ఆలూ మిరపకాయ బజ్జి (Stuffed Aloo Mirchi Bujji in telugu Bangala Mirapakaya Bajji)

స్టఫింగ్ కోసం : 


బంగాళా దుంపలు : రెండు 
జీలకర్ర : టీ స్పూన్ 
అల్లం వెల్లుల్లి పేస్టు : టీ స్పూన్ 
ఉప్పు : తగినంత 
కొత్తిమీర తరుగు : కొద్దిగా 
పసుపు : చిటికెడు 
నిమ్మ రసం : టీ స్పూన్ 


బజ్జి తయారికి :


శెనగ పిండి : కప్పు 
పచ్చిమిర్చి : పది 
వామ్ము : టేబుల్ స్పూన్ 
వంట సోడా : చిటికెడు 
ఉప్పు : తగినంత 


తయారుచేయు విధానం :


1) బంగాళా దుంపలు వుడికించి వలిచి ఒక గిన్నెలో వేసి చేతితో మెత్తగా చెయ్యాలి.
2) దీనిలో ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి పేస్టు,కొత్తిమీర తరుగు, జీలకర్ర, నిమ్మరసం వేసి బాగా కలిపి పక్కన పెట్టాలి.
3) ఇప్పుడు పచ్చిమిర్చికి ఒక ప్రక్క నిలువుగా గాటు పెట్టి లోపలగింజలు తీసివెయ్యాలి. అలా చేసిన పచ్చిమిర్చిలో బంగాళాదుంప మిశ్రమం పెట్టి ఒక ప్లేటులో పెట్టుకోవాలి.
4) ఒకగిన్నె లో శెనగ పిండి వేసి దానిలో ఉప్పు,  వామ్ము, వంటసోడా వేసి కొద్దిగా నీళ్ళు పోసి చిక్కగా బజ్జిలా పిండిలా కలపాలి.
5) స్టవ్ ఫై కళాయి పెట్టి నూనె వేడి చెయ్యాలి. నూనె కాగాక స్టఫ్ చేసిన మిరపకాయలు శెనగపిండిలో ముంచి కాగెనూనెలో వేసి దోరగా వేయించు కోవాలి.

South Indian recipe preparation in telugu language.Andhra telugu Vantalu in telugu, traditional, special, sweets, breakfast, vegeterian and non vegeterian cooking for telugu people.