Showing posts with label pickles. Show all posts



కావలసిన పదార్దాలు 


క్యేబెజి తురుము : కప్పు 
కారం :టేబుల్ స్పూన్ 
ఉప్పు : సరిపడా 
నూనె : అర కప్పు
ఆవపిండి, మెంతు పిండి, పసుపు జీర పొడి : అన్ని కలిపి రెండు టీ స్పూన్లు 

తయారుచేయు విధానం 

1) ఒక గిన్నెలో క్యేబెజి తురుము, కారం, ఉప్పు, ఆవ, మెంతి, జిరా, పసుపు.అన్ని పొడులు, నిమ్మరసం, నూనె వేసి కలిపి ఒక జాడీలో పెట్టు కోవాలి. 
2) దీనిని ఒక రోజు తరువాత బాగా కలిపితే  పచ్చడి రెడి.
ఇది వారం రోజులు నిల్వ ఉంటుంది.



కావలసిన పదార్దాలు :

క్యారెట్లు : అర కిలో 
ఆవపిండి : టీ స్పూన్ 
మెంతి పిండి : అర టీ స్పూన్ 
నువ్వుల నూనె : కప్పు 
జీలకర్ర పొడి : టీ స్పూన్ 
కొత్తిమీరపొడి : టీ స్పూన్ 
కారం : రెండు టీ స్పూన్లు 
బెల్లం :చిన్న ముక్క 
ఉప్పు : తగినంత 
పోపు దినుసులు : టీ స్పూన్ 
కరివేపాకు : కొద్దిగా 
ఎండు మిర్చి : రెండు 
పసుపు : కొద్దిగా 
నిమ్మరసం : పావు కప్పు 

తాయారు చేయు విధానం: 


1) క్యారెట్లు కడిగి తడి లేకుండా తుడిచి ఫై చెక్కు తీసి సన్నగా తరగాలి.
2) నూనె వేడి చేసి పోపు గింజలు వేసి వేగాక  కరివేపాకు ఎండుమిర్చి వేసి వేగాక దించి పక్కన పెట్టాలి.
3) పోపు చల్లారిన తరువాత దానిలో  మిగిలిన నూనె, క్యారేట్ ముక్కలు , ఉప్పు, కారం తో పాటు 
పొడులు అన్ని వేసి బాగా కలపాలి.
4) ఇప్పుడు నిమ్మ రసం, బెల్లం వేసి మరోసారి కలిపి జాడిలో పెట్టుకోవాలి.
ఇది నెల రోజులు నిల్వ ఉంటుంది.  


 వేరుసెనగ గుళ్ళు పొడి (ground nuts  Podi in Telugu)

కావలసిన పదార్దాలు: 
 
వేరుసెనగ గుళ్ళు  : ఒక కప్పు 
ఎండు మిర్చి : ఆరు 
జీలకర్ర : టీ స్పూన్ 
వెల్లుల్లి రెబ్బలు : ఐదు 
ఉప్పు : సరిపడ
నూనె : ఒక స్పూన్ 
కరివేపాకు _
తయారుచేయు విధానం: 

1) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చెయ్యాలి. దీనిలో స్పూన్ నూనెవేసి. కాగాక 
ఎండి మిర్చి, జీలకర్ర, కరివేపాకు  వేసి వేయించాలి.వీటిని మిక్సి జార్లో వేసి గ్రైండ్ చెయ్యాలి. 

2)  ఇప్పుడు అదే పాన్లో వేరుసెనగ  పప్పువేసి దోరగా వేయించాలి. వేయించిన వేరుసెనగ పప్పు గ్రైండ్  చేసిన ఎండిమిర్చిలో వేసి మళ్ళి గ్రైండ్  చెయ్యాలి.

3) ఇప్పుడు ఉప్పు, వెల్లుల్లి వేసి మరొకసారి గ్రైండ్  చేస్తే చాలు ఎంతో రుచిగా ఉండే వేరుసెనగ పొడి రెడీ.

ఇది ఇడ్లి, ఉప్మా,దోశెల్లోకి ఎంతో బాగుంటుంది.

1


కావలసిన పదార్దాలు: 
 
మినపప్పు  : ఒక కప్పు 

ఎండు మిర్చి : ఆరు 
జీలకర్ర : టీ స్పూన్ 
వెల్లుల్లి రెబ్బలు : ఐదు 
ఉప్పు : సరిపడ
నూనె : రెండు స్పూన్లు 
కరివేపాకు _ కొద్దిగా 
తయారుచేయు విధానం: 


1) స్టవ్ వెలిగించి పాన్ పెట్టి వేడి చెయ్యాలి. దీనిలో స్పూన్ నూనెవేసి. కాగాక 

ఎండి మిర్చి, జీలకర్ర, కరివేపాకు  వేసి వేయించాలి.వీటిని మిక్సి జార్లో వేసి గ్రైండ్ చెయ్యాలి. 
2)  ఇప్పుడు అదే పాన్లో మిన పప్పువేసి దోరగా వేయించాలి. వేయించిన మినపప్పు గ్రైండ్  చేసిన ఎండిమిర్చిలో వేసి మళ్ళి గ్రైండ్  చెయ్యాలి.

3) ఇప్పుడు ఉప్పు, వెల్లుల్లి వేసి మరొకసారి గ్రైండ్  చేస్తే చాలు ఎంతో రుచిగా ఉండే మినపప్పు  పొడి రెడీ



కావలసిన పదార్దాలు 

కాకరకాయలు _ పావుకేజీ 
ఎండుమిర్చి -వందగ్రాములు 
ధనియాలు -వందగ్రాములు 
జీలకర్ర-రెండు టీ స్పూన్లు
కరివేపాకు-ఒక కప్పు 
నూనె-వేయించడానికి సరిపడినంత
వెల్లుల్లి-ఒకటి 
ఉప్పు-తగినంత

తయారు చేయు విధానం

1) కాకర కాయలు కడిగి ,శుబ్రంగా తుడిచి సన్నగా గుండ్రంగా ముక్కలుగా కట్  చేయాలి.
2) స్టవ్ వెలిగించి కళాయ పెట్టి నూనెవేడి చేయాలి.
3) నూనె కాగిన తరువాత మిర్చి, ధనియాలు, జీలకర్ర, కరివేపాకు విడివిడిగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
4) ఇప్పుడు కాకరకాయలు కరకరలాడేలా వేయించి పక్కనపెట్టాలి 
5) కాకరకాయలు తప్పించి మిగిలిన పదార్దాలు మిక్సి జార్లో వేసి పొడిలా చెయ్యాలి.
6) వేయించిన కాకరకాయలు ఈ కారప్పోడిలో కలిపి వేడివేడి అన్నంలో వడ్డించాలి.
ఎంతో రుచిగాఉండే కాకరకాయలు కారప్పొడి రెడి.

1

కావలసిన పదార్దాలు 

మామిడి కాయలు _ మూడు
పెసరపప్పు  _వంద గ్రాములు 
ఉప్పు _ సరిపడా 
నూనె _ పావుకేజీ 
కారం _ వంద గ్రాములు 

తయారుచేయు విధానం 

1) ముందుగా మామిడి కాయలు ముక్కలుగ కట్ చేయాలి.
2) పెసరపప్పు బాగా ఎండబెట్టి పొడి చేయాలి.
3) ఇప్పుడు ఒక పెద్ద గిన్నె తీసుకుని దానిలో పెసరపిండి, కారం, ఉప్పు వేసి మూడు కలిసేలా బాగా కలపాలి.
4) ఇప్పుడు దీనిలో మామిడి ముక్కలు ,నూనె వేసి బాగా కలిపి జాడీలో పెట్టుకోవాలి.
5) మూడో రోజు  ఒకసారి బాగా కలిపి వాడుకోవడమే
ఇంతే ఎంతో రుచిగా ఉండే పెసర ఆవకాయ రెడి.






కావలసిన పదార్థాలు

చింతకాయలు గుజ్జు - ఒక కప్పు
ఎండు మిరపకాయలు - సరిపడా
ఆవాలు - టీ స్పూన్
మెంతులు - టీ స్పూన్
ఆవాలు - ఒక టీ స్పూన్
పచ్చి శెనగపప్పు - ఒక టీ స్పూన్
జీల కర్ర - ఒక టీ స్పూన్
వెల్లుల్లి రేకలు - పది

తయారు చేసే విధానం


1) ముందుగ చింతకాయ ఫై చెక్కు లోపల గింజలు తీసి మెత్తగా చేసి పక్కన పెట్టాలి.
2) నూనె లేకుండా ఆవాలు, మెంతులను కూడా వేయించుకోని వీటికి మిర్చిని, ఉప్పు, వెల్లుల్లి కలిపి పొడి చెయ్యాలి
3 ) ఇప్పుడు ఈ పొడి ని మామిడికాయ తురుములో కలుపుకోవాలి.
దీనిని రోట్లో దంచుకోవచ్చు , లేదామిక్సిలో వేసి ఒకసారి తిప్పి తే చాలు పచ్చడి తయారుఅవ్వుతుంది.
4 ) ఇప్పుడు కళాయి లో నూనె పోసి వేడి చెయ్యాలి.
5) నూనె వేడి అయ్యా క అందులో పోపు దినుసులు వేసి వేయించుకోవాలి.
6) ఈ పోపును మామిడికాయ తురుములో కలుపుకోవాలి.
అంతే మామిడికాయ తొక్కు పచ్చడి రె





























































































2 ) ఎండు మిరపకాయలను (పచ్చిమిర్చి కూడా వేసుకోవచ్చు).
















దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.











































































డీ.







కావలసిన పదార్థాలు

మామిడికాయ - ఒక కప్పు తురిమినది
ఎండు మిరపకాయలు - సరిపడా
ఆవాలు - టీ స్పూన్
మెంతులు - టీ స్పూన్
ఆవాలు - ఒక టీ స్పూన్
పచ్చి శెనగపప్పు - ఒక టీ స్పూన్
జీల కర్ర - ఒక టీ స్పూన్
వెల్లుల్లి రేకలు - పది
నూనె - అర కప్పు

తయారు చేసే విధానము

1) ముందుగ మామిడి కాయ ముక్కలను తురిమి పక్కన పెట్టుకోవాలి.
2 ) ఎండు మిరపకాయలను దోరగా వేయించి పక్కన పెట్టుకోవాలి.
 పొడిగా ఆవాలు, మెంతులను కూడా వేయించుకోని వీటికి మిర్చిని, ఉప్పు, వెల్లుల్లి కలిపి పొడి చెయ్యాలి.
3 ) ఇప్పుడు ఈ పొడి ని మామిడికాయ తురుములో కలుపుకోవాలి.
రోట్లో దంచుకోవచ్చు , లేదామిక్సిలో వేసి ఒకసారి తిప్పి తే చాలు మామిడి పచ్చడి తయా
తయారయుతుంది.
4 ) ఇప్పుడు కళాయి లో నూనె పోసి వేడి చెయ్యాలి.
5) నూనె వేడి అయ్యా క అందులో పోపు దినుసులు వేసి వేయించుకోవాలి.
6) ఈ పోపును మామిడికాయ తురుములో కలుపుకోవాలి.
అంతే మామిడికాయ తొక్కు పచ్చడి రెడీ.

1

బెండకాయ పచ్చడి 

కావలసిన పదార్ధాలు:

బెండ కాయలు : పది 
 టమాట :ఒకటి 
 ఉల్లిపాయ : ఒకటి 
 పచ్చి మిర్చి: పది 
చింతపండు : నిమ్మకాయంత 
బెల్లము : కొద్దిగా 
ఉప్పు : తగినంత 
వెల్లుల్లి  : నాలుగు రేకలు 
నూనె : నాలుగు టేబుల్ స్పూన్లు 

 తయారుచేయువిధానం:

1)  కళాయి లో నూనె పోసివేడిచేయ్యాలి.దానిలో కట్ చేసిన బెండకాయలు  వేసి పది నిమిషాలు వేయించాలి.
2) పొడిపొడిగా వేగిన తరువాత తీయ్యాలి.
3) ఇప్పుడు  దీనిలో టమాటా వేసి వేయించాలి.
4) తరువాత పచ్చిమిర్చి వేయించాలి
5) ఇప్పుడు మిక్సిలో మిర్చి, ఉప్పు, ఉల్లి, చింతపండు,వెల్లుల్లి, టమాటా 
జీలకర్ర వేసి మిక్సి పట్టాలి.
6) తరువాత దీనిలోబెల్లం, వేయించిన బెండ కాయలు వేసి ఒక సారి తిప్పాలి.
కావాలంటే తాలింపు పెట్టుకోవచ్చు.
అంతే బెండకాయ పచ్చడి రెడీ.


కావలసిన పదార్దములు :

ఎండుమిర్చి : పది హేను 
ఉప్పు : సరిపడ 
చింతపండు : నిమ్మకాయంత 
జీలకర్ర : టీ స్పూన్ 
వెల్లుల్లి రేకలు : పది  
నూనె : రెండు టేబుల్  స్పూన్లు 
  

తయారుచేయు విధానం :


1) నూనె వేడి చేసి ఎండుమిర్చి వేయించాలి. అదే నూనెలో జీలకర్ర వేసి వేయించాలి. 
2)వేయించిన ఎండుమిర్చికి  ఉప్పు,జీలకర్ర కలిపి నూరిన తర్వాత  చింతపండు వేసి నూరాలి. అలాగే ఎండిమిర్చి,చింతపండు నలిగిన తరువాత వెల్లుల్లి కూడా వేసి నూరాలి.

అంతే చింతపండు కారప్పొడి రెడీ (దీనినే నల్లకారం అని కూడా అంటారు.)  
ఈ నల్లకారం  అప్పటికప్పుడు చేసుకొని వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది.

1
కావలసినపదార్దాలు:

మామిడి ముక్కలు :  ఐదు కేజీలు 
ఉప్పు: పావు కేజీ గ్లాసుతోమూడు గ్లాసులు ,
కారం : మూడు గ్లాసులు 
ఆవాలపొడి : మూడు గ్లాసులు ,
మెంతి పొడి : 
వెల్లుల్లి : అర కేజీ  
పసుపు : రెండు టేబుల్ స్పూన్స్ 
నూనె : రెండు కేజీలు

తయారు చేయు విదానం :

1) ఒక పళ్ళెంలో ఉప్పు ,పసుపు, కారం, ఆవపిండి, మెంతి పిండి, వెల్లుల్లి పేస్ట్ వేసి బాగా కలపాలి .
2) ఒక గిన్నె లో నూనె పోసి పెట్టుకోవాలి. మామిడి ముక్కలు నూనె లో వేసి, కలిపి పెట్టుకున్న కారం పొడి లో వేసి కారం బాగా ముక్కలకు పట్టేటట్లు అద్ది ఒక జాడి లోపెట్టుకోవాలి.  పైన నూనె పోసి మూత పెట్టి ఉంచాలి. 
3) రెండు రోజుల తరువాత  గరిటెతో పచ్చడి కలపాలి.
4) ఇలా చెయ్యడం వల్ల నూనె పైకి తేలుతుంది. 
5) మూడవ రోజు ముక్కలు ఒక పెద్ద గిన్నెలో వేసి  పచ్చడి పైకి క్రిందకి బాగా కలిసేటట్లు కలిపి ఉప్పు సరి చూసుకుని అవసరమైతే మరి కొంచెం ఉప్పు కలిపి జాడీలో అడుగున కొద్దిగా నూనె పోసి పచ్చడి జాడీలో పెట్టాలి.
6) పైన మళ్లీ నూనె పోసి మూత గట్టిగా పెట్టి పైన ఒకపలుచని క్లాత్ కట్టాలి. సంవత్సరం పాటు పచ్చడి పాడవకుండా బాగుంటుంది.

1
కావలసిన పదార్దములు


గోంగూర - చిన్నకట్టలు ఐదు 
ఎండిమిర్చి  -పది హేను 
ఉల్లుపాయలు - రెండు 
ఉప్పు - సరిపడా 
చింతపండు - ఉసిరి కాయంత 
జీలకర్ర - టీ స్పూన్ 
వెల్లుల్లి రేకలు - ఏడు 
నూనె రెండు - టీ స్పూన్లు 
పోపుగింజలు - టీ స్పూన్ 
కరివేపాకు - రెండు రెమ్మలు 


తయారుచేయు విధానం 

1) గోంగూరను కోసి శుబ్రంగా కడిగి నీళ్ళు మొత్తం పోయేలా చేయాలి.
2) నూనె వేడిచేసి ఎండి మిర్చి  వేయించాలి.అదే నూనెలో గోంగూర వేసి వేయించాలి. 
3) వేయించిన ఎండిమిర్చికి  ఉప్పు,చింతపండు,వెల్లుల్లి,జీలకర్ర కలిపినూరాలి.కాస్త నలిగిన తరువాత గొంగూర వేసి నూరి
 తరువాత  ఉల్లిపాయలు వేసి కచ్చాపచ్చాగా నూరాలి.
4) ఇప్పుడు నూనె వేడిచేసి పోపుదినుసులు,ఎండిమిర్చి,కరివేపాకు వేసి వేగిన తరువాత నూరిన ఈ పచ్చడిని వేసి తాలింపు పెట్టాలి.
అంతే గోంగూర బండ పచ్చడి రెడీ.  
ఈ పచ్చడి అప్పటి కప్పుడు చేసుకొని వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది. 

1


వంకాయ పచ్చడి

కావలసిన పదార్దాలు

వంకాయలు : ఒక కేజీ.
ఉప్పు : తగినంత
కారం : తగినంత. 
చింతపండు : పావు కేజీ. 
నూనె : వేపుడుకు తగినంత
పోపుదినుసులు 

తయారు చేయు విధానం:
1)  వంకాయలు శుభ్రంగా కడిగి, తుడిచి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి.

2) తర్వాత చింతపండు, ఉప్పు, కొంచెం వంకాయ ముక్కలు వేసి, కారం కూడా వేసి బాగా మెత్తగా రుబ్బుకోవాలి.

3) దీనికి మిగిలిన వంకాయ ముక్కలు వేసి కొంచెం పలుకుగా రుబ్బుకొని తీసుకోవాలి.

4) నూనె వేడి చేసి పోపుదినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసి  ఈ పచ్చడి పోపు పెట్టుకోవాలి.

అంతే వంకాయ పచ్చడి రెడి.

నిమ్మ కాయ వురగాయ పచ్చడి 

కావలసిన పదార్దాలు :

నిమ్మకాయలు :ముప్పై 
కారం : వంద గ్రాములు 
ఉప్పు : వందగ్రాములు 
మెంతులపొడి : రెండు టీ స్పూన్లు 
పసుపు : టీ స్పూన్ 

తయారుచేయు విధానం :

1) నిమ్మకాయలు శుబ్రంగా కడిగి  తడి లేకుండా తుడవాలి.
2) వీటిలో పన్నెండు కాయలు ముక్కలుగా కట్ చెయ్యాలి.ఒక్కొక్క కాయను ఎనిమిది ముక్కలు చెయ్యాలి.
3) మిగిలిన కాయలు కోసి రసం తీసి వడకట్టి పక్కన పెట్టాలి. 
4) ఇప్పుడు కట్ చేసిన ముక్కల్లో  పసుపు, ఉప్పు, నిమ్మరసం వేసి కలిపి ఒక జాడీలో పెట్టి రెండు రోజులు అలాగే వుంచాలి.ఈ ముక్కలు బాగా వురతాయి.
5) మూడో రోజు ఈ ముక్కల్లో కారం, మెంతు పొడి వేసి కలిపి పొడి జాడీలో పెట్టుకోవాలి.
అంతే నిమ్మకాయ వురగాయ రెడీ.

1



కావలసిన పదార్దములు 

పచ్చిమిర్చి - ఇరవై
ఉల్లుపాయలు - రెండు
ఉప్పు - సరిపడా
దొండకాయముక్కలు   - ఒకకప్పు  
జీలకర్ర - టీ స్పూన్
వెల్లుల్లి రేకలు - పది
నూనె రెండు - టీ స్పూన్లు
పోపుగింజలు - టీ స్పూన్
కరివేపాకు - రెండు రెమ్మలు
చింతపండు - నిమ్మకాయంత
తయారుచేయు విధానం

1) నూనె వేడి చేసి పచ్చిమిర్చి వేయించాలి.అదే నూనెలో దొండకాయ ముక్కలు వేయించాలి.
2) పచ్చిమిర్చికి  ఉప్పు,వెల్లుల్లి, జీలకర్ర,దొండ ముక్కలు  కలిపిమెత్తగా నూరాలి.దొండ ముక్కలు   నలిగిన తరువాత చింతపండు  వేసి నలిగిన తరువాత  ఉల్లిపాయలు వేసి కచ్చాపచ్చాగానూరాలి.ఉల్లి నలిగి నలగకుండా ఉంటె రుచిగా ఉంటుంది.
3) ఇప్పుడు నూనె వేడిచేసి పోపుదినుసులు,ఎండమిర్చి,కరివేపాకు వేసి వేగిన తరువాత నూరిన ఈ పచ్చడిని వేసి తాలింపు పెట్టాలి.అంతే మామిడి  పచ్చడి రెడీ.
ఈ పచ్చళ్ళు రోట్లో నూరితేనేబాగుంటాయి. 
అప్పుటి  కప్పుడు చేసుకొని వేడి అన్నంలో తింటే చాలా రుచిగా ఉంటుంది

ఉసిరి ఆవకాయ పచ్చడి 
కావలసిన పదార్దాలు :

ఉసిరికాయలు : కేజీ 
కారం : పావుకేజీ 
ఉప్పు : పావుకేజీ 
ఆవపిండి : పావుకేజీ 
వుడికించిన చింతపండు గుజ్జు :వంద గ్రాములు 
పసుపు :  టీ స్పూన్ 
నూనె :కేజీ 
వెల్లుల్లి ముద్దా : వందగ్రాములు 

తయారుచేయు విధానం :

1) ఉసిరి కాయలు కడిగి తడి లేకుండా తుడిచి ఆరబెట్టి పక్కన ఉంచాలి.
స్టవ్ ఫై కళాయి పెట్టి అర కేజీ నూనె పోసి కాగాక ఉసిరి కాయలు వేసి దోరగా వేపి ఒక గిన్నెలోకి తీసి చల్లార నివ్వాలి.
2) ఉసిరి కాయలు బాగా చల్లారిన తరువాత వీటిలో ఉప్పు, కారం, ఆవపిండి, పసుపు వేసి బాగా కలపాలి.
3) ఇప్పుడు చింతపండు గుజ్జు,  వెల్లుల్లి ముద్ద,మిగిలిన నూనె  వేసి కలిపి మూత పెట్టి మూడు రోజులు కదపకుండా ఉంచితే బాగా ఊరుతుంది.
4) మూడు రోజుల తరువాత మనం వాడుకోవచ్చు.  

కరివేపాకు పచ్చడి 
కావలసిన పదార్దాలు: 

కరివేపాకు : రెండు కప్పులు 
ఎండు మిర్చి : ఇరవై 
చింతపండు : నిమ్మకాయంత 
ఉప్పు : తగినంత 
నూనె : రెండు టేబుల్ స్పూన్లు 
పోపుదినుసులు : టీ స్పూన్ 
వెల్లుల్లి : ఆరు రేకలు 
జీలకర్ర : టీ స్పూన్ 

తయారుచేయు విధానం :

1) కరివేపాకు, ఎండుమిర్చి,ఉప్పుమిక్సిలో వేసి మెత్తగా మిక్సి పట్టాలి.
 2) చింతపండు, కొద్దిగా నీళ్ళు లో వేసి నానబెట్టాలి.  
3)  ఆ నీళ్ళతోనే చింతపండు మిక్సిలో వేసి ఒకసారి తిప్పాలి.
4) స్టవ్ మీద కళాయి పెట్టి నూనె వేసి కాగాక పోపుదినుసులు, జీలకర్ర, వెల్లుల్లి  వేసి వేగాక స్టవ్ ఆపాలి.
5) ఇప్పుడు  ఈ తాలింపు పచ్చడిలో వేసి ఒకసారి మిక్సి తిప్పితే కరివేపాకు పచ్చడి రెడీ అయినట్టే.
6) ఈ పచ్చడి వేడి వేడి అన్నం లో వేసుకుని ఫైన నెయ్యి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది.  

దోసకాయ ఊరగాయ పచ్చడి 
కావాల్సిన పదార్దాలు :

దోసకాయ : ఒకటి 
కారం : టేబుల్ స్పూన్ 
ఆవపిండి : టీ స్పూన్ 
ఉప్పు : టీ స్పూన్ 
నిమ్మ రసం : టేబుల్ స్పూన్ 
నూనె :  అర కప్పు 

తయారుచేయు విధానం :

1) దోసకాయను చెక్కకుండా ముక్కలుగా కొయ్యాలి.వీటిని ఒక గిన్నెలో వేయ్యాలి.
2) వీటిలో కారం, ఉప్పు, ఆవపిండి, నూనె, నిమ్మరసం  వేసి కలపాలి.
3) మూడు రోజులు అలాగే ఉంచితే దోస ముక్కలు వూరుతాయి. మూడు రోజుల తరువాత వాడుకోవచ్చు.   


పచ్చి రొయ్యలు   పచ్చడి 
కావలసిన పదార్దాలు :

రొయ్యలు   : అర కిలో 
కారం : వంద గ్రాములు 
ఉప్పు : తగినంత 
 వెల్లుల్లి :  యేభైగ్రాములు 
నూనె : పావుకిలో 
{ లవంగాలు : పది 
దాల్చిన చెక్క : అంగుళం ముక్క 
మూడు:  యాలుకులు :}
వీటిని కలిపిపొడి చేసిన మసాలా : రెండు టీ స్పూన్లు  
నిమ్మ రసం : ఆరు కాయలు (లేదా నిమ్మ ఉప్పు ముప్పై  గ్రాములు )
ధనియాలపొడి : వంద గ్రాములు 
జీలకర్ర : ముప్పైగ్రాములు 
కరివేపాకు : కొద్దిగా 

తయారుచేయు విధానం: 

1) ముందుగా రొయ్యలు  శుబ్రంగా కడిగి ఐదు నిముషాలు తడి లేకుండా పొడిపొడిగా అయ్యేంత వరకు ఉడికించాలి.
 2) దీనిని అర కప్పు నూనె వేడి చేసి దానిలో ఈ రొయ్యలు   వేసి దోరగా వేగనివ్వాలి.
3) మిగిలిన నూనెలో గరం మసాల పొడి, కారం, ఉప్పు, వెల్లుల్లి, ధనియాలపొడి, జీలకర్ర, నిమ్మరసం, వేయించిన కరివేపాకు వేసి వేయించిన రొయ్యలు  కూడా వేసి బాగా కలిపి నిల్వ చేసుకోవాలి.  



పచ్చిచేపలు పచ్చడి 

కావలసిన పదార్దాలు :

తోలు తీసిన చేప ముక్కలు : అర కిలో(కొరమీను) 
కారం : వంద గ్రాములు 
ఉప్పు : తగినంత 
 వెల్లుల్లి :  యేభైగ్రాములు(కచ్చాపచ్చాగా దంచాలి) 
నూనె : పావుకిలో 
{ లవంగాలు : పది 
దాల్చిన చెక్క : అంగుళం ముక్క 
మూడు:  యాలుకులు :}
వీటిని కలిపిపొడి చేసిన మసాలా : రెండు టీ స్పూన్లు  
నిమ్మ రసం : ఆరు కాయలు (లేదా నిమ్మ ఉప్పు ముప్పై  గ్రాములు )
ధనియాలపొడి : వంద గ్రాములు 
జీలకర్ర పొడి : ముప్పైగ్రాములు 
కరివేపాకు : కొద్దిగా 

తయారుచేయు విధానం: 

1) ముందుగాచేప ముక్కలు   శుబ్రంగా కడిగి చిన్న ముక్కలుగా కొయ్యాలి. వీటికి కొద్దిగా మసాలా, కొచెం కారం, కొద్దిగా ఉప్పు కలిపి అర గంట పక్కనపెట్టాలి.
2) అరగంట అయ్యాక వీటిని నూనె వేడి చేసి దోరగా వేయించాలి. 
3) మిగిలిన నూనెలో చేపముక్కల్లో కలపగా మిగిలిన  గరం మసాల పొడి, కారం, ఉప్పు, దంచిన వెల్లుల్లి, ధనియాలపొడి, జీలకర్రపొడి, నిమ్మరసం, వేయించిన కరివేపాకు వేసి వేయించిన చేపముక్కలు   కూడా వేసి బాగా కలిపి నిల్వ చేసుకోవాలి.  
Powered by Blogger.