ఫ్రూట్ కేక్ (Fruit Cake Preparation in Telugu)

కావలసిన పదార్దాలు :


పాలు : పావు లీటర్
కస్టర్డ్ పొడి : మూడు టీ స్పూన్లు 
ఆపిల్ ముక్కలు : పావు కప్పు 
అరటి ముక్కలు : పావు కప్పు 
ఆరంజ్ ముక్కలు : పావు కప్పు 
అనాస ముక్కలు : పావు కప్పు 
సపోటా : ఒకటి 
జీడిపప్పులు : పది
బాదాం : పది
షుగర్ : పావు కప్పు 
కేక్ ముక్కలు : ఆరు 
మామిడి ముక్కలు : పావుకప్పు 
ప్ప్రూటి ప్రూటి : రెండు టేబుల్ స్పూన్లు 
ఐస్ క్రీం : కప్పు 


తయారుచేయు విధానం : 


1) ఫ్రూట్స్ అన్ని ముక్కలుగా కట్ చెయ్యాలి. అరకప్పు పాలల్లో కస్టర్డ్ పొడి కలిపి పక్కనపెట్టాలి.
2) జీడిపప్పులు, బాదాంలు చిన్నచిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి.
3) స్టవ్ మీద పాలు మరిగించాలి. మరిగిన పంచదార వేసి కలపాలి. తరువాత పాలల్లో కలిపిన కస్టర్డ్ పొడి వేసి కలుపుతూఉండాలి. రెండునిముషాలు కలిపాక పాలు చిక్కబడతాయి.
4) ఇప్పుడు స్టవ్ ఆపి చిక్కపడ్డ పాలుని చల్లారనివ్వాలి.
5) ఇప్పుడు కేక్ ముక్కను మద్యకు కట్ చేసి రెండుగా చెయ్యాలి.
6) ఒక గిన్నెలో ముందుగా నాలుగు కేకు ముక్కలు పరచి ఫైన జీడిపప్పు, బాదంముక్కలు వేసి వాటి మీద ఫ్రూట్ ముక్కలు వేసి, వాటి మీద చల్లారిన కస్టర్డ్ మిశ్రమం వెయ్యాలి.
7) అలా మళ్ళి కేకు ముక్కలు, కట్ చేసిన ప్రూటిలు ఫ్రూట్ ముక్కలు, జీడిపప్పుముక్కలు ఒకదాని మీద ఒకటి వేసి వాటి  ఫైన కస్టర్డ్ మిశ్రమం వేసి దానిమీద ప్రూట్ ముక్కలు వేసి వాటిఫైన ఐస్ క్రీం వేసి సమంగా సర్ది ఫైన చెర్రిపళ్ళు ముక్కలుతో గార్నిష్ చేసుకోవాలి.
ఒకగంట ఫ్రిజ్ లో పెట్టి చల్లబదిన తరువాత సర్వ్ చెయ్యాలి.