కావలసిన పదార్దాలు :
బాస్మతి బియ్యం : రెండు కప్పులు
జీలకర్ర : రెండు టీ స్పూన్లు
దాల్చిన చెక్క : చిన్నముక్క
లవంగాలు : ఐదు
యాలుకులు : ఐదు
బిర్యాని ఆకు : రెండు
కొత్తిమీర : చిన్న కట్ట తురమాలి.
నెయ్యి : రెండు టేబుల్ స్పూన్లు
నూనె : టేబుల్ స్పూన్
ఉల్లిపాయ : ఒకటి చక్రాల్లా కట్ చెయ్యాలి.
తయారుచేయు విధానం :
1) బియ్యం కడిగి నీళ్ళు పోసి అరగంట నానబెట్టాలి.
2) స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి నెయ్యి, నూనె వేడి చెయ్యాలి. కాగాక జీలకర్ర, బిర్యాని ఆకు, యాలుకులు, దాల్చిన చెక్క, లవంగాలు వేసి వేయించాలి.
3) వేగిన తరువాత బియ్యం, ఉప్పు వేసి కలిపి మూడు కప్పుల నీళ్ళు పోసి మూతపెట్టి చిన్నమంట మీద ఉడికించాలి. పది-పదిహేను నిముషాలకు వుడికిపోతుంది.
4) దీనిని కొత్తమీర, ఉల్లి చక్రాలతో అలంకరించి సర్వ్ చెయ్యాలి.