వంటపేరు : పొంగలి
కావలసిన పదార్దములు :
బియ్యం : అరకేజీ
బొబ్బర పప్పు : పావుకేజీ
ఉప్పు : తగినంత
నెయ్యి : వంద గ్రాములు
జీడిపప్పు : వంద గ్రాములు
తయారుచేయు విధానం :
1) బొబ్బరపప్పును రాళ్ళు లేకుండా శుబ్రం చెయ్యాలి.
2) బియ్యం, బొబ్బర పప్పు కలిపి, కడిగి కుక్కర్లో వేసి, ఉప్పు, సరిపడా నీళ్ళు
పోసి స్టవ్ మీద పెట్టాలి.
3) నెయ్యి వేడిచేసి జీడిపప్పులు దోరగా వేపాలి. కుక్కర్ రెండు విజిల్సు
వచ్చాక స్టవ్ ఆపాలి.
4) ఇప్పుడు ఆవిరి పోయాక కుక్కర్ మూతతీసి వేపిన జీడిపప్పులు,
మిగిలిన నెయ్యి వేసి ఒకసారి కలపాలి.
* దీనిలో బెల్లం వేసుకుని తింటే చాల బాగుంటుంది.
(జీడిపప్పుతో పాటు అల్లం ముక్కలు, జీలకర్ర, మిరియాలు, కరివేపాకు, నేతిలో తాలింపు వేసి వుడికిన పొంగలిలో వేసుకోవచ్చు. దీనిని కొబ్బరి చెట్నితో తింటే బాగుంటుంది)
300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te