కావలసిన పదార్దాలు :
కందిపప్పు : కప్పు
వంకాయలు : రెండు
టమాటాలు : రెండు
పచ్చిమిర్చి : నాలుగు
ఉల్లి పాయ : ఒకటి
పసుపు : పావు టీస్పూన్
కారం : అర టీ స్పూన్
ఉప్పు : సరిపడా
వెల్లుల్లి రేకలు : పది
జీలకర్ర : పావు టీ స్పూన్
పోపుదినుసులు : టీ స్పూన్
ఎండు మిర్చి : రెండు
కరివేపాకు : రెండు రెమ్మలు
కొత్తిమీర : కొద్దిగా
నెయ్యి : టేబుల్ స్పూన్
చింత పండు : నిమ్మకాయంత
తయారుచేయు విధానం :
1) వంకాయలు చిన్న ముక్కలుగా కట్ చేసి నీళ్ళల్లో వేసి ఉంచాలి. టమాటా, పచ్చిమిర్చి, ఉల్లిపాయలు ముక్కలుగా కట్ చేసుకోవాలి.
2) కంది పప్పు బాగాకడిగి కుక్కర్లో వేసి రెండు కప్పుల నీళ్ళు పోసి అరగంట నానబెట్టాలి.
3) స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టాలి. మూడు విజిల్స్ వచ్చాక స్టవ్ ఆపాలి.
4) కుక్కర్ ఆవిరిపోయాక మూతతీసి పచ్చిమిర్చి ముక్కలు, టమాటా ముక్కలు, ఉల్లి ముక్కలు, వంకాయ ముక్కలు, పసుపు, కారం వేసి వుడకనివ్వాలి. పదినిముషాలు వుడికిన తరువాత ఉప్పు, చింతపండు రసం వేసి ఐదునిముషాలు వుడకనివ్వాలి. కుక్కర్ దించుకోవాలి.
5) ఇప్పుడు స్టవ్ మీద కళాయిపెట్టి నెయ్యి వేడి చేయ్యాలి.
6) పోపుదినుసులు, ఎండిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి వేసి వేగిన తరువాత ఈ తాలింపు పప్పులోవేసి కలపాలి. కొత్తిమీర కూడా వేసి మూతపెట్టి స్టవ్ ఆపాలి.
6) పోపుదినుసులు, ఎండిమిర్చి, కరివేపాకు, జీలకర్ర, వెల్లుల్లి వేసి వేగిన తరువాత ఈ తాలింపు పప్పులోవేసి కలపాలి. కొత్తిమీర కూడా వేసి మూతపెట్టి స్టవ్ ఆపాలి.