వంటపేరు : పరోట
కావలసిన పదార్దములు :
మైదా : పావుకేజీ
ఉప్పు : తగినంత
నూనె : రెండు టేబుల్ స్పూన్ లు
తయారుచేయు విధానం :
1) మైదాని జల్లించి, ఉప్పు, నీళ్ళువేసి ముద్దలా కలపాలి. దీనిని పది
నిముషాలు బాగా కలపాలి .
2) తరువాత పల్చగా చపాతిలా చెయ్యాలి. అలా చేసిన దానిమీద నూనె వేసి
చపాతీ మొత్తం రాయాలి.
3) దీనిని ఒక మడత కిందికి, ఒక మడత పైకి అంగుళం వెడల్పుగా మడత
పెట్టాలి. అలా సన్నగా చపాతీ మొత్తం మడత పెట్టి, దానిని రౌండ్ గా చుట్టి,
టేబుల్ మీద చేతితో చుట్టూ నొక్కి, మందంగా మరల చపాతిలా చేసి పాన్
మీద రెండు ప్రక్కలా కాల్చాలి.
4) అలా మొత్తం పరోటాలు కాల్చాక, ఒక దాని మీద ఒకటి పెట్టి రెండు చేతులతో అంచులు ఒకటి, రెండు సార్లు దగ్గరకు నొక్కితే పరోటా
పొరలుపొరలుగా వుంటుంది.
chaala bagundhandi nenu try chesanu chaala baga vachindhi and teast kooda super.....thank you so much andi....
ReplyDeleteTalli em vachindi vatti mayda na I dont belive inka edo kaluputatu anta soft ga ela vastadi.
Delete