పప్పు దోసకాయ (Pappu Dosakaya)

వంటపేరు : పప్పు దోసకాయ


కావలసిన పదార్ధాలు :


కందిపప్పు : వంద గ్రాములు
దోసకాయ : ఒకటి
పచ్చిమిర్చి : నాలుగు
ఉల్లిపాయ : ఒకటి
కరివేపాకు : రెండు రెమ్మలు
పోపుదినుసులు : కొద్దిగా
ఎండుమిర్చి : రెండు
పసుపు : చిటికెడు
చింతపండు : నిమ్మకాయంత (పులుపు కావాలంటే వేసుకోవచ్చు )
ఉప్పు : సరిపడా
నూనె : రెండు టేబుల్ స్పూన్లు


తయారుచేయు విధానం :


1) దోసకాయను చెక్కుతీసి చేదో-తీపో చూసి ముక్కలుకోసి పక్కనపెట్టాలి. 
    ఉల్లిపాయ, పచ్చిమిర్చి నిలువుగా కోసుకోవాలి.
2) కందిపప్పును బాగా కడిగి పదినిముషాలు నీళ్ళల్లో నానబెట్టాలి. 
    (కందిపప్పు నానితె తొందరగా ఉడుకుతుంది)
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్లో కందిపప్పు, దోసకాయ ముక్కలు, ఉల్లి, 
    మిర్చిముక్కలు, కారం, పసుపు వేసి మూతపెట్టి స్టవ్ మిద పెట్టాలి. వెయిట్ 
    పెట్టి మూడు విజిల్సు వచ్చాక స్టవ్ ఆపాలి.
4) కుక్కర్ చల్లారక మూత తీసి ఉప్పువేసి కచ్చపచ్చగా గరిటతో మెదిపి (మరీ 
    మెత్తగావద్దు ) చింతపండు రసం వేసి మళ్ళి స్టవ్ మీద పెట్టి రెండు 
    నిముషాలు ఉడకనిచ్చి పోపుపెట్టుకోవాలి.


(పోపు పెట్టడం )


5) స్టవ్ మీద బాండిపెట్టి నూనె వేడిచేయ్యాలి, కాగిన తరువాత 
    పోపుదినుసులు, ఎండిమిర్చి, కరివేపాకు వేసి వేగాక పప్పును తాలింపులో 
    వేసి మూత పెట్టాలి.


* అంతే ఏంతో రుచిగా ఉండే దోసకాయ పప్పు రెడి.