కాకరకాయ మెంతి పచ్చడి (Kakarakaya Menthi Pachchadi in Telugu)

కాకరకాయ మెంతి పచ్చడి

కావలసిన పదార్దములు :

కాకరకాయలు : అర కేజీ 
కారం : కప్పు 
ఉప్పు : అరకప్పు
చింతపండు గుజ్జు : కప్పు
ఆవాలపొడి : అర కప్పు
మెంతి పొడి : అర కప్పు
పసుపు : టీ స్పూన్
నూనె : రెండు కప్పులు
పోపుదినుసులు : టేబుల్ స్పూన్
ఎండి మిర్చి : నాలుగు
కరివేపాకు : మూడు రెమ్మలు
వెల్లుల్లిపాయ : ఒకటి

తయారుచేయు విధానం :

1) చింతపండు రసంలో కాకరకాయలు ముక్కలు, ఉప్పు, పసుపు వేసి రెండు నిముషాలు వుడకబెట్టి దించి, నీళ్ళు వంచి పక్కన పెట్టాలి.
2) ఇవి చల్లారిన తరువాత ఒక గిన్నెలో కాకరకయముక్కలు, కారం, పసుపు,  ఉప్పు, ఆవపొడి, మెంతిపొడి, చింతపండు గుజ్జు వేసి బాగా కలపాలి.
3) ఇప్పుడు నూనె వేడి చేసి పోపుదినుసులు, ఎండి మిర్చి, కరివేపాకు, వెల్లుల్లిరెబ్బలు వేసి పోపు వేగిన తరువాత దించి చల్లారనిచ్చి కారం కలిపిన కాకరకాయ ముక్కల్లో వేసి కలపాలి.
* ఇది రెండు రోజులు ఆగి తింటే ఎంతో రుచిగా ఉంటుంది.