కాకరకాయల బజ్జి (Bitter Gourd Puff in telugu Kakarakaya Bajji)

కాకరకాయల బజ్జి 

కావలసిన పదార్దములు :

కాకరకాయలు : మూడు 
మైదా : అర కప్పు 
బియ్యంపిండి : అర కప్పు 
శెనగపిండి : కప్పు 
కొబ్బరి కోరు : అర కప్పు 
కారం : టీ స్పూన్ 
గరం మసాల : అర టీ స్పూన్ 
ఉప్పు : సరిపడ
వంటసోడా : పావు టీ స్పూన్ 
పసుపు : చిటికెడు 
నిమ్మరసం : టీ స్పూన్ 

తయారుచేయు విధానం :

1) కాకరకాయలు శుబ్రంగా కడిగి నిలువుగా కాని చక్రాలుగా కాని కట్ చేయాలి.
2) వీటికి పసుపు, ఉప్పు, నిమ్మరసం రాసి కాసేపు ఎండలో పెట్టాలి.  
3) తరువాత స్టవ్ మీద కళాయి పెట్టి కొద్దిగా నూనెవేసి కాగాక, కాకరకాయ ముక్కలు వేయించి పక్కన పెట్టాలి.
4) ఇప్పుడు మైదాలో శెనగపిండి, బియ్యపుపిండి, జీలకర్ర, వామ్ము, కారం, మసాల, ఉప్పు, వంటసోడా, కొబ్బరి తురుము వేసి కలిపి నీళ్ళు పోసి కాస్త పలుచగా కలపాలి.
5) ఇప్పుడు నూనె వేడి చెయ్యాలి. నూనె కాగిన తరువాత వేయించిన కాకరకాయ ముక్కలు ఈ పిండిలో ముంచి కాగే నూనెలో బజ్జిల్లా వేసి దోరగా వేపి ప్లేటులోకి తీయాలి. అంతే కాకరకాయ బజ్జి రెడీ.