్తగా మిక్సి పట్టాలి.
3) దీనిని ఒక సీసాలో నిల్వ చేసుకొని  కావలసినప్పుడు వాడుకోవచ్చు.
* ఇలా చేస్తే ఎన్ని రోజులు ఉన్నా పాడవదు.