Showing posts with label vegetarian-biryani. Show all posts


కావలసిన పదార్దాలు :

బియ్యం : అరకిలో

ఉల్లి ముక్కలు : అర కప్పు
పచ్చిమిర్చి  : ఆరు
ఉప్పు : తగినంత
డాల్డా : పావుకప్పు
పుదినా : రెండు కట్టలు చిన్నవి
చెక్క, లవంగా, యాలుకలు, అల్లం వెల్లుల్లి,కొత్తిమీర,అనాస పువ్వు, పుదినా కలిపి పేస్టులా చేసిన మసాలా : 1 కప్పు
ఉడికించిన గ్రుడ్లు : మూడు

తయారుచేయు విధానం :

1) బియ్యం కడిగి నీళ్ళు వంచి పక్కన పెట్టాలి.

2) ఇప్పుడు స్టవ్ ఫై గిన్నె పెట్టి డాల్డా వేడి చెయ్యాలి.
3) డాల్డా వేడి అయ్యాక ఉల్లి ముక్కలు వేసి కాసేపు వేయించాలి. 
తరువాత పచ్చిమిర్చి ముక్కలు వేసి వేగాక అన్ని కలిపి పేస్టు చేసిన పుదినా పేస్టు వేసి వేయించాలి.
4) ఇప్పుడు ఒక లీటరు నీళ్ళు పోసి  ఉప్పు వేసి మూతపెట్టి మరగనివ్వాలి.
5) నీళ్ళు మరుగుతుండగా బియ్యం వేసి కలిపి మూతపెట్టి పది నిముషాలు ఉడికించాలి. అంతే పుదినా పలావ్ రెడీ
6) దీనిని ఎగ్ పిసెస్ (గ్రుడ్లు )తో అలంకరించి సర్వ్ చెయ్యాలి.



కావలసిన పదార్దాలు 

బాస్మతి రైస్ - పావు కేజీ
జీలకర్ర- అర టీ స్పూన్
మిరియాలు- టీ స్పూన్
లవంగాలు - మూడు
ఏలకులు - రెండు
బిర్యానీ ఆకు- ఒకటి
ఉల్లిపాయ ముక్కలు -కప్పు
చిన్న ఉల్లిపాయలు - కప్పు
ఉప్పు- తగినంత
తరిగిన కొత్తిమీర - అరకప్పు బాస్మతి రైస్ - 200గ్రా
నెయ్యి - రెండు టేబుల్ స్పూన్లు


తయారుచేయు విధానం


1) ముందుగా అన్నం వండి చల్లారనివ్వాలి.
2) కళాయి లో నెయ్యి వేడి చేసి జీలకర్ర, మిరియాలు, లవంగాలు, బిర్యానీ ఆకు వేసి వేయించాలి.
3) అవి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు, చిన్న ఉల్లిపాయలను వేసి గోధుమరంగు వచ్చే వరకు వేయించాలి. 
4) ఇప్పుడు అన్నం, ఉప్పు వేసి కలిపి దించేయాలి.

 
కావలసిన పదార్దాలు :

బియ్యం : అర కిలో
కారెట్ : నాలుగు (ముక్కలుగా కట్ చెయ్యాలి )
బీన్సు: వంద గ్రాములు ( ముక్కలుగా కట్ చెయ్యాలి )
బంగాళా దుంపలు : నాలుగు ( చిన్న ముక్కలుగాకట్ చెయ్యాలి )
ఉల్లిపాయలు : అయిదు ( నిలువుగా ముక్కలు చేసుకోవాలి)
పచ్చి బఠాణీ : ఒక కప్పు  ( నాన బెట్టినవి )
లవంగాలు: అయిదు
యాలకులు : ఆరు
దాల్చిన చెక్క : ఆరు ముక్కలు
అల్లం వెల్లుల్లి ముద్ద : రెండు టీ స్పూన్లు
నేయ్యి లేదా డాల్డా : తగినంత
పచ్చిమిర్చి: ఆరు(నిలువుగా చీలికలు చేసుకోవాలి)
ధనియాలు, జీలకర్ర పొడి: రెండు స్పూన్లు
కారం: ఒక స్పూను
పసుపు: చిటికెడు
ఉప్పు : తగినంత
నీరు: ఒకలీటరు
కొత్తిమీర: ఒక కట్ట
పుదినా : అర కట్ట
జీడిపప్పు: పది పదిహేను
బిర్యాని ఆకు : రెండు మూడు

తయారుచేయు విధానం :

1) ముందుగా బియ్యం కడిగి నీటిలో ఒక అరగంట నాన నివ్వాలి. కూరలన్నీ తరిగి పెట్టుకోవాలి.
2) ఒక కుక్కర్ తీసుకొని స్టవ్ మీద పెట్టాలి. అందులో సుమారు రెండు మూడు టేబుల్ స్పూన్ల నూనె వేసుకోవాలి.
3) నూనె కాగాక అందులో లవంగాలు, యాలకులు , జీడి పప్పు, బిర్యాని ఆకు మరియు చెక్క వేసి వేయించాలి.
4) ఇప్పుడు అందులో ఉల్లిపాయలు వేసి దోరగా వేపి .ఉల్లిపాయలు వేగాక అల్లం వెల్లుల్లి ముద్ద వెయ్యాలి. అది పచ్చి వాసన పోయే దాక వేయించి పచ్చి మిర్చి వేసుకోవాలి.
5) వేగాక అందులో తరిగి ఉంచుకున్న కూరగాయ ముక్కలు వేసుకోవాలి.అవి కొంచెం వేగ నివ్వాలి.
6) ఇప్పుడు నానబెట్టుకున్న బియ్యం వెయ్యాలి. అన్ని బాగా కలిపి కొత్తిమీర, పుదినా, ఉప్పు, పసుపు, కారం మరియు ధనియాలు జీలకర్ర పొడి వేసి బాగా కలుపుకోవాలి.
7) ఇప్పుడు ఒక లీటరు నీరు పోసి అన్నీ బాగా కలిపి మూత పెట్టుకోవాలి.కుక్కర్ రెండు విజిల్స్ రాగానే కట్టేయ్యాలి.
అంతే ఎంతో రుచిగా ఉండే వెజిటబుల్ బిర్యాని రెడీ


ఆలూ పలావ్ 

కావలసిన పదార్ధాలు 

చిన్న బంగాళదుంపలు - పావు కిలో,
బియ్యం - పావుకిలో
ఉల్లిపాయ -ఒకటి
పచ్చిమిర్చి - ఐదు
పుదీనా - చిన్న కట్ట,
అల్లం వెల్లుల్లిముద్ద - టీ స్పూను,
ఏలకులు - ఐదు
లవంగాలు -ఐదు
దాల్చినచెక్క - అంగుళం ముక్క,

షాజీరా - టీ స్పూను
నూనె - మూడు టీ స్పూన్లు,
నెయ్యి - రెండు  టీస్పూన్లు
పచ్చిబఠాణీలు - వంద గ్రాములుతాయారు చేయు విధానం 

1) బియ్యం కడిగి పది నిముషాలు నాననివ్వాలి. 
2) పాన్ లో నూనె, నెయ్యి కలిపి వేడి చేయాలి.
3) అందులో నిలువుగా తరిగిన ఉల్లిపాయ వేసి వేయించాలి.
4) తరవాత నిలువుగా చీల్చిన పచ్చిమిర్చి, పుదీనా ఆకులు, గరంమసాలా , 5) పచ్చిబఠాణీలు, అల్లం వెల్లుల్లి ముద్ద వేసి కొద్దిసేపు వేయించాలి.
6) ఇప్పుడు బంగాళా దుంపలు వేసి వేయించాలి.
7) అవి వేగాక నీళ్లు పోసి తగినంత ఉప్పు వేసి మరిగించాలి.
8) నీళ్ళు మరుగుతుండగా బియ్యాన్ని వేసి ఉడికించాలి. 
9) బియ్యం పది నిముషాలు ఉడికించి మంట తగ్గించి మూతపెట్టినిదానంగా మరో ఐదు నిముషాలు మగ్గనిచ్చి దింపేయాలి.

2
కేరెట్ లా వుండి  కాస్త ముదురు రంగులో వుండే దుంపను గాజర్ అంటారు.













వంటపేరు : గాజర్ ప్రైడ్ రైస్ 

కావలసిన పదార్ధాలు :

గాజర్ తురుము : ఒక కప్పు 
బియ్యం : రెండు కప్పులు 
వుల్లిపాయ : ఒకటి 
క్యాప్సికం : ఒకటి 
బీన్సు : ఐదు 
టమాట : ఒకటి
అల్లంవెల్లుల్లి పేస్టూ : ఒక టీ స్పూన్ 
జీలకర్ర : టీ స్పూన్ 
మిరియాలపొడి : టీ స్పూన్
నూనె : చిన్న కప్పు 
ఉప్పు : సరిపడా 
జీడిపప్పులు : కొద్దిగా 

తయారుచేయు విధానం :

1) స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేడి చెయ్యాలి. కాగిన తరువాత  కడిగి ఉంచిన బియ్యం వేసి రెండు నిముషాలు వేపి నీళ్ళు పోసి అన్నం ఉడికిన తరువాత  చల్లారబెట్టాలి. 
2) ఇప్పుడు స్టవ్ మీద  కళాయి పెట్టి నూనె వేసి కాగిన తరువాత జీడిపప్పులు, ఉల్లి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, బీన్సు ముక్కలు, జీలకర్ర వేసి ఒక నిముషం వేయించాలి.
3) తరువాత అల్లంవెల్లుల్లి పేస్టూ, టమాట ముక్కలు, మిరియాలపొడి, ఉప్పు వేసి దోరగా వేగాక గాజర్ తురుము వేసి రెండు నిముషాలు వేపాలి.
4)  బాగా వేగిన తరువాత  చల్లార్చిన అన్నాన్ని వేసి బాగా కలిపి పది నిముషాలు చిన్న మంటమీద ఉంచి కొత్తిమిర జల్లి స్టవ్ ఆపాలి.


* అంతే ఘుమఘుమలాడే గాజర్ ప్రైడ్ రైస్ రెడి.

1


వంటపేరు : వెజ్ బిర్యాని


కావలసిన పదార్దములు :


బియ్యం : కిలో 
టమాటాలు : నాలుగు  
పుదీనా ఆకులూ : పది 
ఉల్లిపాయలు : రెండు 
కాలి ఫ్లవర్ : పువ్వులో నాలుగో వంతు 
బంగాళాదుంపలు : రెండు 
బీన్స్ : పన్నెండు 
మెంతు కూర : రెండు కట్టలు
కేరెట్లు : మూడు 
బటానీలు : అర కప్పు 
పెరుగు : కప్పున్నర 
అల్లంవెల్లుల్లి : రెండు టీ స్పూన్లు 
పచ్చిమిర్చి : ఐదు 
పసుపు : అర టీ స్పూన్  
కారం : టీ స్పూన్ 
ఉప్పు : సరిపడా 
గరం మషాలా : టీ స్పూన్ 
నెయ్యి : నాలుగు టేబుల్ స్పూన్లు 
నూనె : అర కప్పు 
కొత్తిమీర : కట్ట 


తయారుచేయు విధానం :


1) బియ్యం కడిగి పావుగంట నాననివ్వాలి. 
2) స్టవ్ వెలిగించి బాణిలో నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక పచ్చిమిర్చి, ఉల్లి 
    ముక్కలు వేసి వేగాక, అల్లంవెల్లుల్లి పేస్టూ వేసి కలిపి అర టీస్పూన్ గరం 
    మషాలా, పసుపు, కారం, కూరగాయల ముక్కలు వేసి కలిపి పెరుగు వేసి 
    కాసేపు వేయించాలి. 
3) పెరుగు మొత్తం యిగిరి పోయాక దించి పక్కన పెట్టాలి.
4) లీటరున్నర నీటిని ఎసరుపెట్టి కాగిన తరువాత పుదీనా, మెంతుకూర, 
    కొత్తిమీర, మిగిలిన మసాలా, ఉప్పు వేసి బియ్యం వేసి మూడొంతులు 
    వుడికిన తరువాత సిమ్ లో పెట్టాలి.
5) ఇప్పుడు వేరే పాన్ స్టవ్ మీద పెట్టి కాస్త నెయ్యి వేసి, అన్నం వెడల్పుగా 
    సర్ది ఫైన కురగాయముక్కల మిశ్రమం వేసి సర్దాలి. అలా పొరలుపొరలుగా 
    వేసిన తరువాత మిగిలిన నెయ్యి వేసి మూత పెట్టి పది నిముషాలు సింలో 
    వుంచి ఆవిరి బయటకు రావటం చూసి ఒక నిముషం తరువాత స్టవ్ ఆఫ్ 
    చెయ్యాలి.


* అంతే వెజ్ బిర్యాని రెడి.



1
వంట పేరు : టమాట రైస్ 


కావలసిన పదార్ధాలు :


బియ్యం : అర కిలో
టమాటాలు : అర కిలో
(నాలుగు గ్లాసుల రసం తియ్యాలి )
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : నాలుగు
గరం మసాల : అర టీ స్పూన్
కొత్తిమిర : కట్ట
యాలకులు : మూడు
లవంగాలు : రెండు
పసుపు : చిటికెడు
నెయ్యి : పావు కప్పు
కారం : టీ స్పూన్
ఉప్పు: సరిపడా
కరివేపాకు : రెండు రెమ్మలు


తయారుచేయు విధానం :


1) బియ్యం కడిగి నానబెట్టాలి.
2) టమాటాలు వేడి నీటిలో వేసి, మెత్తబడ్డాక మిక్సిలో వేసి కొద్దిగా నీళ్లు కలిపి 
    టమాట రసం నాలుగు గ్లాసులు వచ్చేలా తియ్యాలి.
3) స్టవ్ వెలిగించి, గిన్నెలో నెయ్యి వేసి కాగిన తరువాత యాలకులు, 
    లవంగాలు, కరివేపాకు వేసి వేగాక, ఉల్లి ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు 
    వేసి వేపాలి. 
4) ఇప్పుడు పసుపు, కారం, ఉప్పు, గరం మసాల, కొత్తిమిర  వేసి కాసేపు 
    వేగనిచ్చి బియ్యం వేసి అర నిముషం వేపాలి.
5) తరువాత టమాట రసం వేసి ఒకసారి కలిపి, మూతపెట్టి పది నిముషాలు   
    పెద్ద మంటమీద ఉడికించి, తరువాత పది నిముషాలు చిన్న మంట మీద 
    ఉడికించాలి .
6) ఇప్పుడు స్టవ్ ఆపి కొత్తిమిర జల్లి వేడివేడిగా వడ్డించాలి .


* అంతే టమాట రైస్ రెడి.



1
వంటపేరు : పులావ్ 




కావలసిన పదార్ధాలు :


బాస్మతి బియ్యం : అరకిలో (రెండు గ్లాసులు )
ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి: మూడు
అల్లంవెల్లుల్లి పేస్ట్ : 1 టేబుల్ స్పూన్
లవంగాలు : ఐదు
దాల్చినచెక్క : చిన్న ముక్కలు రెండు
యలుకులు : నాలుగు
మరాటి మొగ్గలు : నాలుగు
జాజికాయ : చిన్న ముక్క
జాపత్రి : రెండు రేకులు
పలావు ఆకు : మూడు
సాజిరా : 1 టీ స్పూన్
కొత్తిమిర : 1 కట్ట
పుదినా : అరకట్ట
ఉప్పు : సరిపడ
నెయ్యి : అర కప్పు


తయారుచేయు విధానం :


1) బియ్యం కడిగి నీళ్లు వంచి పక్కన పెట్టాలి.
2) ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, టమాటాలు ముక్కలుగా కట్ చెయ్యాలి.
3) ఇప్పుడు స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి నెయ్యి వేడిచేయ్యాలి.
4) మసాల దినుసులన్నీ వేసి వేగనివ్వాలి. పచ్చిమిర్చి ముక్కలు , ఉల్లి 
    ముక్కలు వేసి వేపాలి.
5) తరువాత అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి మంచి వాసన వచ్చేవరకు వేపి, కొత్తిమిర, 
    పుదినాకూడా వేసి ఒకసారి కలపాలి.
6) ఇప్పుడు బియ్యం వేసి కాసేపు కలిపి, ఉప్పు, నాలుగు గ్లాసుల నీళ్లు వేసి 
    కుక్కర్ మూతపెట్టాలి.
7) కాసేపటికి విజిల్స్ రావటం మొదలు పెడుతుంది, ఇప్పుడు రెండే రెండు 
    విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపాలి.


* అంతే పులావ్ రెడి.





కావలసిన పదార్ధాలు :

కొబ్బరి కాయలు : 2
బియ్యం : అరకిలో
పసుపు : 1 టీ స్పూన్
పచ్చిమిర్చి : నాలుగు
ఉ ప్పు : సరిపడ
లవంగాలు : నాలుగు
దాల్చిన చెక్క : చిన్న ముక్క
నెయ్యి : రెండు టీ స్పూన్ లు

తయారుచేయు విధానం :

1) ముందుగ బియ్యం కడిగి నీళ్ళుపోసి నానబెట్టాలి.
2) కొబ్బరి కాయలు కొట్టి కొబ్బరి తీసి చిన్న ముక్కలుగా కొయ్యాలి.
3) చిన్నగా కోసిన కొబ్బరి ముక్కలను మిక్సిలో వేసి కొద్దిగా నీళ్ళు కలిపి 
    కొబ్బరి పాలు తియ్యాలి.
4) ఇవి లీటరు వచ్చేవరకు మిక్సిలో వేస్తూ మొత్తం కొబ్బరిలో పాలు అన్ని 
    తీసి లీటరు కొలిచి పక్కన పెట్టాలి.
5) స్టవ్ పై కుక్కరు పెట్టి నెయ్యి వేసి కాగిన తరువాత లవంగాలు, చెక్క,    
    పచ్చిమిర్చి చీలికలు వేసి తరువాత పసుపు కలపాలి.
6) ఇప్పుడు నానపెట్టిన బియ్యం వేసి, కలిపి కొబ్బరి పాలు, ఉప్పు వేసి 
    మూతపెట్టాలి.
7) రెండు విజిల్సు వచ్చాక స్టవ్ ఆపి, కుక్కర్ ఆవిరి పోయేవరకు వుండి, 
    మూత తీసి ఒకసారి కలిపి కరివేపాకు వేసి మూతపెట్టాలి.


* అంతే రెండు నిముషాలకు కొబ్బరి అన్నం తినటానికి రెడి.

గమనిక : దీనిలో కోడికూర చాల బాగుంటుంది.

Powered by Blogger.