కావలసిన పదార్దములు :
పచ్చిరొయ్యలు : అర కేజీ
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్
గరం మషాలా : టీ స్పూన్
కొత్తిమీర : కొద్దిగా
వంకాయలు : ఒకపావుకిలో
ఉల్లిపాయ : ఒకటి
పచ్చిమిర్చి : నాలుగు
నూనె : రెండు టేబుల్ స్పూన్లు
కారం : టీ స్పూన్
ఉప్పు : సరిపడ
పసుపు : పావు టీ స్పూన్
కరివేపాకు : రెండు రెమ్మలు
తయారుచేయు విధానం :
1) పచ్చి రొయ్యలు వలిచి శుబ్రంగా కడిగి కొద్దిగా ఉప్పు,పసుపు,వేసి కలిపి స్టవ్ మీద పెట్టి నీరు పోయేంత వరకు ఉడకబెట్టి దించి పక్కన ఉంచాలి.
2) వంకాయను ముక్కలుగా కోయ్యాలి. ఉల్లి, పచ్చిమిర్చి ముక్కలుగా చెయ్యాలి.
3) స్టవ్ వెలిగించి బాండి పెట్టి నూనె వేడి చేసి ఉల్లి, మిర్చిముక్కలు వేసి వేగనిచ్చి అల్లం వెల్లుల్లి పేస్టు వేసి పచ్చివాసన పోయేవరకు వేపి వంకాయ ముక్కలు వేసి రెండునిముషాలు మగ్గనివ్వాలి.
4) మూతతీసి వుడికించిన రొయ్యలు వేసి రెండునిముషాలు వేయించి కారం, ఉప్పు, పసుపు వేసి కలిపి చిన్నగ్లాస్ నీళ్ళు పోసి పదినిముషాలు వుడకనివ్వాలి.
5) కూర రెడీ అవ్వగానే గరంమషాలా, కొత్తిమీర చల్లి కలిపి మూతపెట్టి స్టవ్ ఆపాలి.
* అంతే పచ్చిరొయ్యలు, వంకాయ కూర రెడీ.