ఆనబకాయ : అరకేజీ
ఉల్లుపాయ : ఒకటి
పచ్చిమిర్చి : రెండు
పోపుదినుసులు : టీ స్పూన్
ఎండిమిర్చి : రెండు
వెల్లుల్లి రేకలు : పది
జీలకర్ర : అర టీస్పూన్
కరివేపాకు : కొద్దిగా
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
కారం : పావు టీ స్పూన్
ఉప్పు : సరిపడా
పసుపు : చిటికెడు
పాలు : కప్పు
తయారుచేయు విధానం :
1) ఆనబకాయను చెక్కి ముక్కలుగా కట్ చెయ్యాలి. అలాగే ఉల్లి, మిర్చి కూడా ముక్కలుగా కట్ చెయ్యాలి.
2) స్టవ్ వెలిగించి కళాయి పెట్టి నూనె వేడిచేసి పోపుదినుసులు వేసి వేగాక, ఎండిమిర్చి, వెల్లుల్లిరేకలు, కరివేపాకు, జీలకర్ర వేసి వేగిన తరువాత ఆనబకాయ ముక్కలు వెయ్యాలి. మూతపెట్టి ఐదు నిముషాలు ఉడకనివ్వాలి.
3) ఐదు నిముషాలు తరువాత మూతతీసి ఉప్పు, కారం, పసుపు వేసి కలిపి, పాలు పోసి మూతపెట్టి రెండు నిముషాలు ఉడకనివ్వాలి.
* అంతే పాలు ఆనబకాయ కూర రెడీ.