వంటపేరు : బీరకాయ కూర
కావలసిన పదార్దములు :
బీరకాయలు : అరకేజి
పచ్చిమిర్చి : రెండు
ఆవాలు : పావు టీ స్పూన్
జీలకర్ర : అరటీ స్పూన్
ఎండిమిర్చి : రెండు
వెల్లుల్లి రేకలు : మూడు టేబుల్ స్పూన్లు
కారం : పావు టీ స్పూన్
ఉప్పు : సరిపడ
నూనె : మూడు టేబుల్ స్పూన్లు
కరివేపాకు : రెండు రెమ్మలు
పసుపు : చిటికెడు
తయారుచేయు విధానం :
1) బీరకాయలు చెక్కి ముక్కలుగా కట్ చేయాలి. వెల్లుల్లిరేకలుఫై పొట్టు తీయాలి.
2) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. కాగాక ఆవాలు, జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకు, వెల్లుల్లిరేకలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగనివ్వాలి.
3) వేగిన తరువాత బీరకాయ ముక్కలు వేసి మూత పెట్టకుండా అప్పుడప్పుడు కలుపుతూ ఉడకనివ్వాలి.4) ఇప్పుడు ఉప్పు, కారం, పసుపు వేసి కలపాలి. ఐదు నిముషాలకు కూర రెడీ.
* ఈ కూర బాలింతకు ఎంతో మంచిది.
Thanks for sharing the content in Telugu for the preparation of Ridge Gourd Curry which was very nice in Telugu Recipes.
ReplyDelete