మామిడి కోరు పచ్చడి (Instant Mango Pickle in telugu Mamidi Turumu Pachhadi)

మామిడి కోరు పచ్చడి


కావలసిన పదార్దములు


మామిడి కాయలు : మూడు
కారం : కప్పు
ఉప్పు : పావు కప్పు
వెల్లుల్లి పాయలు : రెండు
బెల్లం : అర కప్పు
నూనె : రెండు కప్పులు
పోపు దినుసులు : టేబుల్ స్పూన్
ఎండి మిర్చి : పది
కరివేపాకు : రెండు రెమ్మలు
మెంతులు : పావుకప్పు


తయారుచేయు విధానం :


1) మామిడికాయలు చెక్కు తీసి సన్నగా తురుముకోవాలి. 
2) ఎండిమిర్చి, ఉప్పు, మెంతులు మిక్సిలో వేసి మెత్తగా పొడి చేసి  దీనిలోనే (కావాలంటే) బెల్లం వేసి ఒకసారి మిక్స్ చేసుకోవాలి. 
3) ఒక వెడల్పు గిన్నెలో మామిడితురుము, మిక్సిచేసిన పొడి, కారం, ఉప్పు వేసి కలపాలి. 
4) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేడి చేసి పోపుదినుసులు, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగిన తరువాత స్టవ్ ఆపాలి.
5) నూనె చల్లారిన తరువాత కారం కలిపిన మామిడి మిశ్రమంలో వేసి, కలిపి సీసాలో పెట్టుకోవాలి.