కావలసిన పదార్ధాలు :
రాజ్మా : పావు కప్పు
బాస్మతి బియ్యం : రెండు కప్పులు
పుదినా : అర కప్పు
ఉల్లిపాయలు : రెండు
పచ్చిమిర్చి : నాలుగు
అల్లం వెల్లుల్లి పేస్టు : టేబుల్ స్పూన్
ఉప్పు : తగినంత
కొత్తిమీర తురుము : కప్పు
యాలుకులు : రెండు
లవంగాలు : నాలుగు
దాల్చిన చెక్క : చిన్నది
జీలకర్ర : టీ స్పూన్
పలావ్ ఆకు లు : రెండు
జీడిపప్పులు : ఆరు
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు
నూనె : మూడు టేబుల్ స్పూన్లు
తయారు చేయు విధానం :
1) రాత్రంతా రాజ్మాగింజలు నానబెట్టాలి. బాగానానితే బాగా ఉడుకుతాయి.
2) బియ్యం కడిగి పదినిముషాలు నానబెట్టాలి. నేతిలో జీడిపప్పులు వేయించాలి. పుదీనాఆకులు పేస్టులా చెయ్యాలి.
3) పాన్ లో నూనెవేసి యాలుకులు, లవంగాలు, చెక్క, పలావ్ ఆకు, జీలకర్ర వేసి వేయించాలి.
4) అవి వేగాక ఉల్లిముక్కలు, పచ్చిమిర్చిముక్కలు, అల్లంవెల్లుల్లి పేస్టు, రాజ్మా గింజలు, పుదినా పేస్టు వేసి వేయించాలి.
5) ఇప్పుడు బియ్యంవేసి ఐదునిముషాలు వేయించి ఉప్పువేసి మూడున్నర కప్పుల నీళ్ళు పోసి ఉడికించాలి.
6) ఉడికిన తరువాత జీడిపప్పులు, కొత్తిమీర వేసి కలిపి మూతపెట్టి స్టవ్ ఆపాలి.

300 ల రకాల వంటకాలు సంపుటిలో ఉన్నవి. చూచుటకు ఈ క్రింది లింక్ ని క్లిక్ చేయండి.
ReplyDeletehttp://www.samputi.com/launch.php?m=recipe&l=te