సగ్గుబియ్యం : కప్పు
నూనె రెండు : టీ స్పూన్లు
కరివేపాకు : కొద్దిగా
పోపుదినుసులు : టీ స్పూన్
ఎండుమిర్చి : రెండు
పచ్చిమిర్చి : మూడు
ఉప్పు తగినంత
పల్లీలు : అర కప్పు
కొత్తిమీర : కొంచెం
తయారుచేయు విధానం :
1) పల్లీలు వేయించి పొడిచెయ్యాలి. పల్లిపొడి ఎక్కువ వేస్తె బాగుంటుంది.
2) సగ్గుబియ్యం నీళ్ళల్లో ఐదునిముషాలు నాననిచ్చి నీళ్ళువంచి పక్కనపెట్టాలి.
3) స్టవ్ మీద కళాయిపెట్టి నూనె వేడిచేసి పోపుదినుసులు, ఎండు
మిర్చి, కరివేపాకు, పచ్చిమిర్చి, పసుపు ఒకదాని తరువాత ఒకటి వేసి వేయించాలి.
4) అవి వేగిన తరువాత నానబెట్టిన సగ్గుబియ్యం వేసి ఐదునిముషాల
వేయించాలి.
5) ఇప్పుడు ఉప్పు, పల్లీలపొడి వేసి మరో ఐదునిముషాలు వేయించి
కొత్తిమీర వేసి స్టవ్ ఆపాలి.