Showing posts with label vegetarian-fried-rice. Show all posts

మసాలా బాత్ 
కావలసినపదార్దాలు: 

బియ్యం : అర కేజీ 
జీడిపప్పు : సరిపడ 
జీలకర్రపొడి : స్పూన్ 
దాల్చిన చెక్క:  కొద్దిగా 
ఇంగువ : చిటికెడు 
ఆవాలు :  స్పూన్ 
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు  
దొండకాయలు : పావుకేజీ  
పచ్చిమిర్చి: ఆరు 
ధనియాల పొడి :  స్పూన్ 
నువ్వులు :  స్పూన్ 
ఎండుకొబ్బరి పొడి : రెండు స్పూన్లు  
లవంగాలు : కొన్ని 
ఉప్పు :  సరిపడ

 తయారు చేసే విధానం:


1) స్టవ్ ఫై గిన్నె పెట్టి నెయ్యి వేడిచేయాలి. 

2) దీనిలో ఆవాలు, కరివేపాకు, ఇంగువ వేసి తాలింపు పెట్టాలి.
3) ఇప్పుడు దొండకాయల ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు వేసి కాసేపు వేయించాలి. 
4) దీనిలోనే బియ్యం వేసి కొద్దిగా ఫ్రై చేసి నీళ్లుపోసి కలిపి ఉడికించాలి. 
5) అన్నం ‌సగం ఉడి కాక మసాలా  పొడి, ఎండుకొబ్బరి, ఉప్పు, నువ్వుల 6) పొడి వేసి కలిపి చిన్న మంట మీద ఉడికిస్తే మసాలా బాత్‌ రైస్ రెడీ.
7) స్టౌఆపి దీని పైన కొత్తిమీర, వేయించిన జీడిపప్పు తో అలంకరించి సర్వ్‌ చేయాలి.
మసాలా బాత్ రెడీ.

2
కేరెట్ లా వుండి  కాస్త ముదురు రంగులో వుండే దుంపను గాజర్ అంటారు.













వంటపేరు : గాజర్ ప్రైడ్ రైస్ 

కావలసిన పదార్ధాలు :

గాజర్ తురుము : ఒక కప్పు 
బియ్యం : రెండు కప్పులు 
వుల్లిపాయ : ఒకటి 
క్యాప్సికం : ఒకటి 
బీన్సు : ఐదు 
టమాట : ఒకటి
అల్లంవెల్లుల్లి పేస్టూ : ఒక టీ స్పూన్ 
జీలకర్ర : టీ స్పూన్ 
మిరియాలపొడి : టీ స్పూన్
నూనె : చిన్న కప్పు 
ఉప్పు : సరిపడా 
జీడిపప్పులు : కొద్దిగా 

తయారుచేయు విధానం :

1) స్టవ్ వెలిగించి గిన్నె పెట్టి నూనె వేడి చెయ్యాలి. కాగిన తరువాత  కడిగి ఉంచిన బియ్యం వేసి రెండు నిముషాలు వేపి నీళ్ళు పోసి అన్నం ఉడికిన తరువాత  చల్లారబెట్టాలి. 
2) ఇప్పుడు స్టవ్ మీద  కళాయి పెట్టి నూనె వేసి కాగిన తరువాత జీడిపప్పులు, ఉల్లి ముక్కలు, క్యాప్సికం ముక్కలు, బీన్సు ముక్కలు, జీలకర్ర వేసి ఒక నిముషం వేయించాలి.
3) తరువాత అల్లంవెల్లుల్లి పేస్టూ, టమాట ముక్కలు, మిరియాలపొడి, ఉప్పు వేసి దోరగా వేగాక గాజర్ తురుము వేసి రెండు నిముషాలు వేపాలి.
4)  బాగా వేగిన తరువాత  చల్లార్చిన అన్నాన్ని వేసి బాగా కలిపి పది నిముషాలు చిన్న మంటమీద ఉంచి కొత్తిమిర జల్లి స్టవ్ ఆపాలి.


* అంతే ఘుమఘుమలాడే గాజర్ ప్రైడ్ రైస్ రెడి.

Powered by Blogger.