బెల్లం తాళికలు (ఆరిది) (Bellam Thalikalu or Aaridi in Telugu)

కావలసిన పదార్దాలు :


బియ్యపు పిండి : కప్పు 
పాలు : కప్పు
కొబ్బరి తురుము : అర కప్పు
బెల్లం కోరు : కప్పు
యాలుకుల పొడి : టీ స్పూన్
నెయ్యి : అర కప్పు


తయారుచేయు విధానం :


1) ముందుగా స్టవ్ ఫై కప్పు నీళ్ళు పెట్టి మరిగించాలి. మరుగుతున్న నీళ్ళల్లో బియ్యప్పిండి వేసి ముద్దలా కలపాలి.
2) ఉడికిన పిండిని ఒక బల్లమీద పొడవుగా పెన్సిల్ లా చేసి పక్కన పెట్టాలి.
3) స్టవ్ మీద గిన్నెపెట్టి ఒక కప్పు పాలు రెండు కప్పుల నీళ్ళు కలిపి మరిగించాలి. అవి మరుగుతుండగా చేసి పెట్టిన తాలికులు వేసి ఉడకనివ్వాలి.
4) పది నిముషాలకు తాలికులు ఉడుకుతాయి. ఇప్పుడు బెల్లం, కొబ్బరి, యాలుకుల పొడి వేసి ఐదు నిముషాలు ఉడికించాలి. 
(దించేముందు పలుచగా ఉంటె ఒక టేబుల్ స్పూన్ బియ్యపు పిండి వేసి కలిపితే చిక్కగా అవ్వుతుంది)

South Indian recipe preparation in telugu language.Andhra telugu Vantalu in telugu, traditional, special, sweets, breakfast, vegeterian and non vegeterian cooking for telugu people.