వంటపేరు : మైసూర్ బొండా
కావలసిన పదార్దములు :
మైదా : పావుకేజీ
బియ్యపు పిండి : వంద గ్రాములు
ఉప్పు : తగినంత
మజ్జిగ : ఒక గ్లాసు
ఉల్లిముక్కలు : కొద్దిగా
అల్లం ముక్కలు : కొద్దిగా
పచ్చిమిర్చి ముక్కలు : కొద్దిగా
జీలకర్ర : కొంచెం
వంటసోడా : టీ స్పూన్
నూనె : వేయించటానికి సరిపడా
తయారుచేయు విధానం :
1) మైదాను జల్లించి ఒకగిన్నెలో వేసి, బియ్యపు పిండి, టీ స్పూన్ నూనె,
ఉప్పు, మజ్జిగ, వంటసోడా, ఉల్లి ముక్కలు, అల్లం ముక్కలు, మిర్చి
ముక్కలు, జీలకర్ర వేసి చిక్కగా బజ్జి పిండిలా కలపాలి.
2) దీనిని అరగంట పక్కన పెట్టాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కళాయిపెట్టి నూనె వేడిచేయ్యాలి. నూనె కాగాక మైదాపిండిని చిన్నచిన్న ఉండలుగా చేతితో తీసి నూనెలో దోరగా వేగాక
ఒక ప్లేటులోకి తియ్యటమే.
* అంతే మైసూర్ బొండా రెడి.
Post a Comment